Sunday, March 1, 2026

బ్రహ్మ విద్యకి, శ్రీవిద్య కి తేడా ఏమిటి?

 🌴 *బ్రహ్మ విద్యకి, శ్రీవిద్య కి తేడా ఏమిటి?* 🌴


*జవాబు* : *బ్రహ్మ విద్య మరియు శ్రీవిద్య అనేవి రెండూ సనాతన ధర్మంలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గాలు. వీటి లక్ష్యం ఒక్కటే ( మోక్షం ) అయినప్పటికీ, సాధన చేసే విధానం మరియు దృష్టి కోణంలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.*


👉 *వాటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను కింద చూడవచ్చు*


01. *బ్రహ్మ విద్య ఇది ప్రధానంగా జ్ఞాన మార్గం.*

      *ఉపనిషత్తుల సారాంశమే బ్రహ్మ విద్య.*

*లక్ష్యం:* *"అహం బ్రహ్మాస్మి"* (నేనే బ్రహ్మమును) అనే సత్యాన్ని తెలుసుకోవడం.

*మార్గం:* విచారణ ఇది ఎక్కువగా మేధోపరమైనది మరియు నిరాకారమైనది.

*సాధన:* "శ్రవణం (వినడం), మననం (మననం చేసుకోవడం), నిధిధ్యాసనం (ధ్యానం చేయడం) ద్వారా పరమాత్మను చేరుకోవడం.

 *రూపం* : దీనికి రూపం ఉండదు. పరమాత్మను నిర్గుణ, నిరాకార తత్వంగా (ఏ లక్షణాలు లేని శక్తిగా) చూస్తుంది."


02. *శ్రీవిద్య -ఇది ప్రధానంగా ఉపాసనా మార్గం.*

       *ఇది తంత్ర శాస్త్రం మరియు భక్తి కలయిక.*

*లక్ష్యం:* లలితా త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం ద్వారా ఐహిక సుఖాలను (భుక్తి) మరియు చివరకు మోక్షాన్ని (ముక్తి) పొందడం.

 *మార్గం:* మంత్రం, యంత్రం (శ్రీచక్రం), మరియు తంత్రం (పూజా విధానం).

*సాధన:* గురువు ద్వారా ఉపదేశం పొంది, మంత్ర జపం మరియు శ్రీచక్రార్చన చేయడం. ఇది కుండలినీ యోగంతో ముడిపడి ఉంటుంది.

*రూపం:* ఇది సగుణ ఆరాధన.

*పరమాత్మను "జగన్మాత"గా, అమ్మవారిగా భావిస్తుంది.*


// *బ్రహ్మ విద్యకు ప్రధాన గ్రంథాలు ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు*

*శ్రీ విద్యకు ప్రధాన గ్రంథాలు లలితా సహస్రనామం, సౌందర్య లహరి, తంత్ర గ్రంథాలు*


❗*బ్రహ్మ విద్య నిర్గుణ బ్రహ్మం (నిరాకారం)*

❗*శ్రీ విద్య పరాశక్తి (సగుణ రూపం)*


🪷 *బ్రహ్మ విద్య సాధనా పద్ధతి జ్ఞానము మరియు వివేచన*

🪷 *శ్రీ విద్య సాధనా పద్ధతి జపం, హోమం మరియు శ్రీచక్ర పూజ.* 


// *బ్రహ్మ విద్య ప్రపంచం మాయ అని చెప్తుంది.. శ్రీ విద్య ప్రపంచం అమ్మవారి స్వరూపమని చెప్తుంది*.


// *శ్రీవిద్యను సాధన చేసే వారు చివరకు చేరుకునేది బ్రహ్మ విద్యనే.*


// [ *అందుకే శ్రీవిద్యను "సగుణ బ్రహ్మ విద్య" అని కూడా అంటారు.*

*బాహ్య పూజల ద్వారా ప్రారంభమై, అంతిమంగా తనలో ఉన్న శక్తిని గుర్తించడమే రెండింటి పరమార్థం*.]

*ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                

సేకరణ

Friday, December 12, 2025

పుట్టినతిథిని బట్టి ఆయా తిథి దేవత* *ఆరాధన.

 *పుట్టినతిథిని బట్టి ఆయా తిథి దేవత* *ఆరాధన.*

*చంద్రకళలను బట్టి నిత్య దేవతారాధన..............!!*


*దక్ష ప్రజాపతి ఇరువై ఏడుగురు కుమార్తెలను* *పరిణయమాడిన చంద్రుడు రోహిణిపై ఎందుకో* 

*మిక్కిలి ప్రేమ చూపెడివాడు,* 

*ఈ విషయమై మందలించిన దక్షుని* *మాటను మన్నించని చంద్రుని దక్షుడు కోపగించి క్షయ వ్యాధితో బాధపడమని శపించగా, శాపవశాన చంద్రుడు క్షీణించసాగాడు.*


*అమృత కిరణ స్పర్శలేక దేవతలకు అమృతం* *దొరకడం కష్టమైనది. ఓషదులన్ని క్షీణించినవి,* 

*అంత ఇంద్రాది దేవతలు చంద్రుని తోడ్కొని బ్రహ్మదేవుని కడకేగి పరిష్కార మడిగారు.* 


అంత చతుర్ముఖుడు చంద్రునికి మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. 

ప్రభాస తీర్థమున పరమశివునికి దయగల్గి ప్రత్యక్షమవగా చంద్రుడు శాపవిముక్తికై ప్రార్థించెను. 

అంత పరమేశ్వరుడు చంద్రుని అనుగ్రహించి..


కృష్ణపక్షాన కళలు క్షీణించి, శుక్లపక్షమున ప్రవర్ధమానమై పున్నమి నాటికి పూర్ణ కళతో భాసిల్లుమని వరమిచ్చాడు. 

కళలు చంద్రునికి సూర్యునికి మధ్య దూరం మీద ఆధారపడి ఉంటుంది. 


అత్యల్పదూరం అమావాస్య.

అత్యధిక దూరం పౌర్ణమి. 

చంద్రుడు భూమి చుట్టూ..భూమి సూర్యునిచుట్టూ పరిభ్రమిస్తూఉంటాయి. 

16 కళలు అనివీటినే అంటారు. 

వాటికి పేర్లు ఉన్నాయి - 


చంద్రుని పదహారు కళలు:

1. అమృత.

2. మానద, 

3. పూష, 

4. తుష్టి, 

5. పుష్టి, 

6. రతి ధృతి, 

7. కామదాయిని, 

8. శశిని, 

9. చంద్రిక, 

10. కాంతి, 

11. జ్యోత్స్న, 

12. శ్రీ, 

13. ప్రీతి, 

14. అంగద, 

15. పూర్ణ, 

16. అపూర్ణ. 


15 తిథులకు 16 ఎందుకు అంటే పూర్తి పౌర్ణమి,

పూర్తి అమావాస్య ఘడియలు అనేవి స్వల్ప సమయమే ఉంటాయి.


ఈ 16 కళలకు నిత్యం ఆరాధింపవలసిన దేవతలు ఉన్నారు.

నిత్యాదేవతలు మొత్తం 16 మంది.

15 నిత్యలను శ్రీచక్రత్రికోణంలోని ఒక్కొక్క రేఖ యందు ఐదుగురు చొప్పున పూజించి..

16వ దైన లలితా త్రిపుర సుందరీదేవిని బిందువు నందు పూజించాలి.


జాతకం ప్రకారం ఎవరు ఏ తిధిన జన్మిస్తే 

ఆయా దేవతా మంత్రాలను 11 సార్లు జపించాలి.

లేదా ఆయా తిధులను బట్టి ఆయా మంత్రాలను 

ప్రతిరోజు 11 సార్లు పఠించటం మంచిది.

అవి..


బహుళ పాడ్యమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ విదియ.

ఈ తిథినాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ తదియ.

ఈ తిథినాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ చవితి.

ఈ తిథినాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ పంచమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ షష్ఠి.

ఈతిథినాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ సప్తమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ అష్టమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ నవమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ దశమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ ఏకాదశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ ద్వాదశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “విజయా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ త్రయోదశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


బహుళ చతుర్ధశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


అమావాస్య.

ఈ తిథినాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల పాడ్యమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “చిత్రా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం అం “చిత్రే” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల విదియ.

ఈ తిథినాడు పుట్టిన వారు “జ్వాలామాలినీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఔం “జ్వాలామాలినీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల తదియ.

ఈ తిథినాడు పుట్టిన వారు “సర్వమంగళా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఓం “సర్వమంగళా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల చవితి.

ఈ తిథినాడు పుట్టిన వారు “విజయా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఐం “విజయా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల పంచమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “నీలపతాకా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఏం “నీలాపతాకా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల షష్ఠి.

ఈ తిథినాడు పుట్టిన వారు “నిత్యా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ౡం “నిత్యా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల సప్తమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “కులసుందరీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఌం “కులసుందరీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల అష్టమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “త్వరితా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ౠం “త్వరితా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల నవమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “శివదూతీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఋం “శివదూతీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల దశమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “మహావజ్రేశ్వరీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఊం “మహావజ్రేశ్వరీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల ఏకాదశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “వహ్నివాసినీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఉం “వహ్నివాసినీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల ద్వాదశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “బేరుండా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఈం “బేరుండా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల త్రయోదశి.

ఏటిదినాడు పుట్టిన వారు “నిత్యక్లిన్నా దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఇం “నిత్యక్లిన్నా” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


శుక్ల చతుర్ధశి.

ఈ తిథినాడు పుట్టిన వారు “భగమాలినీ దేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం ఆం “భగమాలినీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి.


పౌర్ణమి.

ఈ తిథినాడు పుట్టిన వారు “కామేశ్వరీదేవి”ని 

“ఓం ఐం హ్రీం శ్రీం అం “కామేశ్వరీ” 

నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః 

అనే మంత్రంతో పూజించాలి. 

Monday, October 27, 2025

మహాభారతంలో ఉన్న 18 పర్వాల పేర్లు

 మహాభారతంలో ఉన్న 18 పర్వాల పేర్లు, ప్రతీ పర్వంలో జరిగిన కథను క్లుప్తంగా వివరించగలరా?

ఆ పదునెనిమిది పర్వాలు వరుసగా ఇవి.


01 . ఆది పర్వము:


ఇందులో మహాభారత కధ మొత్త్తం సంగ్రహంగా చెప్పబడుతుంది. మీరడిగిన ప్రశ్నకు సమాధానంగా రెండవ అధ్యాయంలో " సర్వ సంగ్రహ పర్వము" అన్న పేరిట ఏ పర్వంలో ఏమున్నదో సంగ్రహంగా చెప్పబడుతుంది.


ప్రతీ పర్వంలోను అనేక ఉపపర్వాలు ఉంటాయి.. ఉదాహరణకు అది పర్వంలో 19 పర్వాలు ఉన్నాయి. కౌరవ పాండవుల కధ మేరకు పరిశీలిస్తే వారి వారి పుట్టుకనుంచి ( నిజానికి వారు పుట్టకముందునుంచి, ఇంకా ముందునించి కూడా) , వారి బాల్యం, విద్యాభ్యాసం. కురు పాండవుల తగాదాలు, ధర్మరాజు యువరాజుగా అభిషిక్తుడవడం , లక్క ఇల్లు కాలడం, పాండవులు చనిపోయారని అందరు నమ్మడం, విదురుడి సహాయంతో పాండవులు బయపడి రహస్య జీవితం గడపడం, హిడింబాసుర వధ, హిడింబ ద్వారా ఘటోత్కచుడిని కొడుకుగా పొందడం, ఏకచక్రపురంలో బ్రహ్మచారులుగా జీవితం , భీముడు బకాసురిని చంపడం,వ్యాసుని సలహా మేరకు ద్రౌపది స్వయంవరంలో పాల్గొని ఆమెను అర్జునుడు గెలుచుకోవడం, పాండవులు ఐదుగురు ఆమెను వివాహమాడటం, మొదటిసారిగా కృష్ణుడి పాత్ర ప్రవేశం, వారి సమాగమం , ధృతరాష్ట్రుడు రాజ్యం విభజించి ధర్మరాజును ఖండవప్రస్తం ఏలుకోమనడం, ధర్మరాజు పట్టాభిషేకం,ఇంద్రాప్రస్థనిర్మాణం , కృష్ణార్జునుల వల్ల ఖాండవదహనం, అర్జునిడికి గాండీవం, అక్షయ తూణీరం, కపిధ్వజంతో ఉన్న రధం అమరడం,ఇంద్రుడి యుద్ధవిరమణ, మయ పరిచయం ఇత్యాదులు .


02 ) సభా పర్వం:


మయసభ కారణంగా దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ద్యూతసభ కారణం కూడా కావచ్చు. ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొందాక ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు. దానికి గాను నలుగురు తమ్ముళ్లు నాలుగు దిక్కులు జయించడం , దానికి ముందుగా జరాసంధ వధ, రాజసూయ యాగం, శిశుపాల వధ, మయసభలో దుర్యోధనుని అవమాన ఆభాస.ధృతరాష్ట్రుడు శకుని వ్యూహానుసారం ధర్మరాజును జూదానికి పిలవడం, ధర్మరాజు తనను, తమ్ముళ్లను, ద్రౌపదిని కూడా ఒడ్డి ఓడిపోవడం, ద్రౌపదిని సభకు దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాక్కు రావడం, ద్రౌపది ప్రశ్న,ద్రౌపదివస్త్రాపహరణ విఫల ప్రయత్నం, భీముడి రౌద్ర ప్రతిజ్ఞలు,ద్రౌపదిని అనుగ్రహించి ధృతరాష్ట్రడు సర్వం తిరిగి ఇచ్చేయడం, అనుద్యూతం, ధర్మరాజు ఓడిపోయి 12 ఏళ్ళ అరణ్యవాసానికి 1 ఏడాది అజ్ఞాతవాసానికి కట్టుబడి రాజ్యాన్ని వదిలి అడవులకు పోవడం.


౦౩) అరణ్యపర్వం :


పాండవులు కామ్యకవనం చేరడం, కిర్మీర వధ, యాదవులు ,పాంచాలులు, చేది ,కేకయ రాజులు వచ్చి కలుసుకోవడం, యుద్ధానికి ధర్మరాజు విముఖత, ద్వైత వనం చేరడం , వ్యాసుడి సలహా మేరకు అర్జునుని ధర్మరాజు ప్రతిస్మృతి ఉపదేశించి తపస్సుకు పంపడం, పరమశివుని గురించి తపస్సు చేయమని ఇంద్రుడు చెప్పడం , అర్జునిడి ఉగ్ర తపస్సు, , కిరాతకుని రూపంలో శివుని రాక, పరీక్షా , పాశుపతాస్త్ర ప్రదానం, దిక్పాలకులు అనేక అస్త్రాలు ఇవ్వడం, అర్జునిని దేవేంద్రుడు స్వర్గలోకం తీసుకువెళ్లడం, చిత్రసేనుడు వద్ద సంగీతనృత్యాలు నేర్చుకోవడం, ఇంద్రుడి వద్ద ధనుర్విద్యలో మెళుకువలు తెలుసుకోవడం, ఊర్వశి శాపం, నివాతకవచులను జయించి పెట్టడం , ఇలా ఐదేళ్లు గడిపి గంధమాదన పర్వతం మీద తనవారిని కలుసుకోవడం, ఈలోపు మిగిలిన పాండవులు లోమసమహర్షితో అనేక తీర్థాలు తిరిగీ గంధమాదనం చేరడం.భీముడికి సంబంధించి నహుష వృత్తాంతం , జటాసుర వధ, సౌగంధిక పుష్పాలు తేవడం, కుబేరుడి అనుచరులతో యుద్ధం, దారిలో హనుమంతునితో కలయిక, కుబేరుని అనుచరుడు మణిభద్రుడిని చంపడం,అందరు కలిసి తిరిగి ద్వైత వనం చేరడం, దుర్యోధనుడి ఘోష యాత్ర, చిత్రసేనుడి చేతిలో పరాభవం, పాండవుల ద్వారా విడుదల,కర్ణుడి శపధం, దిగ్విజయ యాత్ర, వైష్ణవ యాగం,ఇంద్రుడు కవచకుండలాలలను హరించడం, ద్రౌపతిని జయద్రధుడు అపహరించడం, జయద్రధ పరాభవం ,కర్ణుడు వాసవీ శక్తీ పొందడం. పాండవుల అరణ్యవాస సమయ పూర్తి, యక్షప్రశ్నలు , యముని ఆశీర్వాదం.పాండవులు విరాట నగరం చేర నిర్ణయం.


ఈ పర్వంలోనే ఋషుల ద్వారా ధర్మరాజు అనేక పురాణ గాధలు వినడం. నలదమయంతుల కధ, రామాయణం, అగస్త వృత్తాంతం, సావిత్రి చరిత్ర మొదలయినవి.బృహదశ్వుని ద్వారా ధర్మరాజు అక్షవిద్య కూడా అభ్యసిస్తాడు.మరో మారు జూదం ఆడాల్సి వస్తే ఓడిపోకుండా ఉండటానికి.


04 )


విరాట పర్వం:


పాండవులు వివిధవేషాలతో విరాటుడి కొలువులో చేరుతారు.ధర్మరాజు కంకుడనే జూదమిత్రుడుగా, భీముడు వలలుడనే పేరుతో వంటవాడిగా, అర్జునుడు బృహన్నలపేరుతో పేడి వేషంలో ఉత్తరకు నృత్య శిక్షకుడిగా , నకుల సహదేవులుగ్రంధికుడు ,తంత్రీపాలుడు అన్నపేర్లతో అశ్వ శిక్షకుడు, గోరక్షకుడుగా చేరుతారు.ద్రౌపది మాలిని అన్న పేరుతోసైరంధ్రి గ రాణి సుధేష్ణ దగ్గర ఆంతరంగిక పరిచారికగా చేరుతుంది. కీచకుడు చివర్లో ద్రౌపదిని మోహించడం, అవమానించడం , భీముని చేతిలో వధింపబడటం, ఉపకీచకులు వంద మంది ద్రౌపదిని తమ అన్న కీచకుడితో పాటు దహనం చేయడానికి తీసుకుపోతూ వుంటే భీముడు గంధర్వుడిలా వచ్చి అందరిని సంహరించడం,కీచక వద్ద భీముడే చేసి ఉంటాడని దుర్యోధనుడు ఊహించడం. త్రిగర్త రాజు సుశర్మ దక్షిణ గోగ్రహణం హస్తినాపురం సైన్యం ఉత్తర గోగ్రహణం ఒక రోజు తేడాలో చేయడం. విరాటుడిని సుశర్మ బారి నుండి భీముడు రక్షించి సుశర్మను పరాభూతుడిని చేయడం ఉత్తర గోగ్రహణాన్ని అడ్డుకోవడానికి ఉత్తర కుమారుడు బృహన్నల సారధ్యంలో వెళ్లడం, భయపడ్డాఉత్తరుడికి నిజం చెప్పి అర్జునుడు నిజరూపంలో ఉత్తరుడు సారధిగా కౌరవులను జయించడం, విరాటుడు ముందు పొరబడినాపాండవులను గుర్తించి గౌరవించడం ,ఉత్తరను అర్జునుడు అభిమన్యుడి భార్యగా ఒప్పుకోవడం , పాంచాలులు , యాదవులు విరాటనగరం రావడం,శ్రీకృష్ణుని సమక్షంలో ఉత్తర అభిమన్యుల వివాహం జరగడంతో విరాట పర్వం ముగుస్తుంది.


05 )


ఉద్యోగ పర్వం


ఉత్తరాభిమన్యుల వివాహానంతరం పాండవ పక్షీయులందరు ఉపప్లావ్యంలో సమావేశం. దుర్యోధనుడు మంచి మాటలతో లొంగడు కనుక ఒక పక్క యుద్ధ సహాయం సమీకరించుకుంటూనే అనుకున్న ఒప్పందం ప్రకారం తమ రాజ్యాన్ని ఇవ్వవలసినదని ద్రుపదుడి పురోహితుడు ద్వారా రాయబారం జరిపిస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోతాడు. రాయబారితో ధృతరాష్ట్రుడు సమాధానం పంపుతానని తమ తరఫున సంజయుడిని పంపిస్తాడు. సంజయుడు ధృతరాష్టృని మనోగతాన్ని వివరిస్తాడు. తన కొడుకు తన మాట వినడు కనుక ధర్మరాజు నాశనాశనకరమయిన యుద్ధం చేయవద్దని సలహా. ఈలోపుగా ఇరు పక్షాలు యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. శ్రీకృషుని దగ్గరకు అర్జునుడు దుర్యోధనుడు సహాయానికి వెళితే యుద్ధం చేయని కృష్ణుని అర్జునుడు సారధిగా కోరుకుంటాడు, దుర్యోధనుడు ఒక అక్షోహిణీ నారాయణసేనతో తృప్తి పడతాడు. బలరాముడు తాను ఎవరి తరఫున యుద్ధం చేయనని చెబుతాడు. కృతవర్మ ను కలిసి దుర్యోధనుడు ఆనందంగా వెళ్ళిపోతాడు. పాండవుల కు సహాయం చేయడానికి వచ్చే శల్యుడిని దుర్యోధనుడు మభ్యపెట్టి తనవైపు యుద్ధం చేసేలా తిప్పుకుంటాడు. ఆ విధంగా పాండవులకు ఏడు , కౌరవులకు పదకొండు అక్షోహిణీల సైన్యం సమకూరుతుంది.సంజయ రాయబారిని ప్రతిగా శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు వెళతాడు దుర్యోధనుడు అయిదు ఊళ్లు ఇవ్వడానికి కూడా నిరాకరించి శ్రీకృష్ణుడిని బందీ చేద్దామనే ఆలోచన చేస్తాడు. శృకృష్ణుడు కోపించి తాను ఒక్కడే రాలేదనీ తనలో అనంత విశ్వం ఉన్నదనీ విశ్వరూపం చూపిస్తాడు. అంత అయినాక ధృతరాష్ట్రుడు తన అసహాయత వ్యక్తం చేస్తాడు. శ్రీకృష్ణుడు వెళ్తూ వెళ్తూ కర్ణుడికి అతడి జన్మరహస్యం గుర్తు చేసి పాండవపక్షంలో యుద్ధం చేయమని కోరుతాడు. అది సమంజసం కాదని కర్ణుడు నిరాకరిస్తాడు. కుంతి కూడా అదే కోరిక కర్ణుడిని కోరితే కర్ణుడు తాను దుర్యోధనుడి తరఫున యుద్ద్ధం చెయ్యక తప్పదని , అయితే యుద్ధంలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని అవకాశం వచ్చినా చంపనని మాట ఇస్తాడు.భీష్ముడికి సర్వసైన్యాధిపత్వం ఇవ్వబడుతుంది. తమ పక్షంలోను పాండవ పక్షంలోను ఉన్న వీరుల బలాబలాలు లెక్కచూపే సమయంలో కర్ణుడిని అర్ధరధుడిగా నిర్ధారిస్తే , భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నన్నిరోజులు తాను యుద్ధం చేయనని కర్ణుడు శపధం చేస్తాడు. పాండవుల తరఫున ద్రుష్టద్యుమ్నుడిని సర్వసైన్యాధిపతిగాను, అర్జునిడిని సేనాపతులకు అధినేత గాను , కృష్ణుని అర్జునికి అధినేతగాను , సారధి గాను ధర్మరాజు ప్రకటిస్తాడు.చివరగా శకుని కొడుకు ఉలూకుని ద్వారా దుర్యోధనుడు యుద్ధానికి రమ్మని రెచ్చగొడుతూ సందేశం పంపిస్తాడు.అతడిద్వారానే పాండవులు ప్రతిసందేశం పంపిస్తారు.భీష్ముడు తాను శిఖండితో యుద్ధం చేయనని చెబితే ఆ వృత్తాంతం వినగోరుతాడు దుర్యోధనుడు.భీష్ముడు తాను కాశీరాజు కుమార్తెలను ఎత్తుకొని రావడం, అంబావృత్తాంతం, శిఖండి పుట్టుక, ముందు స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన వైనం చెబుతాడు. కురుక్షేత్రం యుద్ధభూమిగా నిర్ణయించబడుతుంది. కురు పాండవ సేనలు యుద్ధానికి బయలుదేరడంతో ఈ పర్వం ముగుస్తుంది.


06 )


భీష్మ పర్వం:


ఇక్కడనుంచి , భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలు నాలుగు యుద్ధ పర్వాలు.


వ్యాసమహాముని ఇచ్చిన దివ్యదృష్టితో ధృతరాష్ట్రుడికి యుద్ధ వివరాలు చెప్పడానికి నియుక్తుడయి ముందుగా ద్వీపాల వివరాలు , అవీ చెబుతాడు. యుద్ధం మొదలవుతుంది.ధర్మరాజు భీష్మాదుల ఆశీర్వచనాలు తీసుకుంటాడు. యుయుత్సుడు పాండవ పక్షానికి చేరుతాడు. అర్జునుడి విషాదయోగం, గీతోపదేశం జరిగాక యుద్ధం మొదలవుతుంది.భీష్ముడి పరాక్రమం తట్టుకోలేక పాండవులు భీష్ముడిని వధోపాయం అడుగుతారు.శిఖండిని అడ్డు పెట్టుకొనియుద్ధం చెయ్యమని సలహా ఇస్తాడు. పదిరోజులు యుద్ధంలో భీష్ముడు పరాక్రమించి , పదోరోజు శిఖండి అర్జునుడి వేసిన బాణాల వల్ల తీవ్రంగా గాయపడి రధం మీదనించి పడతాడు.అంపశయ్య పై వాలిన భీష్ముడికి శరాలతో తలదిండు అమర్చి , గంగను రప్పించి దాహం తీరుస్తాడు అర్జునుడు .తాను పోయిన తర్వాతనయినా సంధి చేసుకోమని దుర్యోధనుడిని అడుగుతాడు. అలా బాణాల మీద పడుకుని ఉత్తరాయణం గురించి ఎదురు చూసే భీష్ముడి వద్దకు కర్ణుడు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు.


07 )


ద్రోణ పర్వం:


ఇది భీష్ముడు పడిన అనంతరం అయిదు రోజులపాటు ద్రోణుని సేనాధిపత్యంలో జరిగిన యుద్ధ కధ. చాలామంది వీరులు మరణించిన పర్వం కూడా.ద్రోణుడికి సర్వసైన్యాధక్ష పదవినిచ్చి గౌరవిస్తాడు దుర్యోధనుడు; ధర్మరాజును ప్రాణాలతో పట్టివ్వమని కోరుతాడు. కర్ణుడు కూడా రంగ ప్రవేశం చేస్తాడు. చక్రవ్యూహంలో అభిమన్యుడి వధ. ప్రతీకారంగా అర్జునుడి చేతిలో సైంధవ సంహారం , భూరిశ్రవుడిని అర్జునుడు చేయి నరకడం, ప్రాయోపవేశంలో ఉన్న అతడి తలను సాత్యకి నరకడం, రాత్రియుద్ధం మొదలు. ఆలంబసుడుని ఘటోత్కచుడు చంపి విజృంభిస్తే గత్యంతరం లేక అర్జునుడి కోసం దాచిన శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడిని చంపడానికి వాడటం,చివరగా , ధర్మరాజు 'అశ్వద్ధామ హతః కుంజరః' అనే అర్ధసత్యంతో ద్రోణుడిని యుధవిముఖుడిని చేయడం, యోగంలోఉన్న ద్రోణుడి తలని ధృష్టద్యుమ్నుడు ఖండించడం , అశ్వద్ధామ కోపించి నారాయణాస్త్రం ప్రయోగించి తీవ్ర నష్టం కలిగంచడంతో ఈ పర్వం ముగుస్తుంది.


08 )


కర్ణ పర్వం:


ద్రోణుని మరణం తరువాత కర్ణుడు సర్వసైన్యాధిపత్వం వహిస్తాడు. అతను యుద్ధం చేసింది స్వీయ నాయకత్వంలో ఒకటిన్నర రోజులే. తల్లికిచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కర్ణుడు. దుశ్శాసనుడితో సహా అనేకమంది కౌరవులను భీముడు చంపేస్తాడు. కర్ణుడు భార్గవాస్త్రంతో పెద్ద నష్టం కలిగిస్తాడు. తనని పరామర్సించడానికొచ్చిన అర్జునిడిని ధర్మరాజు కర్ణుడికి వెరచి వచ్చావని నిందిస్తే అర్జునుడు తన గాండీవాన్ని దూషించిన వారిని వధించే వ్రతనియమం ఉన్నా కృష్ణుని సలహా మేరకు నిందించి వ్రత పాలన పాటిస్తాడు. తరువాత నిందించినందుకు బాధపడి ఆత్మహత్య చేసుకోబోతే దానికి మారుగా తనని తాన పొగుడుకంటే అది ఆత్మహత్యతో సమానమనే కృష్ణుని సలహా పాటించి బయటపడతాడు.


ఆ విధంగా శ్రీకృష్ణుడు వారిద్దరిని ఒకటి చేసి అర్జునిడిని కర్ణ వధకు తీసుకెళతాడు. చివరి రోజు కర్ణుడికి శల్యసారధ్యం లభిస్తుంది. ధర్మరాజు కోరిక మేరకు శల్యుడు కొంత తేజోవధ చేస్తాడు. ఇద్దరికి పెద్ద వాదన అవుతుంది. దుర్యోధనుడు ఇద్దరికీ సర్ది చెబుతాడు. కర్ణుడి కొడుకు వృషసేనుడుని అర్జునుడు చంపేస్తాడు. కర్ణార్జునల మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది.కర్ణుడి నాగాస్త్రం విఫలమవుతుంది. అతడి శాపాలు పని చేయడం ప్రారంభిస్తాయి. రధచక్రం భూమిలో కూరుకుపోతుంది.యెంత ప్రయత్నించినా రాదు.కర్ణుని చివరి ఘడియలు సమీపిస్తాయి. శ్రీకృష్ణ ప్రేరణతో అర్జునుడు వేసిన బాణం వల్ల కర్ణుడి తల తెగి పడుతుంది.ధర్మరాజు వచ్చిపడిపోయిన కర్ణుడిని చూసి హర్షిస్తాడు. దుర్యోధనుడు విచారిస్తే శల్యుడు ఓదారుస్తాడు.పదిహేడవ రోజు యుద్ధం, కర్ణపర్వం ముగుస్తాయి.


09 )


శల్య పర్వం:


శల్యుడు సర్వసైన్యాధిపతి అవుతాడు. సర్వశక్తులతో అద్భుతంగ యుద్ధం చేసినా చివరికి ధర్మరాజు చేతిలో మరణిస్తాడు. సహదేవుడు శకునిని అతని కొడుకు ఉలూకుడిని తన ప్రతిజ్ఞ నిలబెట్టుకుంటూ చంపేస్తాడు.

కౌరవుల తరఫున అశ్వద్ధామ, కృతవర్మ, కృపాచారుడు తప్ప వీరులు, మిత్రులు, కుమారులు, సోదరులు ఎవ్వరూ మిగలరు. అలిసిపోయి, నిరాశతో దుర్యోధనుడొక్కడు కేవలం గద తీసుకుని నడుచుకుంటూ ఒక మడుగులో జలస్తంభన విద్య ప్రయోగించి కూర్చుంటాడు. పాండవులు వెదకడంలో తెలుసుకుని మడుగు చుట్టూ చేరుకొని దుర్యోధనుడిని మాటలతో యుద్ధానికి ప్రేరేపిస్తారు. తన ఇష్టమయిన ఆయుధంతో యుద్ధం చేయవచ్చని దుర్యోధనుడు చెప్పగా భీముడితో గద యుద్ధానికి సిద్ధపడి మడుగునుంచి బయటకు వస్తాడు. ఈ లోగాబలరాముడు కూడా అక్కడికి చేరుకుంటాడు. ద్వంద్వ యుద్ధంలో దుర్యోధనుడి తొడల మీద గద ప్రహారం చేసి , పడగొట్టి విజయం సాధిస్తాడు భీముడు. బలరాముడు భీముడు తొడల మీద కొట్టడం తప్పని నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోతాడు. దుర్యోధనుడుశ్రీకృష్ణుడిని నిందిస్తే , అతని అధర్మాలన్నీ గుర్తు చేస్తాడు కృష్ణుడు. దుర్యోధనుడు స్పృహ కోల్పోగా శ్రీకృష్ణుడు పాండవులు వెనుకకు మరలి ఆ రాత్రికి నాదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత దుర్యోధనుడిని వెదుకుకుంటూ అశ్వద్ధామ, కృతవర్మ, కృపాచార్యుడు వచ్చి చూస్తారు. అతని స్థితి చూసి బాధపడతారు. అశ్వద్ధామ యుద్ధం ఇంకా ముగియలేదని , తానూ ప్రతీకారం తీర్చుకుంటాని చెబితే దుర్యోధనుడు అతడిని సర్వసైన్యాధిపతిగా నియుక్తుని చేస్తాడు.అశ్వద్ధామ ఆ ఇరువురిని తీసుకుని బయలుదేరడంతో శల్యపర్వం ముగుస్తుంది.


10 )


సౌప్తిక పర్వం:


అశ్వద్ధామ , కృతవర్మ,కృపాచార్యుడు ఆ రాత్రి తమ శిబిరాలకు వెళ్లరు, అప్పటికే పాండవులు ఆ శిబిరాలను ఆక్రమించారు. కౌరవ స్త్రీలందరు , మంత్రులు యుయుత్సుడి ఆధ్వర్యంలో హస్తినాపురానికి వెళ్లిపోయారు. ఒక చెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తున్న అశ్వద్ధామకు చీకట్లో ఒక గుడ్లగూబ పక్షుల్ని నాశనం చేయడం కనిపిస్తుంది. అశ్వద్ధామ


ఆ రాత్రికే యుద్ధం చేయాలనీ నిశ్చయించుకుని ఇద్దరు వీరులను నిద్ర లేపుతాడు. ముందు వారించినా అశ్వద్ధామ పట్టుదలతో వారూ అతడిని అనుసరిస్తారు. అశ్వద్ధామ ఒక్కడే శిబిరంలో ప్రవేశించి శివుడి అనుగ్రహం ద్వారా ల అసాధారణ కార్యం సాధించి ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు తో బాటు అడ్డు వచ్చ్చిన వీరులందరని ఊచ కోత కోస్తాడు. కృప కృతవర్మలు శిబిరానికి నిప్పు పెట్టి బయటకు వచ్చినవారినందరిని చంపేస్తారు.ఆ విధంగా మారణకాండ సాగించి ఆ వార్త చనిపోబోతున్న దుర్యోధనుడికి చెబుతారు. దుర్యోధనుడు వారిని కౌగలించుకుని స్వర్గస్తుడవుతాడు.


జరిగిన సంగతి తెలిసి భీమార్జునులు పారిపోయిన అశ్వద్దామను వ్యాసాశ్రమంలో పట్టుకుంటారు. ఆ యుద్ధంలో అశ్వద్ధామ ఓడిపోయి తన శిరోమణి ఇచ్చేసి జీవం దక్కించుకుంటాడు,అయితే అశ్వద్ధామ బ్రహ్మ శిరోనానామకఉత్తర గర్భం మీద అస్త్రంఆమంత్రిస్తాడు. ' అపాండవం చేస్తానని చెప్పి వేసిన అస్త్రం అది.దీనితో సౌప్తిక పర్వం ముగుస్తుంది.


,


11 )


స్త్రీ పర్వం:


యుద్ధం ముగిసింది. విదురుడు ధృతరాష్ట్రుడిని ఊరడిస్తాడు. చనిపోయినవారిని చివరిసారిగా చూడటానికి ధ్రితరాష్ట్రుడు, గాంధారి, కుంతి,విదురుడు , కౌరవుల భార్యలు, కోడళ్ళు,,కర్ణుని భార్యలు,అనేకమంది రాజుల భార్యలు కురుక్షేత్రానికి వస్తారు. పాండవులు , ద్రౌపది, మిగిలిన స్త్రీలు చాలామంది వస్తారు. గాంధారికి వ్యాసుడు కొడుకులందరిని చూసుకునే శక్తీనిస్తాడు. విలపిస్తున్న కోడళ్లను చూసిన గాంధారికి పాండవుల మీద కోపం వచ్చ్చి శపించాలనుకొంటుంది.ఆ సంగతి గ్రహించిన వ్యాసుడు ఆమెకు నచ్చచెప్పి మనసు మళ్లిస్తాడు. భీముడ్ని కౌగలించుకుని ధృతరాష్ట్రుడు గట్టిగ అదుముతాడు.కృష్ణుడు ఉండగానే గ్రహించి భీముడికి బదులు ఇనపవిగ్రహం పెట్టడంతో భీముడు రక్షింపబడతాడు, విగ్రహం పిప్పి అయిపోతుంది.ధృతరాష్ట్రుడు కోపం తగ్గి పాండవులందరిని ఆదరిస్తాడు. పాండవులు గాంధారికి ప్రణామం చేస్తారు. గాంధారి కోపం, శోకం అణుచుకున్నా ఆమె చూపు ధర్మరాజు పాదాల మీద పది గోర్లు నల్లగా కమిలిపోతాయి. ఒక్క కొడుకునీ మిగల్చలేదని ,దుర్యోధనుడిని తొడలమీద కొట్టాడని,దుశ్శాసనుడు రక్తం తాగాడని భీముడిని నిష్టూరమాడుతుంది. తన ప్రతిజ్ఞ వల్ల ఆలా చేసానని,లేకుంటే ఆమె కొడుకును చంపడం సాధ్యం కాదని, రక్తం నోటిలో తీసుకున్న తగ్గలేదని చెప్పి తప్పుకుంటాడు భీముడు. గాంధారి కోపం కృష్ణుడి మీదకు మళ్లుతుంది. యాదవులందరు కృష్ణబలరాములతో సహా ఇప్పటినించి 36 సంవత్సరాలకి నాశనం అవుతారని శపిస్తుంది. విధి అలాగే నిశ్చయించనుందని శ్రీకృష్ణుడు శాపాన్ని స్వీకరిస్తాడు. దహనసంస్కారాల సమయంలో కర్ణుడు కూడా తన కొడుకేనని అతనికి కూడా పాండవులు తర్పణం వ్వవలసి ఉన్నదని కుంతి కర్ణుడి జన్మరహస్యం చెబుతుంది. స్త్రీలనోట్లోరహస్యాలు దగకూడని ధర్మరాజు అంటాడు. కర్ణుడి తన అగ్రజుడని తెలిసిన ధర్మరాజుతో బాధ మొదలవుతుంది. ధర్మరాజు ప్రేతకర్మలు నిర్వర్తించి, భారమయిన గుండెతో, సోదరులతో గంగ ఒడ్డున నిలిచియున్న సమయంలో స్త్రీ పర్వం పూర్తి అవుతుంది.


12 )


శాంతి పర్వం


కర్ణుని జన్మ వృత్తాంతం , విప్ర శాపం, పరశురామ శాప వృతాంతం, కర్ణుడి సాయంతో దుర్యోధనుడు కళింగ రాజకన్యను అపహరించడం, కర్ణుడు జరాసంధుని ఓడించి మాలిని నగరాన్ని పొందడం ఉంటాయి. ధర్మరాజు రాజ్యం తీసుకోనని పట్టుబడితే అందరు అనేకరకాలుగా చెప్పి ఒప్పిస్తారు. మహా యుద్ధ పాపాన్ని అశ్వమేధ యాగం చేసి పోగొట్టుకోవచ్చని చెప్పిన మీదట ధర్మరాజు రాజ్యం స్వీకరించడానికి ఒప్పుకుంటాడు. పట్టాభిషేకం జరుగుతుంది,. భీష్ముడు మరణించే వ్యవధిలోగా ఆయనవద్ద రాజధర్మం, అనేక సస్త్ర రహస్యాలు తెలుసుకోమన్న శ్రీకృష్ణుని సలహా ప్రకారం ధర్మరాజు బీష్మని కలసి అనేక విషయాలు నేర్చుకుంటాడు.


ఇది నిజానికి అన్నిటి కన్నా పెద్ద పర్వం . కధ సాగదు కానీ ధర్మసంబంధమయిన ఎన్నో విషయాలు ఇందులో చర్చించబడతాయి.


13 )


అనుశాసన పర్వం:


భీష్మ ధర్మరాజ సంవాదమే ఈ పర్వమంతాను. దీనిలోనే అందరికి పరిచయమయిన విష్ణు సహస్ర నామ ఉపదేశం, భీష్ముని ద్వారా యుధిష్ఠరుడిని ఉంటుంది


.అనేక ధర్మ రహస్యాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయ్.


భీష్ముడు ధర్మరాజు సందేహాలన్నీ నివృత్తి చేసాక హస్తినాపురం చేరడానికి అనుమతి ఇచ్చి ఉత్తరాయణం వచ్చాక తనకు కలం తీరే సమయం వస్తుందని , అప్పుడు రావలసినదని చెప్పి పంపిస్తాడు.ధర్మరాజు హస్తినకు తిరిగి వచ్చి మృతవీరుల కుటుంబాలకు ఇతోధిక ధనసహాయం చేసి ఏభై రోజుల తరువాత దక్షిణయాం ముగిసి


ఉత్తరాయణం వస్తోందని తిరిగి భీష్ముని చెంతకు srikrushnuni ధృతరాష్ట్రుని, గాంధారిని,కుంతిని, సోదరులని, ఇతర ముఖ్యులను వెంటపెట్టుకుని వెళ్తాడు. ఋషులతో కూడి ఉన్న భీష్ముడు ధర్మరాజును , ధృరాష్ట్రుడిని చివరి సందేశాలిచ్చి, ప్రాణాలు విడవడానికి శ్రీకృష్ణుని అనుమతి కోరుతాడు.అందరిని చివరిసారి ఆప్యాయంగా కౌగలించుకొని శరీరంలో ఒక్కొక్క భాగాన్ని యోగంలోంచి ఉపసంహరిస్తాడు. బాణాలన్నీ ఒక్కక్కటిగా విడివడతాయి.భీష్ముని ప్రాణాలు శిరస్సు ఛేదించుకుని బయటకు వచ్చి అనంతవాయువులలో కలిసిపోతాయి.అందరు అగ్నిసంస్కారం చేసి గంగానది చేరుతారు,తర్పణ సమర్పణకు. గంగ నేయీటినుంచి బయటకు వచ్చి కుమారుని మరణానికి సోకిస్తుంది. వ్యాసుడు కృష్ణుడు ఆమెను ఓదార్చగా తిరిగి నీటిలో ప్రవేశిస్తుంది. అందరు గంగకు పూజలు చేసి వెనక్కి మరలడంతో అనుశాసన పర్వం ముగుస్తుంది.


14 )


ఆశ్వమేధిక పర్వం:


భీష్మ నిర్యాణం తరువాత ధర్మరాజు తీవ్రమయిన విచారానికి లోనవుతాడు. తాతగారిని చంపినా పాపం నుంచి తనకు ఎలా నివృత్తి లభిస్తుంది అని అడిగితే అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తాడు. యుద్ధానికే ఖజానా ఖాళీ అయినా తానూ యాగం ఎలా చెయ్యగలుగుతానని మళ్ళీ


అడుగుతాడు ధర్మరాజు. మరుత్త మహారాజు వెనుకటి యుగంలో దాచిని అనంత ధనరాశులు హిమాలయాల్లో భద్రంగా ఉన్నాయని , వాటితో నిర్వహించవచ్చుననీ సలహా చెబుతాడు వ్యాసుడు.


శ్రీకృష్ణుడు , సుభద్రను తీసుకుని తిరిగి శ్వమేధసమయానికి ముందుగానే వస్తానని ద్వారకా చేరుకొని యుద్ధ వృత్తాంతం, అభిమన్యు వధతో సహా వాసుదేవుడికి తెలియపరుస్తాడు.


పాండవులు హిమాలయాలకు వెళ్లి బంగారం, మణులు తెచ్చుకుని వచ్చే లోపు ఉత్తర ప్రొమృతశిశువును కంటుంది. అశ్వద్ధామ అస్త్ర ప్రభావం అది. సమయానికి చేరుకున్న శ్రీకృష్ణుడు శిశువుకు జీవప్రదానం చేసి పరీక్షిత్తు అని పేరు పెడతాడు.


తరువాత అర్జునుడు అశ్వం వెనుక వెళ్లి అనేక రారాజులు జయించి తిరిగి వస్తాడు. తన కొడుకు భబ్రువాహనుని చేతిలో అర్జునుడు హతమవ్వడం , ఉలూపి నాగమణి ద్వారా అతడిని బతికించడం, తద్వారా వసువుల శాపానికి ప్రతిక్రియ జరిపామని చెప్పడం ఒక విశేషం.


అశ్వమేధ యాగం విజయవంతంగా సమాప్తి అవుతుంది.


శ్రీకృష్ణుడు అర్జునుననకు ఉపదేశించిన బ్రాహ్మణా గీత , అనుగీత అని కూడా అంటారు, ఇందులోనిదే.


శ్రీకృష్ణుడు భగవద్భక్తుల గురించి , వైష్ణవ ధర్మం గురించి ఉపదేశించి తిరిగి ద్వారకకు వెళ్లడంతో అశ్వమేధిక పర్వం ముగుస్తుంది.


15 )


ఆశ్రమవాసిక పర్వం:


ధర్మరాజు ధృతరాష్టుడిని , గాంధారిని స్వంత కొడుకులాచూసుకుంటాడు. అయినా భీముడు మాత్రం అపుడపుడు పెదనాన్న వినేలాగా నిష్టుర వాక్యాలు పలుకుతూ ఉంటాడు. ఇలా నిర్వేదానికి గురి అయిన ధృతరాష్ట్రుడు ఉపవాసాలతో శరీరం శుష్కిన్పచేసుకుని శల్యావశిష్ఠుడవుతాడు. తానూ, గాంధారి వానప్రస్థానానికి వెళతామని చెబుతాడు. వ్యాసుడు కూడా ధర్మరాజుని అడ్డు పెట్టవద్దని చెబుతాడు. ధృతరాష్ట్రుడు కొడుకులందరికి ఆఖరిసారిగా తర్పణాలు ఇచ్చి, విరివిగా దానాలు చేసి గాంధారి సహితంగా అడవులకు బయలు దేరతాడు. కుంతి తాను కూడా వారి సేవలో వెళ్లిపోతానని , పాండవులను దుఃఖంలో ముంచి వెళ్ళిపోతుంది. వారు శతరూప ఆశ్రమంకు వెళ్లి అక్కడే నివాసం ఏర్పరచుకుంటారు. విదురుడు, సంజయుడు కూడా వారితో వెళ్లిపోతారు.


పాండవుల దుఃఖానికి అంతులేదు. ఒక సంవత్సరం తరువాత పాండవులు అందరు భార్యలతో కలిసి పెద్దల దర్శనానికి బయలు దేరుతారు. అత్తమామలను చూడడానికి కౌరవ పత్నులందరు బయలుదేరుతారు.


అందరు సమాగమయినప్పుడు వ్యాసుడు కూడా వారిని కలుస్తాడు. వెళ్లిన రోజే విదురుడు ఎక్కడని అడిగితే అతడు సన్యాసాశ్రమంలో అడవులలో తిరుగుతూ ఉన్నాడని ఎప్పుడయినా కనిపిస్తూ ఉంటాడని చెబుతారు. విదురుడిని వెదుకుతూ ధర్మరాజు అడవులలోకి వెళ్లి దూరంగా చూస్తాడు. పిలుస్తూ దగ్గరకు వెళ్లేసరికి ఒక చెట్టునానుకుని ధర్మరాజు కళ్ళలోకి చూస్తూ ప్రాణం విడుస్తాడు విదురుడు.


వ్యాసమహర్షి ధృతరాష్త్రాదుల అభ్యర్ధన మేరకు చనిపోయిన వారందరిని దేవా లోకాలలోనుంచి రప్పిస్తాడు , ఒక రాత్రికి. అందరూ తమతమ ప్రియబంధువులను కలిసి ఆ రాత్రి ఆనందంగా గడుపుతారు. తెల్లవారగానే వచ్చినవారందరు వారి వారి రధాలలో గంగానదిలోకివెళ్ళిఅదృశ్యమవుతారు.కౌరవుల భార్యలందరూ వ్యాసుడి అనుమతితో గంగలో మునిగి ప్రాణాలు విడిచి భర్తలను చేరుకుంటారు.ఎక్కువ సమయం అక్కడ ఉంటె మునులదినచర్యలు కుంటుపడతాయని ధృతరాష్ట్రుడు చెప్పి ధర్మరాజును తిరిగి పంపుతాడు. మరి రెండు సంవత్సరాల తరువాత నారదుని ద్వారా దావానలం లో ధ్రితరాష్ట్రుడు, గాంధర్, కుంతి ప్రాణాలు వదిలారని , సంజయుడు తప్పించుకుని హిమాలయాల్లో తపస్సుకొరకు వెళ్లాడని తెలుస్తుంది.పాండవులు విలపించి పెద్దలకు చేయవలసిన కర్మలు చేసి విరక్తులవుతారు. ఈ పర్వం ఆలా ముగుస్తుంది.


16


మౌసల పర్వం:


యుద్ధానంతరం దాదాపుగా 36 సంవత్సరాలు గడిచాయి.గాంధారి నియమించిన గడువు కూడా అదే. ద్వారకలో శ్రీకృష్ణిడిని చూడడానికి విశ్వామిత్రాది ఋషులు వస్తారు. కొంతమంది యాదవులు ఋషులను పరిహాసం చేయడానికి సాంబుడికి ఆడ వేషం వేసి, అతను భబ్రుది భార్య అనీ, ఆమె గర్భంలో ఉన్న శిశువు అడా మగా అని ప్రశ్నిస్తారు. వారి ఆగడానికి విసిగిన మునులు ఆమె కడుపులో ముసలం పుడుతుందని , అది వంశ వినాయాసనానికి కారణమవుతుందని శాపమిస్తారు. సాంబుడు మరునాడే ఒక ముసలన్నీ కంటాడు. ఉగ్రసేనుడు దానిని చూర్ణం చేసి సముంద్రంలో పాడేయిస్తాడు. సముద్ర తీరంలో ఆ చూర్ణం ప్రభావంతో రెళ్ళు దట్టంగా పెరుగుతుంది.


ఒక నాడు శ్రీకృష్ణుడు అందరిని తీసుకొని సముద్ర తీరం చేరుతాడు. అక్కడా అందరు మధువు సేవించి ఆ మత్తులో సాత్యకి , కృతవర్మ మహాభారతంలో వైరి పక్షం చేసిన అన్యాయాల విషయంలో వాదులాడుకుంటారు కృతవర్మను సాత్యకి చంపితే , సాత్యకిని కృతవర్మ సహచరులు పానపాత్రలతో సాత్యకిని కొట్టి చంపేస్తారు. ఆ కొట్లాటలో శ్రీకృష్ణుడు కూడా

Friday, September 5, 2025

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం - తెలుగు అర్ధంతో నేర్చుకుందాం

 



శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం - తెలుగు అర్ధంతో నేర్చుకుందాం

 



శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం అనేది శ్రీవిద్యా సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రాముఖ్యత కలిగిన స్తోత్రాలలో ఒకటి. ఇది శ్రీ వామకేశ్వర తంత్రంలోని ఉమా-మహేశ్వర సంవాదంలో భాగం. పరమశివుడు పార్వతీదేవికి శ్రీచక్రం మరియు దానిలోని దేవతల గురించి వివరిస్తూ ఈ స్తోత్రాన్ని ఉపదేశించారని నమ్మకం. ఈ స్తోత్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం శ్రీచక్రంలో నివసించే దేవతలందరినీ ఒక మాల (హారం) రూపంలో కీర్తించడం.

ఈ స్తోత్ర పారాయణం వల్ల భక్తులకు అన్ని రకాల భయాలు, కష్టాలు తొలగిపోతాయి. శత్రువుల నుండి రక్షణ, సంపద, జ్ఞానం, విజయం వంటి వాటితో పాటు, మోక్షం కూడా లభిస్తుందని ప్రతీతి. 'ఖడ్గం' అంటే కత్తి. ఈ స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి ఖడ్గం మనకు సిద్ధించి, మనలోని అజ్ఞానాన్ని, అరిషడ్వర్గాలను నశింపజేసి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రం పఠించేవారు ఎల్లప్పుడూ దేవి రక్షణలో ఉంటారు.


శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం - ప్రతి శ్లోకం, ప్రతి వాక్యం - తెలుగు అర్ధంతో నేర్చుకుందాం

శ్రీ దేవీ ప్రార్థన


హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం


'హ్రీం' అనే బీజాక్షరం అనే సింహాసనం మధ్యలో అగ్ని శిఖను, 'సౌః' మరియు 'క్లీం' అనే కళలను ధరించినదానిని.


సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ ।


బంగారు వస్త్రాలు ధరించి, ఉత్తమమైన అమృతంతో శుద్ధి చేయబడిన, మూడు నేత్రాలతో ప్రకాశిస్తున్నదానిని.


వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం


పుస్తకం, పాశం, అంకుశం ధరించి, పూల మాలలతో అలంకరించబడి, ప్రకాశిస్తున్నదానిని.


త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ॥


త్రిపుర సుందరి అయిన ఓ గౌరీ, పరాత్పర కళా స్వరూపిణి, శ్రీచక్రంలో సంచరించే నిన్ను నేను నమస్కరిస్తున్నాను.


అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య,


ఈ శుద్ధశక్తిమాలా మహా మంత్రానికి,


ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః


ఉపస్థేంద్రియాలను అధిష్టించిన వరుణ, ఆదిత్య ఋషులు.


దేవీ గాయత్రీ ఛందః


దేవీ గాయత్రీ ఛందస్సు.


సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా,


సాత్వికమైన 'క' కార భట్టారక పీఠంపై ఉన్న కామేశ్వరుని ఒడిలో నివసించే మహాకామేశ్వరి, శ్రీ లలితా భట్టారికా దేవి అధిష్టాన దేవత.


ఐం బీజం


'ఐం' అనే బీజం.


క్లీం శక్తిః


'క్లీం' అనే శక్తి.


సౌః కీలకం


'సౌః' అనే కీలకం.


మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః


నాకు ఖడ్గసిద్ధి మరియు సకల అభీష్టాలు సిద్ధించడం కోసం ఈ జపాన్ని వినియోగిస్తున్నాను.


ధ్యానం


తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై ।


ఎవరి చేతిలో ఖడ్గం ఉంటుందో, దాని ద్వారా...


అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోత్కా భవిష్యతి ॥


పద్దెనిమిది మహాద్వీపాలకు సార్వభౌముడు అవుతాడు.


ఆరక్తాభాం త్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యాం


ఎర్రని కాంతి, మూడు నేత్రాలు, ఎర్రని వస్త్రాలు, రత్నాలతో కూడిన చెవిపోగులతో అందంగా ఉన్నది.


హస్తాంభోజైస్సపాశాంకుశ మదన ధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ ।


కమలం వంటి చేతుల్లో పాశం, అంకుశం, మన్మథుని ధనస్సు, బాణాలతో ప్రకాశిస్తున్నది.


ఆపీనోత్తుంగ వక్షోరుహ విలుఠత్తార హారోజ్జ్వలాంగీం


పరిపుష్టమైన ఉన్నతమైన వక్షస్థలంపై మెరిసే ముత్యాల హారంతో ప్రకాశవంతమైన శరీరంతో,


ధ్యాయేదంభోరుహస్థా-మరుణిమవసనా-మీశ్వరీమీశ్వరాణామ్ ॥


కమలంపై కూర్చున్న, ఎర్రని వస్త్రాలు ధరించిన ఈశ్వరులకు కూడా ఈశ్వరి అయిన దేవిని ధ్యానిస్తున్నాను.


----------------------


శ్రీ దేవీ సంబోధనం (1)


ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ,


ఈ భాగంలో, స్తోత్రాన్ని పఠించేవారు అమ్మవారిని ఆమె శక్తివంతమైన బీజాక్షర మంత్రాలతో (ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః) సంబోధిస్తారు. "నమస్త్రిపురసుందరీ" అంటే త్రిపురసుందరి అయిన ఓ దేవీ, నీకు నమస్కారం అని అర్ధం. ఇది సకల జగన్మాత అయిన శ్రీ లలితా త్రిపురసుందరిని నేరుగా సంబోధించడం.


న్యాసాంగదేవతాః (6)


హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,


ఈ భాగాన్ని "షడంగన్యాసం" అని పిలుస్తారు, దీనిలో శరీరంలోని ఆరు భాగాలను (హృదయం, శిరస్సు, శిఖ, కవచం, నేత్రాలు, అస్త్రాలు) దేవీ శక్తులతో అనుసంధానిస్తారు. ఈ స్తోత్రం ద్వారా, ఈ ఆరు భాగాలను ఆయా దేవతలైన హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి మరియు అస్త్రదేవిగా భావించి, వాటికి నమస్కరించాలి. ఈ అభ్యాసం శరీరానికి, మనస్సుకు దివ్యశక్తిని ఆవహిస్తుంది.


తిథినిత్యాదేవతాః (16)


కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే,


ఈ విభాగంలో హిందూ పంచాంగంలోని చంద్రుని కదలికలకు సంబంధించిన పదహారు నిత్య దేవతల (తిథినిత్యా దేవతలు) నామాలను స్మరిస్తారు. ఈ దేవతలు చంద్రుని వృద్ధి, క్షీణ దశలను సూచిస్తారు. కామేశ్వరి నుండి మహానిత్యే వరకు ఉన్న ఈ దేవతల పేర్లను పఠించడం ద్వారా, భక్తులు కాలాన్ని, జీవిత చక్రాలను నియంత్రించే శక్తులను పూజిస్తారు.


దివ్యౌఘగురవః (7)


పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, షష్ఠీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ,


ఈ స్తోత్రంలో, దివ్య సంప్రదాయంలోని ఏడుగురు గురువులను కీర్తిస్తారు. వీరు శ్రీ విద్యను దేవతల నుండి స్వీకరించి, దానిని మానవ లోకానికి అందించినవారు. పరమేశ్వర మరియు పరమేశ్వరీ మొదటి గురువులు. వారి తర్వాత మిత్రేశమయి, షష్ఠీశమయి, చర్యానాథమయి, లోపాముద్రమయి, మరియు అగస్త్యమయి పేర్లను స్మరిస్తారు. వీరు దివ్య జ్ఞానాన్ని అందించిన మహనీయులు.


సిద్ధౌఘగురవః (4)


కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ,


ఈ భాగంలో సిద్ధ గురువులను స్మరిస్తారు, వీరు మానవ రూపంలో ఉండి దైవిక జ్ఞానాన్ని అందించారు. ఈ నలుగురు గురువులు - కాలతాపశమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, మరియు దీపకలానాథమయి - తమ తీవ్రమైన తపస్సు, ఆధ్యాత్మిక సాధనల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది, దానిని ఇతరులకు అందించారు.


మానవౌఘగురవః (8)


విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ,


ఈ భాగంలో, మానవ రూపంలో ఉండి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులను కీర్తిస్తారు. వీరు సంప్రదాయాన్ని నిలబెట్టి, తర్వాతి తరాలకు అందించారు. విష్ణుదేవమయి నుండి శ్రీరామానందమయి వరకు ఉన్న ఈ ఎనిమిది మంది గురువులు శ్రీవిద్యను మానవ సమాజంలో ప్రచారం చేసి, భక్తులకు మార్గదర్శనం చేశారు.


శ్రీచక్ర ప్రథమావరణదేవతాః


శ్రీచక్రం యొక్క మొదటి ఆవరణ దేవతలు:


అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ,


అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, ఇచ్చ, ప్రాప్తి, సర్వకామ అనే సిద్ధులు; బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి దేవతలు; సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ; త్రైలోక్యమోహన చక్రానికి అధిష్టాత్రి అయిన ప్రకటయోగినీ దేవి.


శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః


శ్రీచక్రం యొక్క రెండవ ఆవరణ దేవతలు:


కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ,


కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి; సర్వాశాపరిపూరక చక్రానికి అధిష్టాత్రి అయిన గుప్తయోగినీ దేవి.


శ్రీచక్ర తృతీయావరణదేవతాః


శ్రీచక్రం యొక్క మూడవ ఆవరణ దేవతలు:


అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణచక్రస్వామినీ, గుప్తతరయోగినీ,


అనంగకుసుమ, అనంగమేఖల, అనంగమదన, అనంగమదనాతుర, అనంగరేఖ, అనంగవేగిని, అనంగాంకుశ, అనంగమాలిని; సర్వసంక్షోభణ చక్రానికి అధిష్టాత్రి అయిన గుప్తతరయోగినీ దేవి.


శ్రీచక్ర చతుర్థావరణదేవతాః


శ్రీచక్రం యొక్క నాల్గవ ఆవరణ దేవతలు:


సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ,


సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధక, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి; సర్వసౌభాగ్యదాయక చక్రానికి అధిష్టాత్రి అయిన సంప్రదాయయోగినీ దేవి.


శ్రీచక్ర పంచమావరణదేవతాః


శ్రీచక్రం యొక్క ఐదవ ఆవరణ దేవతలు:


సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,


సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని; సర్వార్థసాధక చక్రానికి అధిష్టాత్రి అయిన కులోత్తీర్ణయోగినీ దేవి.


శ్రీచక్ర షష్టావరణదేవతాః


శ్రీచక్రం యొక్క ఆరవ ఆవరణ దేవతలు:


సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,


సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రద; సర్వరక్షాకర చక్రానికి అధిష్టాత్రి అయిన నిగర్భయోగినీ దేవి.


శ్రీచక్ర సప్తమావరణదేవతాః


శ్రీచక్రం యొక్క ఏడవ ఆవరణ దేవతలు:


వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహరచక్రస్వామినీ, రహస్యయోగినీ,


వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని; సర్వరోగహర చక్రానికి అధిష్టాత్రి అయిన రహస్యయోగినీ దేవి.


శ్రీచక్ర అష్టమావరణదేవతాః


శ్రీచక్రం యొక్క ఎనిమిదవ ఆవరణ దేవతలు:


బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రదచక్రస్వామినీ, అతిరహస్యయోగినీ,


బాణిని (బాణాలను ధరించినది), చాపని (ధనస్సును ధరించినది), పాశిని (పాశాన్ని ధరించినది), అంకుశిని (అంకుశాన్ని ధరించినది), మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని; సర్వసిద్ధిప్రద చక్రానికి అధిష్టాత్రి అయిన అతిరహస్యయోగినీ దేవి.


శ్రీచక్ర నవమావరణదేవతాః


శ్రీచక్రం యొక్క తొమ్మిదవ ఆవరణ దేవతలు:


శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయచక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ,


శ్రీ శ్రీ మహాభట్టారిక; సర్వానందమయ చక్రానికి అధిష్టాత్రి అయిన పరాపరరహస్యయోగినీ దేవి.


నవచక్రేశ్వరీ నామాని


నవచక్రేశ్వరీ నామాలు:


త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ,


త్రిపుర, త్రిపురేశి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపురసిద్ధ, త్రిపురాంబ, మహాత్రిపురసుందరి.


శ్రీదేవీ విశేషణాని - నమస్కారనవాక్షరీచ


శ్రీదేవి యొక్క విశేషణాలు - నమస్కార నవాక్షరి:


మహామహేశ్వరీ, మహామహారాజ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగరసామ్రాజ్ఞీ, నమస్తే నమస్తే నమస్తే నమః ।


మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తి, మహామహాగుప్త, మహామహాజ్ఞప్త, మహామహానంద, మహామహాస్కంధ, మహామహాశయ, శ్రీచక్రనగరానికి మహారాజ్ఞి అయిన దేవీ, నీకు నమస్కారం, నమస్కారం, నమస్కారం.


ఫలశ్రుతిః


ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః ।


ఈ విద్య కేవలం స్మరించుకున్నంత మాత్రాన గొప్ప సిద్ధులను ఇస్తుంది.


అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే ॥


అగ్ని, గాలి వల్ల కలిగే గొప్ప ఆపదలలో, దేశంలో విప్లవం వచ్చినప్పుడు,


లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే ।


దొంగల భయం, యుద్ధం, నీటి ప్రళయం సంభవించినప్పుడు,


సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే ॥


సముద్ర ప్రయాణంలో సంభవించే అవాంతరాలలో, భూత, ప్రేతాల భయాలలో,


అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే ।


అపస్మారం, జ్వరం, వ్యాధి, మృత్యువు, క్షామం వంటి భయాలలో,


శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే ॥


శాకిని, పూతన, యక్ష, రాక్షస, కూష్మాండాల వల్ల కలిగే భయాలలో,


మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే ।


మిత్రభేదం, గ్రహ భయాలు, వ్యసనాలు, క్షుద్ర ప్రయోగాల వల్ల కలిగే ఆపదలలో,


అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః ॥


ఇతర దోషాలు ఉన్నప్పుడు ఈ మాలా మంత్రాన్ని స్మరించాలి.


తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై ।


అలా ఈ మంత్రం పఠించిన వారు వారి చేతులలో ఖడ్గాన్ని పొందుతారు, దాని ద్వారా...


అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి ॥


పద్దెనిమిది మహాద్వీపాలకు సార్వభౌముడు అవుతాడు.


సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ ।


సకల ఉపద్రవాల నుండి విముక్తి పొంది సాక్షాత్తు శివ స్వరూపుడు అవుతాడు.


ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ ॥


ఆపద కాలంలో నిత్య పూజను విస్తారంగా చేయాలి.


ఏకవారం జపధ్యానం సర్వపూజాఫలం లభేత్ ।


ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించి ధ్యానిస్తే సకల పూజల ఫలం లభిస్తుంది.


నవావరణదేవీనాం లలితాయా మహౌజనః ॥


నవావరణ దేవతల, లలితా దేవి యొక్క గొప్ప తేజస్సు,


ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః ।


ఒకచోట లెక్కించబడిన రూపం, వేదాలు, వేదాంగాల చేత తెలుసుకోబడినది.


సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ ॥


సకల ఆగమాల రహస్య అర్థం, స్మరించినంతనే పాపాలను నశింపజేసేది.


లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ ।


లలితామహేశ్వరి యొక్క ఈ మాల విద్య చాలా గొప్పది.


నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ ॥


మనుష్యులను, రాజులను, స్త్రీలను వశం చేసుకునేది.


అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ ।


అణిమాది అష్టసిద్ధులను, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించేది, పాపాలను నశింపజేసేది.


తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ ॥


ఆయా ఆవరణలలో ఉండే దేవతా సమూహ మంత్రాలు.


మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ ।


ఈ మాలా మంత్రం అత్యంత రహస్యమైనది, అత్యుత్తమ స్థానంగా కీర్తించబడినది.


శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ ॥


శక్తిమాల ఐదు విధాలు, శివమాల కూడా అలాగే ఉంటుంది.


తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదమ్ ॥


కాబట్టి ఇది రహస్యాల కంటే రహస్యమైనది, భుక్తి (భౌతిక సుఖాలను) మరియు ముక్తిని ప్రసాదిస్తుంది.


