Monday, December 19, 2022

కొన్ని ముఖ్య శ్లోకములు

జన్మదిన శ్లోకం

జన్మదిన మిదం అయి ప్రియ సఖే( నామ)

శంతనోతుతే సర్వదా ముదమ్

ప్రార్ధయా మహే భవ శతాయుషి

ఈశ్వరః సదా త్వాం చ రక్షతు

పుణ్య కర్మణా కీర్తి మర్జయ

జీవనం తవ భవతు సార్ధకమ్


సౌందర్య లహరి– శ్లోకం – 27*

*జపోజల్పశ్శిల్పం సకలమపి  ముద్రా విరచనా*

*గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతివిధిః l*

*ప్రణామః సంవేశ స్సుఖ మఖిలమాత్మార్పణ దృశా*

*సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ll27॥*

ఓ ఈశ్వరీ ! నా మాటలన్నీ నీ జపమగు గాక! నా కార్యకలాపమంతయూ నీకు అర్పించే ముద్రలగుగాక! నా గమనము అంతయూ నీ ప్రదక్షిణమవుగాక! నేను తినెడి దంతయూ నీకు ఆహుతి అగుగాక! పరుండుట నీకు  నమస్కారమగుగాక! శబ్ద స్పర్శ రూప రస గంధాది సుఖములు ఏవైతే ఉన్నాయో అవి ! ఆత్మార్పణ బుద్దితో చేసే నీ పూజలగుగాక! నే చేసే ప్రతిపని నీ యందు సపర్యగా పర్య వసించుగాక! 


శనిదోష నివారణార్ధం శ్రీవేంకటేశ్వర శ్లోకములు 

ప్రతి శనివారము ఈ క్రింది శ్లోకములు 11 సార్లు పఠించినచో సకల శని దోషములు నివారణమగును.

1.శనిః శమయతే పాపం శనిః శతృ వినాశకః 

 యుగే కలౌ పాపనాశీ ధృవమ్‌ శ్రీపతి దర్శనమ్‌ ||        

2.ఓమ్ నమోవేంకటేశాయ పురుషాయ సదాత్మనే          

    శనిక్లేశ వినాశాయ గోవిందాయ నమోనమః


నరఘోష ఈర్ష్యా నివారక సూక్తం:

ఈరోజుల్లో ప్రతీఒక్కరూ ఈ నరఘోషను  అనుభవిస్తుంటారు. అలాంటి వారందరికీ *అధర్వ వేదంలో* *నరఘోష ఈర్ష్యా నివారక సూక్తం* చెప్పబడింది, దీనిని *ప్రతిరోజూ ఉదయాన్నే ప్రదోషకాలంలో పదకొండు సార్లు పఠించాలి, ఇలా ప్రతీరోజు పఠించేవారికి ఎంతటి బలమైన నరఘోషలు ఉన్నా, ఇంకా దృష్టి దోషాలు పడినా అన్నీ నశించి మీ జీవితం విజయమార్గంలో పురోగమిస్తుంది . ఇది ఎవరైనా పఠించవచ్చును.


అధర్వ ఋషిః అనుష్టుప్ ఛందః అదో యత్తేహృది శ్రితం మనస్కం పతయిష్ణుకం|*

తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృతేరివ||*


దీనిని భక్తితో పఠించాలి. ఎందుకంటే అధర్వవేదం చాలా శక్తివంతమైనది. అందులోని మంత్రాలు, సూక్తాలు చాలా అద్భుతమైనవి. శక్తివంతమైనవి.

నిత్యం పాటించతగినవి.

No comments: