*నీ వెంట వచ్చేది నీ మంచితనం తప్ప ఏది రాదు*
ఎక్కడ నీ బంధుగణం!?
ఎక్కడ నీ రక్తసంబంధం!?
ఎక్కడ నీ ఆత్మీయబృందం!?
ఎక్కడ నీ కులం!?
ఎక్కడ ..!?
పట్టు వస్త్రాలు పరుల పాలు
ఆస్తి,పాస్తులు బిడ్డల పాలు
విర్రవీగిన దేహం మట్టిపాలు
మరి నీవేంటి..!?
గుక్కెడు తులసి జలం
నోట్లో గుప్పెడు బియ్యం
తలపై రూపాయి నాణెం
ఒంటిపై తెల్లని వస్త్రం
ఇవి కూడా బూడిద పాలే
వీటి కోసమా..!?
పగలు,ప్రతీకరాలు
మోసపు జీవితాలు
నాటకపు బ్రతుకులు
కుళ్ళు,కుతంత్రాలు
నయవంచనలు
నమ్మకద్రోహాలు
నీతో వచ్చేదేంటి..!?
భార్య ఇంటి గుమ్మం వరకు
బిడ్డలు కట్టె కాలే వరకు
బంధువులు స్మశానం వరకు
కానీ నీ మంచితనం నీవు అస్తమించినా
ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.
నీ బ్రతుకు ఎలా ఉండాలంటే
నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..
నీ మరణం ఎలా ఉండాలంటే
నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి..
సేకరణ:-
No comments:
Post a Comment