॥ ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీఖడ్గమాలాస్తోత్రరత్నం సమాప్తమ్ ॥


ఇది శ్రీ వామకేశ్వర తంత్రంలో ఉమా-మహేశ్వర సంవాదంలో దేవీఖడ్గమాలాస్తోత్రం సమాప్తం.


ఈ శక్తివంతమైన స్తోత్ర పఠనంతో మీ జీవితాన్ని అమ్మవారి దివ్య ఆశీస్సులతో నింపుకోండి.

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం Sri Devi Khadgamala Stotram with Telugu Meaning


కామెంట్‌లు


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లలితా సహస్రనామ స్తోత్రాలు - వాటి తెలుగు అర్ధాలు

- ఆగస్టు 20, 2025

చిత్రం

  లలితా సహస్రనామ స్తోత్రం: సంక్షిప్త పరిచయం లలితా సహస్రనామ స్తోత్రం, శక్తి ఆరాధనలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడే ఒక దివ్య స్తోత్రం. ఇది బ్రహ్మాండ పురాణం లో, హయగ్రీవుడు మరియు అగస్త్య మహర్షి ల సంవాదం రూపంలో వివరించబడింది. ఇందులో లలితా దేవి (పార్వతి దేవి స్వరూపం) వేయి నామాలను కీర్తిస్తారు. ఈ స్తోత్రం దేవిని సృష్టి, స్థితి, లయకారకా అయిన రాజరాజేశ్వరి గా వర్ణిస్తుంది. శ్రీవిద్య, శ్రీచక్ర ఉపాసనలలో దీనికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం కేవలం స్తుతి మాత్రమే కాదు, ఇందులో అనేక మంత్ర రహస్యాలు , యోగ సాధనలు మరియు సిద్ధులు నిక్షిప్తమై ఉన్నాయని నమ్మకం. లలితాదేవి అనుగ్రహం, సకల శుభాలు, కష్టాల నివారణ మరియు ముక్తిని పొందడానికి ఈ స్తోత్ర పారాయణం అత్యంత శక్తివంతమైన మార్గంగా భావించబడుతుంది. ఈ స్తోత్రం వశిన్యాది వాగ్దేవతలు (ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం రచించారు. ఈ స్తోత్రంలో దేవి యొక్క కేశాది పాద పర్యంతం వర్ణన ఉంటుంది. శ్రీదేవిపై శ్రద్ధాభక్తులు ఉన్నవారు, గురువు ద్వారా ఉపదేశం పొందిన తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సంపూర్ణ ఫలాలు లభిస్తాయని విశ్వాసం. --- ధ్యానం - సింధూరారుణ ...

మరింత చదవండి

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం - తెలుగు అర్ధంతో నేర్చుకుందాం

- ఆగస్టు 24, 2025

చిత్రం

"శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం" హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, ప్రసిద్ధమైన స్తోత్రాలలో ఒకటి. ఇది మహాభారతంలోని అనుశాసన పర్వంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత, భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు, యుధిష్ఠిరుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ సహస్ర నామాలను ఉపదేశించాడు. ఆ ప్రశ్నలు ఏమిటంటే: ఈ ప్రపంచంలో అత్యుత్తమమైన దైవం ఎవరు? అన్ని శుభాలను ప్రసాదించే అత్యున్నత మంత్రం ఏది? సర్వ దుఃఖాలను తొలగించి, మోక్షాన్ని ప్రసాదించే మార్గం ఏది? ఈ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు శ్రీ మహావిష్ణువు యొక్క వేయి నామాలను వర్ణించాడు. ఈ నామాలు భగవంతుని వివిధ గుణాలను, రూపాలను, లీలలను తెలియజేస్తాయి. ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల సర్వ పాపాలు నశించి, అపారమైన శాంతి, సంపద, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయని విశ్వాసం. ఈ స్తోత్రంలోని ప్రతి నామం పరమాత్మ యొక్క ఒక గొప్ప గుణాన్ని సూచిస్తుంది. ఇది కేవలం స్తుతి మాత్రమే కాదు, వేదాంత సారాన్ని వివరించే ఒక అద్భుతమైన గ్రంథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః । భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥ విశ్వం: సకల జగత్తు తానే అయినవాడు. విష్ణుః: సర్వాంతర్యామి. అంతటా వ్యాపిం...

మరింత చదవండి

శ్రీ సూక్తం - తెలుగు అర్ధంతో నేర్చుకుందాం

- ఆగస్టు 22, 2025

చిత్రం

"శ్రీ సూక్తం" వేదాలలో అత్యంత విశిష్టమైన, పవిత్రమైన స్తోత్రం. ఇది ఋగ్వేదంలోని ఖిలసూక్తాలలో ఒక భాగం. దీని రచయిత ఎవరు అనేది స్పష్టంగా తెలియదు, కానీ ఇది చాలా పురాతనమైనది. సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు, అదృష్టం, శాంతి, ఆరోగ్యం, మరియు సంతోషం కోసం శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించడానికి ఈ స్తోత్రాన్ని పఠిస్తారు. ప్రతి శ్లోకంలో లక్ష్మీదేవి వివిధ రూపాలు, ఆమె అనుగ్రహం, మరియు ఆమెను పొందే మార్గాలను వర్ణిస్తారు. శ్రీ సూక్తం కేవలం భౌతిక సంపదనే కాకుండా, ఆధ్యాత్మిక సంపదను కూడా కోరుకునే వారి కోసం ఉద్దేశించబడింది. శ్లోకం: ఓమ్ ॥ హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ । చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥ బంగారు రంగులో ఉన్నది, హరిణీ(పాపాలు తొలగించేది) వంటిది, బంగారు మరియు వెండి పూలమాలలతో అలంకరించబడినది, చంద్రుని వలె ప్రకాశించేది, బంగారంతో కూడిన ఆ లక్ష్మీదేవిని ఓ అగ్నిదేవా (జాతవేద) నాకు అనుగ్రహించు. శ్లోకం: తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ᳚మ్ । యస్యాం॒ హిర॑ణ్యం-విఀం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హమ్ ॥ ఓ అగ్నిదేవా (జాతవేద), నా దగ్గర నుండి ఎప్పుడూ దూరంగా వెళ్ళని ఆ లక్ష్మీ...

మరింత చదవండి

 Blogger ఆధారితం

Michael Elkan ద్వారా థీమ్‌లు


Ramki Devotional

ప్రొఫైల్‌ను సందర్శించండి

ఆర్కైవ్

లేబుళ్లు

దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయండి


Ramki Devotional - శ్లోకాలు, వాటి అర్ధాలు నేర్చుకుందాం

Monday, July 7, 2025

జీవితాన్ని మార్చే మాటలు

 జీవితాన్ని మార్చే మాటలు

1. నేను అదృష్టాన్ని నమ్ముకోను.

2. నేను నా శ్రమనే నమ్ముకుంటాను.

3. నేను సమయ పాలనను పాటిస్తాను.

4. నేను నా సమయాన్ని వృధా చేయను.

5. నేను ఏ పనిని మధ్యలో వదిలి పెట్టను.

6. నేను ఏ పనినైన ఏకాగ్రతతో చేస్తాను.

7. నేను ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటాను.

8. నాలో అనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి.

9. నేను ఎల్లప్పుడు ఆత్మ విశ్వాసంతో ఉంటాను.

10. నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను.

11. నేను నాయొక్క పనులను వాయిదా వేయను.

12. నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను.

13. నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది.

14. నేను ఏ పని చేసిన విజయవంతంగా చేస్తాను.

15. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేస్తాను.

16. నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను.

17. నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను.

18. నేను ప్రతి రోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తుకు చేసుకుంటాను.

19. నేను కచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను.

ఈ మాటల్ని ప్రతి రోజు చదవటం అలవాటు చేసుకోండి. ఇలా చదవడం వలన రోజు రోజుకు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది.


Monday, June 23, 2025

శ్రీ వారాహీ దేవి షోడశోపచార పూజ

 🌷🙏శ్రీ వారాహీ దేవి షోడశోపచార పూజ 🙏🌷

పూజా విధానం :-


🌷గణపతి మరియు గురు ప్రార్థన :-

🌷దీపారాధన

🌷ఘoటానాదం

🌷భూతోచ్ఛాటనం

🌷ఆచమనం

🌷ఆసనం

🌷ప్రాణాయామం


🌷పసుపు గణపతి పూజ , కళశారాధన, ( ఇవన్నీ అన్ని పూజల్లో చెప్పిన విధానంలో చేసుకోవాలి)


🌷సంకల్పం ( సంకల్పం )


శ్లోకం॥ మమ ఉపాత్త సమస్తా దురితాక్షయ ద్వారా శ్రీ వారాహీ దేవతా ప్రీత్యర్థం (శుభేశోభనే ముహూర్తే) శ్రీ మాన్ (శ్రీ మతి. కుమారీ (శ్రీ మతి. కుమారీ) “....” గోత్రస్య శ్రీమాన్) "...." గోత్రస్య ".... ”శర్మభిధేయస్య - మమ ధర్మపత్ని(పతి) సమేతస్య] మమ ఉపాత్త దురితక్షయద్వారా, అస్మాకం సకుటుంబాణాo శ్రుతిస్మృతి పురాణేర్ధృక్త ఫలప్రాప్తి విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, మనోవాంచ ఫలసిద్ధ్యర్థతః, సమస్తత్వరతః సమస్తాయర్థః ముద్ధిశ్య. శ్రీ వారాహి, దేవతా ప్రీత్యర్థం. సంభవద్భిర్ ద్రవైః సంభవద్భిదుపచారైః సంభావితా నియమేన పురాణోక్త విధానేన భక్తిపూర్వకా యావచ్ఛక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే॥


🌷ప్రాణప్రతిష్ట🌷


శ్రీ వారాహి విగ్రహానికి లేదా శ్రీ లలిత లేదా శ్రీ కాళి లేదా శ్రీ దుర్గ లేదా శ్రీ గణేశ విగ్రహానికి పసుపు మరియు కుంకుమ ఎండిన సున్నం కలిపిన పొడి పసుపును పూయండి. విగ్రహం లేదా ఫోటో అందుబాటులో లేకుంటే లేదా యంత్రం కూడా లేకుంటే, పసుపుతో అమ్మవారిని చేయవచ్చు. ఒక తమలపాకు మరియు ఒక పువ్వు తీసుకొని ఈ కలయికతో విగ్రహాన్ని తాకండి. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ కోసం ఈ క్రింది మంత్రాలను ఇప్పుడు పఠించాలి.


మంత్రం॥ తతః మృతవాహనం కరిష్యే॥ అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహినోధేహి భోగమ్. జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృలయానస్స్వస్తి. అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ మథాస్థాన ముపహ్వయతే॥


1.ఓం భూః - వారాహిమావాహయామి॥ 

2.ఓం భువః - వారాహిమావాహయామి॥

3.ఓం సువః - వారాహిమావాహయామి॥

4.ఓం భూర్భువస్సువః - వారాహిమావాహయామి॥


మంత్రం॥ వారాహింసంఘం సాయుధం సవాహనం సశక్తి పతిపుత్ర

పరివార సమేతమ్ ఆవాహయామి. స్థాపయామి. పూజయామి॥


మంత్రం॥ శ్రీ వారాహి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, మమ

అభిముఖో భవ, స్థిరాసనం కురు॥


శ్లోకం॥ దేవేశ భక్తి సులభ సర్వావరణ సంయుతా ।

యావత్తవం పూజయిష్యామి తావత్త్వం సుస్థిరోభవ ॥


🌷1. శ్రీ మహా వారాహి ధ్యానం 🌷

 

శ్లోకం॥ ధ్యాయేత్ పద్మాసనస్థం వికసితా వదనాం పద్మపత్రాయతాక్షిః ।

హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేతు పద్మం వరంగీమ్ ॥

సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనామ్రాంభవానిః ।

శ్రీ విద్యాంశాన్తమూర్తిం సకలా సురానుతాం సర్వసమ్పత్ప్రదాత్రీమ్ ॥


మంత్రం ॥ ఓం మహాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ॥


నేను పద్మాసనంలో కూర్చున్న శ్రీ వారాహిని ధ్యానిస్తాను. నిండుగా వికసించిన ఆమె కొలముఖం మరియు కళ్ళు తామర రేకులను పోలి ఉంటాయి, బంగారు పసుపు రంగు దుస్తులు ధరించి, ఆమె భక్తులను ఆశీర్వదించడానికి ఆమె చేతిని వర ముద్రలో ఉంచింది. ఆమె శరీరం చుట్టూ తేజోవంతమైన కాంతి వలయం ఉంది నిండుగా అలంకరించబడిన వస్తువులతో అభయ ముద్రలో తన చేతితో నాగలితో తన భక్తులకు ఎల్లవేళలా సంపూర్ణ రక్షణ కల్పిస్తుంది. ఆమె భక్తులకు సకల సంపదలను ప్రసాదించేదే తల్లి నా తో పూజలు అందుకుని నన్ను అనుగ్రహిస్తుంది.


🌷నమస్కారం


శ్లోకం॥ క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే ।

సుస్థిరోభవమే గేహే సురాసురనమస్కృతే ॥


మంత్రం ॥ శ్రీ వారాహి దేవ్యై నమః నమస్కారం సమర్పయామి ॥


🌷ఆవాహనం


ఈ విధానం శ్రీ వారాహిని సాధకుని హృదయంలో అలాగే యంత్రం మరియు దేవతా విగ్రహంలో నివసించమని ఆహ్వానించడం. ఆవాహన ముద్రను స్వామిని ఆహ్వానించడానికి ఉపయోగించవచ్చు. క్రింది శ్లోకాలు మరియు మంత్రాలను పూర్తి చేసిన తర్వాత విగ్రహం వద్ద పుష్పాలను ఉంచవచ్చు.


మంత్రం॥ హిరణ్యవర్ణాం హరిణి సువర్ణ రజతస్రాజమ్ ।చన్ద్రం హిరణ్మయిం లక్ష్మీం జాతవేదో మహావహా ॥


శ్లోకం॥ ఆగచ్ఛ వరదేదేవి దైత్య దర్పణిఘాదినీ ।

పూజం గృహాణ సుముఖిః నమస్తే శంకర ప్రియే ॥


శ్లోకం॥ శ్రీ మహావారాహ్యై నమః ఆవాహనః సమర్పయామి సంగం - సాయుధం - సహనం -సశక్తి - భర్త పుత్రపరివార సమేత శ్రీదేవమహావరా ఆమి - పూజయామి.


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - ఆవాహనార్థే పుష్పాంజలిః సమర్పయామి॥


🌷3. ఆసనం ( ఆసనం )


మంత్రం॥ తాం మా ఆవాహ జాతవేదో లక్ష్మీమనాపగామినీమ్ ।

  యస్యాం హిరణ్యం విన్దేయం గమశ్వం పురుషానాహమ్ ॥


శ్లోకం॥ అనేకరత్న సంయుక్త నామాణిగణాన్వితమ్ ।

మాతస్వర్ణమయం దివ్యమానసం ప్రతిగృహ్యతామ్ 


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - నవరత్నఖచిత స్వర్ణశింహాసనం సమర్పయామి॥


🌷4. పాద్యం (పాదాలు కడగడం) 


మంత్రం॥ అశ్వపూర్వం రథమధ్యం హస్తినద ప్రబోధినిః ।

 శ్రియన్దేవీ ముపాహ్వయే శ్రీర్మాదేవి జుషతాం ॥


శ్లోకం॥ పద్యం గృహాణ దేవేశి పవిత్ర జల నిర్మతమ్ ।

 పాదయోర్దేవ దేవీత్వం మం పాహి జగదీశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - పాదయోః పాద్యం సమర్పయామి ॥


🌷5. అర్ఘ్యం


మంత్రం॥ కాంసో' స్మితాం హిరణ్యప్రకార మృద్రజ్వలంటిః ।

తృప్తాం తర్పయన్తిం పద్మస్థితాం పద్మవర్ణాం తమిహోపహ్వయే శ్రియమ్ ॥


శ్లోకం॥ గంధపుష్పాక్షాత్తేర్యుక్తా మార్ఘ్యం సంపాదితం మయా ।

గృహాణత్వం మహాదేవీ ప్రసన్నాభవా సర్వదా ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ॥ అమ్మవారికి నీటిని చూపించి పాత్రలో వడలండి..


🌷6. ఆచమనం


శ్రీ వారాహికి ఆచమనం కోసం ఈ క్రింది విధానాన్ని అనుసరించండి. ఈ క్రింది శ్లోకాలు మరియు మంత్రాలను ముందుగా పఠించాలి. తర్వాత నీళ్ళు సమర్పించడానికి నిర్దేశించిన పాత్ర నుండి కొంత నీటిని తీసుకుని, శ్రీ వారాహి విగ్రహం నోటికి చూపించి, మరొక పాత్రలో పోయండి..


మంత్రం ॥ చన్ద్రం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియమ్లోకే దేవజుష్ట ముదారమ్ ।


  తాం పద్మినీషిం శరణమహాం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ॥


శ్లోకం॥ అకామ్యాతాం త్వయాదేవి భక్తి మే హ్యచలం కురు ।

ఈప్సితాం మే వరణ్దేహి పరత్ర చ పరాంగతిమ్ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - ముఖే ఆచమనీయం సమర్పయామి ॥


 🌷మధుపర్కం 


కింది విధానం మధుపర్కం విధానాన్ని వివరిస్తుంది. ఇది శ్రీ వారాహికి గతంలో చేసిన తేనె, వెన్న (నెయ్యి) మరియు పెరుగు (పెరుగు) కలిపి అందించడం. ముందుగా ఈ క్రింది శ్లోకాలు మరియు మంత్రాలను పఠించి, ఆపై ఉత్తరిణి (చెంచా) ద్వారా కొంత భాగాన్ని తీసుకొని శ్రీ వారాహి విగ్రహానికి చూపించి, తీర్థం గిన్నెలో వేయాలి


శ్లోకం॥ దధి మధ్వాజ్య సంయుక్తం పత్రయుగ్మం సమన్వితమ్ ।

మధుపర్కం గృహాణత్వం వరదాభవ శోభనే ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - మధుపర్కం సమర్పయామి ॥


🌷7. స్నానం


విగ్రహానికి నీటిని ప్రదర్శించి, స్నానం చేస్తున్నట్లు భావించి, ఉత్తరాణి చెంచా ఉపయోగించి నీటిని తీర్థ పాత్రలో పోయవచ్చు.


🌷పంచామృత స్నానం 


శ్లోకం॥ పయో దధి ఘృతః క్షీరః సీతాయాచ సమన్వితమ్ ।

పంచామృతమనేనాద్య కురు స్నానమ్ దయోనిధే ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - పంచామృత స్నానమ్ సమర్పయామి॥


🌷పాయః స్నానం 🌷


శ్లోకం॥ కామధేనోః సముద్భూతం దేవర్షి పితృప్తిదమ్ । పయోదదామి దేవేశ! స్నానార్థం ప్రతిగృహ్యాతం॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - స్నానార్థే పయఃస్నానం సమర్పయామి॥


  పాయఃస్నానాంతరం అపోహిష్ఠేతి శుద్దోదక స్నానమ్ సమర్పయామి॥


🌷దధిః స్నానమ్ 🌷 (పెరుగు)


శ్లోకం॥ చంద్రమన్దలం సంకాశం సర్వదేవ ప్రియం దధి.


స్నానార్థం తే మాయాదత్తం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - దధిస్నానం సమర్పయామి॥


  దధిస్నాననాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః - దధిస్నానం సమర్పయామి॥

  దధిస్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి॥


🌷॥ ఆజ్య స్నానం ॥ ( ॥ఆజ్య(నైయి స్నానమ్॥ )


శ్లోకం॥ ఆజ్యం సురనామహార ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ।


ఆజ్యం పవిత్రం పరమం స్నానార్థం ప్రతిగృహ్యతామ్ ॥

మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - ఆజ్యస్నానం సమర్పయామి ॥


🌷॥ మధు స్నానం ॥ ( ॥మధు స్నానమ్॥ )


శ్లోకం॥ సర్వౌషాధి సముత్పన్నం పీయూష సదృశం మధు.

స్నానార్థం తే ప్రయచ్ఛామి గృహాణా పరమేశ్వర॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - మధుస్నానం సమర్పయామి ॥


  ఆజ్య, మధుస్నానాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ॥


🌷॥ శర్కార స్నానం ॥ ( చక్కెర స్నానమ్॥ )


శ్లోకం॥ ఇక్షుదండ సముద్భూత దివ్యశర్కరాయ హరిమ్ ।


స్నాపయామి సదా భక్త్యా ప్రీతో భవ సురేశ్వర ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - శర్కరా స్నానమ్ సమర్పయామి ॥


  శర్కరా స్నాననాంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ॥


🌷॥ ఫలోదక స్నానం ॥ ( ॥ఫలోదక స్నానమ్॥ )


శ్లోకం॥ శ్రీ మహా వారాహ్యై నమః - నారికేల ఫలోదకస్నానం సమర్పయామి ॥


నారికేల ఫలోదకాక స్నాననన్తరమ్ శుద్ధోదక స్నానం సమర్పయామి ॥


🌷॥ శుద్దోదక స్నానం ॥ ( ॥శుద్ధోదక స్నానం॥ )(విగ్రహం కి)


మంత్రం॥ ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవవృక్షోధ బిల్వః ।


  తస్యాఫలాని తపసానుదన్తు మాయాంతరయాశ్చ బాహ్యా అలక్ష్మిః ॥


శ్లోకం॥ పవిత్రీ జలం దేవి మన్త్రైర్వాదికా తాంత్రికైః ।


సుగన్ధవాసితాం చైవ స్నానార్థం పరిగృహ్యతాం ॥


శ్లోకం॥ శుద్దం యత్ సలిలం దివ్యం గఙ్గజలసమమ్ స్మృతమ్ ।


సమర్పితం మాయాభక్త్యా శుద్ధస్నానాయ గృహ్యతామ్ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - మహాభిషేకస్నానం సమర్పయామి ॥

స్నానతే ఆచమనీయం సమర్పయామి ॥


🌷8.వస్త్రం


ఈ విధానం దేవతకు వస్త్రాలు సమర్పించడం. క్రింది శ్లోకాలు మరియు మంత్రాలు చదివిన తర్వాత, కొత్త బట్టలు సమర్పించాలి. బట్టలు సాధారణంగా గుడ్డ ముక్కలు మాత్రమే. వస్త్రం అందుబాటులో లేనట్లయితే, కొన్ని అక్షతలు సమర్పించవచ్చు.


మంత్రం॥ ఉపైతుమాన్దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ।

పృదుర్భూతోస్మి రాష్టేస్మి న్కీర్తిమృద్ధి న్దదాతుమే ॥


శ్లోకం॥ వస్త్రం చ సోమదేవత్యం లజ్జయాస్తు నివారణమ్ ।

మాయా నివేదితాం భక్త్యా గృహాణా పరమేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - వస్త్రయుగ్మం సమర్పయామి ॥

వస్త్రంతే ఆచమనీయం సమర్పయామి ॥


🌷9. కణ్ఠసూత్రం ( కణ్ఠసూత్రం )


ఈ ప్రక్రియ దేవతకు పవిత్రమైన దారం లేదా హారాన్ని సమర్పించడం. క్రింది మంత్రం మరియు శ్లోకాలను పఠించిన తర్వాత ఒక దారం ముక్క లేదా కొన్ని అక్షతలను దేవుడికి సమర్పించవచ్చు.


మంత్రం॥ క్షుత్పిపాసమలాంజ్యేష్ఠా మలక్ష్మీ నాశయామ్యహమ్ ।

అభూతి మాసమృద్ధిశ్చ సర్వాన్నిర్ణుదమే గృహాత్ ॥


మంత్రం॥ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యాత్సహజం పురస్తాత్ ।


 ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభం యజ్ఞోపవితం బలమస్తుతేజః ॥


శ్లోకం॥ చక్షుభ్యం కజ్జలం రమ్యం సుభగే శక్తికారికే ।

కర్పూరం జ్యోతిరుత్పన్నం గృహాణా పరమేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - కంఠసూత్రం సమర్పయామి ॥

సమర్పణానన్తరమ్ ఆచమనీయం సమర్పయామి ॥


శ్లోకం॥ స్నానే' ధూపే చ దీపేకా ఘనాన్నదమాచరేత్ ॥

స్నానం (స్నానం), ధూపం (ధూపం) మరియు దీపం (దీపాలు) సమర్పించే ప్రక్రియలో, ఘంటన్నాదం లేదా గంట మోగించడం తప్పనిసరిగా చేయాలని పై శ్లోకం పేర్కొంది.


🌷ఆభరణం ( ఆభరణం )


శ్లోకం॥ అలంకారం మాయాదేవ సువర్ణేన వినిర్మితాన్.


ప్రీత్యర్థం తవ దేవేశ భూషణం ప్రతిగృహ్యతామ్॥


శ్లోకం॥ మాణిక్య ముక్తాఫలా విద్రుమైశ్చ గరుత్మతై శ్చాప్యధా వుప్యరాగైః ।


వైడూర్యా గోమేధికా వజ్రాణిలైః గృహాణా దివ్యాభరణి మాతః ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - నానావిధ ఆభరణి సమర్పయామి ॥


🌷10. గంధం (గంధం )


మంత్రం॥ గన్ధద్వారం దురాధర్షం నిత్యపుష్టాం కరిషిణి ।

ఈశ్వరిఘ్ం సర్వభూతానాం తామిమో'పహ్వయే శ్రియమ్ ॥


శ్లోకం॥ పరమానందసౌభాగ్య పరిపూర్ణ దిగాంతరే ।


గృహాణా పరమగన్ధం కృపయా పరమేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - శ్రీ గంధం సమర్పయామి ॥


🌷హరిద్రాచూర్ణాం ( హరిద్రచూర్ణాం )


శ్లోకం॥ స్వర్ణాభ మమలం రమ్యం పవిత్రం శుభవర్తనమ్ ।


లక్షీశంకరం చ తే దేవి హరిద్రాచూర్ణమర్పయే ॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః హరిద్రాచూర్ణః సమర్పయామి॥


 🌷( కుంకుమం )


శ్లోకం॥ కుంకుమా కంఠిదం దివ్యం కమినికామ సంభవం.

కుంకుమేనార్చితే కాలీ ప్రసీదా పరమేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః కుంకుమా సమర్పయామి॥


🌷సింధూరం


శ్లోకం॥ సింధూరామరుణాభాషం జపాకుసుమ సన్నిభం ।

పూజితాసీ మహాకాలీ ప్రసీదా పరమేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః శీమంత సింధూరం సమర్పయామి॥


🌷 ( పరిమళ పటవాసం )


అతివ సుమనోరమ్యమ్ అర్ప ఇష్యే మహేశ్వరీ ॥


శ్లోక్॥ పటవాస్ మిమన్దేవి నానాపరిమళానిత్వం ।

అతివ సుమనోరమ్యం అర్ప ఇష్యే మహేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః పరిమళ పాఠవాసం సమర్పయామి॥


🌷( దూర్వాంకురాణి )


శ్లోకం॥ దూర్వాంకురాణీ రమ్యాణి కోమలానీ నవాని చ ।

అర్ప ఇష్యామి శోభార్థం గృహాణా జగదీశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః దూర్వాంకురాణి సమర్పయామి॥


🌷బిల్వదళం ( బిల్వదళం )


శ్లోకం॥ అష్టైశ్వర్యపదం దేవి సర్వకష్ట నివారిణి ।

రమ్యం బిల్వదళం మాతః అర్పయే త్రిపురేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః బిల్వదళం సమర్పయామి॥


🌷అక్షింతలు :-


ఈ విధానం దేవుడికి అక్షతలు సమర్పించడం. శ్లోకాలు, మంత్రాలు చదివిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి.


శ్లోకం॥ అక్షతాస్తాంశులాః శుభాః కుంకుమేన విరాజితాః ।

మాయా నివేదిత భక్త్యా గృహాణ పరమేశ్వర॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - అలంకారార్థే అక్షతాన్ సమర్పయామి ॥


🌷పరిమళ ద్రవ్యం ( పరిమళ ద్రవ్యం )


ఈ విధానం దేవతకి సువాసనగల నీరు లేదా పెర్ఫ్యూమ్/కొలోన్ సమర్పించడం. స్లోకాలు చదివిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించాలి.


శ్లోకం॥ దివ్యగంధ సమాయుక్తం నానాపరిమలా'న్వితం.

గాఢ ద్రవ్యమిధం భక్త్యా దత్తం స్వీకురుశోభనమ్॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి ॥


🌷11. (పుష్పం )


ఈ విధానం వివిధ పుష్పాలను మరియు ఆకులు అందుబాటులో ఉంటే, దేవతకు సమర్పించడం. శ్లోకాలను పఠించిన తర్వాత మరియు అష్టోత్తరశతనామావళి (108 పేర్లు)తో నైవేద్యాన్ని సమర్పించాలి. అష్టోత్తరశతనామావళిలోని ప్రతి నామానికి అర్చనలో భాగంగా, పువ్వుల రేకులను తీసి, వాటిపై కుంకుమతో సమర్పించవచ్చు.


శ్లోకం॥ విశ్వరూప స్వరూపాయ నమస్తే దివ్యరూపిణే 

పుష్పమాలం ప్రదాస్యామి రక్షత్రైలోక్య రక్ష


శ్లోకం॥ మందార పారిజాతాది పాటలీ కేతకాని 

జాతీ చమ్పకా పుష్పాణీ గృహాణా పరమేశ్వరీ ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - నానావిధ విచిత్ర పరిమళపత్రపుష్పాణి సమర్పయామి ॥


🌷శ్రీ మహా వారాహి అంగ పూజ అష్టోత్తర పూజ🌷


1.ఓం చంచాలాయై నమః పాదౌ పూజయామి.

2.ఓం కపాలాయై నమః గుల్ఫౌ పూజయామి.

3.ఓం కాంత్యై నమః జంఘే పూజయామి.

4.ఓం కమలవాసిన్యై నమః ఊరుం పూజయామి.

5.ఓం లలితాయై నమః నాభిం పూజయామి.

6.ఓం క్షమాయై నమః ఉదరం పూజయామి.

7.ఓం గౌర్యాయై నమః హృదయం పూజయామి.

8.ఓం కంబు కణ్ఠ్యై నమః కణ్ఠం పూజయామి.

9.ఓం సువాసిన్యై నమః ముఖం పూజయామి.

10. ఓం స్వర్ణకుండాలాయై నమః కర్ణద్వయం పూజయామి.

11 ఓం కుమార్యై నమః శిరః పూజయామి.

12 ఓం యోగనిద్రాయై నమః పాదుకాం పూజయామి.


ఇప్పుడు వారాహీ అష్టోత్తరశతనామాలతో పూజ చేయాలి (అర్చన)


🌷12.ధూపం .


మంత్రం॥ కర్ధమేన ప్రజాభూతా మయి సంభవకర్దమా ।శ్రియం వాసయామేకులే మాతరం పద్మమాలినీమ్ ॥


శ్లోకం॥ వనస్పతి రసోద్భూతో గఢా'హ్యో గంధ ఉత్తమః.

ఆఘ్రేయః సర్వదేవనాం ధూపో'యం ప్రతిగృహ్యతామ్॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః ధూపమాఘ్రాపయామి॥


🌷13.దీపం 


మంత్రం॥ ఆపస్ర జన్తుస్నిగ్ధాని సిక్లిత వాసమేగృహే ।

 నీకా దేవి మాతరం శ్రియం వాసయామేకులే ॥


శ్లోకం॥ సుప్రకాశో మహాదీప స్సర్వత్ర తిమిరాపహో.

సబాహ్యాభ్యంతరం జ్యోతిర్దిపో'యం ప్రతిగృహ్యతామ్॥

త్రాహిమం నరఖద్ఘోరార్దిపోయాం ప్రతిగృహ్యతాం॥


మంత్రం॥ శ్రీ మహావారాహ్యై నమః ధీపం దర్శయామి॥


🌷14. నైవేద్యం


శ్లోకం॥ అనర్ఘ ప్రాతభరితం సూపపూపసమన్వితమ్.

లేహ్యకోష్యాది సయుక్తమ్ నైవేద్యం ప్రతిగృహ్యతామ్॥


శ్లోకం॥ సౌవర్ణ స్థౌలీ మధ్యే పరమాన్నం సుసంస్థితమ్ 

పంచధా శఢర సోపేతం గృహాణా పరమేశ్వరీ ॥


మంత్రాలు:-


మంత్రం॥ ఆర్ద్రం పుష్పరిణి పుష్పిం పింగళం పద్మమాలిని ।

చన్ద్రం హిరణ్మయిం లక్ష్మీం జాతవేదో మామావహా ॥


మంత్రం॥ ఓం భూర్ భువః స్వః. తత్సవితుర్ వరేణ్యం.


    భర్గో దేవస్య ధీమహి. ధియో యోనః ప్రచోదయాత్॥


మంత్రం॥ సత్యం త్వర్తేన పరిష్యామి. అమృతమస్తు.

    అమృతోపస్తరణమసి స్వాహా॥


మంత్రం॥ ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా.


మంత్రం॥ ఓం సమానాయ స్వాహా॥ యథాసుఖం జుషధ్వం॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః నైవేద్యం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి॥ ఉత్తరాపోషణం సమర్పయామి. హస్త ప్రక్షాళనః సమర్పయామి. ముఖ ప్రక్షాళనః సమర్పయామి. కరోద్వర్తనః సమర్పయామి. పాద ప్రక్షాళన సమర్పయామి. శుద్ధాచమానం సమర్పయామి॥


🌷15. తాంబూలం


మంత్రం॥ ఆర్ద్రం యఙ్కారిణి యస్తి సువర్ణాం హేమమాలిని ।


    సూర్యం హిరణ్మయిం లక్ష్మీం జాతవేదో మామావహ ॥


శ్లోకం॥ కస్తూరి మోదితం పూగం సకర్పూరం సచూర్ణకం.


నాగవల్లి దలోపేతం తాంబూలం ప్రతిగృహ్యాతం॥


శ్లోకం॥ కర్పూర నాగవల్లికం క్రముకభ్రాజితాం తధా ।


ఎలాలవంగ సమ్మిశ్రరం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥

మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః తాంబూలః సమర్పయామి॥


🌷.ఫల సమర్పణం


శ్లోకం॥ ఇదం ఫలం మాయా దేవి స్థాపితం పురతస్తవ.

తేన మే సఫలవాప్తిర్ భవేజ్జన్మని జన్మని॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః ఫలం సమర్పయామి॥


🌷దక్షిణ సమర్పణ🌷


శ్లోకం॥ హిరణ్యగర్భ గర్భస్తం హేమబీజం విభావసోః ।

అనంత పుణ్యఫలదమతః శాంతిః ప్రయచ్చ మే॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః సువర్ణపుష్పయుక్త దక్షిణాదీం సమర్పయామి॥


🌷16.నీరాజనం🌷


మంత్రం॥ త మ్మ ఆవాహ జాతవేదో లక్ష్మీమనాపగామినీం యస్యాం హిరణ్యం ।


 ప్రభుతమగవో దాస్యోశ్వన్ విన్దేయం పురుషానహమ్ ॥


శ్లోకం॥ సమస్తా చక్రచక్రాయుతేదేవి నవత్రికే ।

ఆరార్తికా మిదం తుభ్యం గృహాణ మమ శుద్ధయే ॥


శ్లోకం॥ కదలీగర్భ సంభూతం కర్పూరం తు ప్రదీపితం.

ఆరార్తికమహం కుర్వే పశ్య మాం వరదో భవ॥


మంత్రం॥ ఓం భూర్ భువః స్వః. శ్రీ వారాహి నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి॥


 నీరాజనార్తం ఆచమనీయం సమర్పయామి॥


🌷మంత్రపుష్పం


మంత్రం॥ యశ్శుచిః ప్రయాతో భూత్వా హూయ దద్వామన్వహమ్ ।

శ్రియః పంచదశ్చార్చ శ్రీ కామ స్సతతః జపేత్ ॥


ఇప్పుడు వారాహి స్త్రోత్రలు పారాయణ చేయండి, జపం, ద్యానం చేయండి.


🌷ధాతా పురస్తాదితి మంత్రపుష్పం 🌷


మంత్రం॥ ఓం ధాతా పురస్తాద్యముదజహారా. శక్రః ప్రవిద్వాన్ ప్రదిశ శ్చతస్రః.


    తమేవం విద్వా నమృత ఇహ భవతి. నాన్యః పంథా అయనాయ విద్యతే॥


మంత్రం॥ ఓం తత్పురుషాయ విద్మహే ।

    వక్రతుండాయ ధీమహి ।

తన్నో దన్తిః ప్రచోదయాత్॥


శ్లోకం॥ నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతః నమః ।

నమః ప్రకృత్యై భద్రాయై జగత్కళ్యాణమూర్తయే ॥


శ్లోకం॥ శ్రద్దయా సిక్తయా భక్త్యా హృదయప్రేమణా సమర్పితః ।

మంత్ర పుష్పాంజలిశ్చయం కృపయా ప్రతిగృహ్యతామ్॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః - సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పయామి.


కొన్ని పువ్వులు మరియు అక్షతలు దేవతకు సమర్పించాలి .


🌷నమస్కారం🌷


శ్లోకం॥ నమః సర్వహితార్థాయ జగదాధారహేతవే ।


  సాష్టాంగగోయం ప్రాణమస్తే ప్రయత్నేన మయా

 కృతః॥


🌷ఆత్మ ప్రదక్షిణ నమస్కారం🌷


ప్రదక్షిణం కరిష్యామి సతతః మోదకప్రియా ।

నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన॥


శ్లోకం॥ యాని కాని కా పాపాని జన్మాంతర కృతాని చ

  తాని తాని ప్రాణశ్యంతి ప్రదక్షిణ పదే పదే॥


శ్లోకం॥ పాపోహo పాపకర్మః పాపాత్మా పాపసంభవః ।

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలా.


శ్లోకం॥ అన్యత శరణం నాస్తి త్వమేవ శరణం మమ.

తస్మాత్కారుణ్యభావేన రక్షా రక్షా గణా ధిపః॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి॥


🌷ప్రసన్నార్ఘ్యం🌷(పూజలో లోపాలు క్షమించమని కోరడం)


శ్లోకం॥ రక్ష రక్ష గణాధ్యక్ష రక్ష త్రైలోక్యరక్షక.

భక్తానామభయం కర్తా త్రాతా భవ భవార్ణవత్॥


శ్లోకం॥ ద్వైమాతుర కృపాసిద్ధో శణ్మాతురాగ్రజ ప్రభో ।

వరదస్త్యం వరం దేహి వంశితం వంశితార్థదా॥


శ్లోకం॥ అర్ఘ్యం గృహాణ హేరమ్బా సర్వభద్రప్రదాయకా.

అనేన పునరార్ఘ్యేన వరదో'స్తు సదా మమ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః పునరర్ఘ్యం సమర్పయామి॥


🌷అపరాధ క్షమాపణం🌷


శ్లోకం॥ ఆవాహనం నజానామి న జానామి తవార్చనమ్.

పూజం చైవ నజానామి క్షమస్వ పరమేశ్వర॥


శ్లోకం॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర.

యత్పూజితం మాయా దేవా! పరిపూర్ణం తదాస్తు తే॥


శ్లోకం॥ అపరాధ సహస్రాణి క్రియం తే'హర్నిశాం మయా.

దాసో'యమితిమం మత్వా క్షమస్వ పరమేశ్వర॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః అపరాధ క్షమాపణః సమర్పయామి॥


🌷ప్రార్థన🌷 


శ్లోకం॥ గతం పాపం గతం దుఃఖం గతం దరిద్ర్యమేవ చ ।

ఆగతా సుఖసంపత్తిః పుణ్యాచ్చ తపదర్శనాత్ ॥


శ్లోకం॥ రూపందేహి జయందేహి యశోదేహి ద్విశోజహి ।

పుత్రాన్ దేహి (మీరు కోరుకునేది ఇక్కడ చెప్పాలి) ధనందేహి సర్వాన్ కామంశ్చ దేహి మే ॥


శ్లోకం॥ యద్దత్తం శక్తిమాత్రేణ పత్రం పుష్పం ఫలం జలమ్ ।

నివేదితాం చ నైవేద్యం తత్గృహాణానుకమ్పయా ॥


మంత్రం॥ శ్రీ మహా వారాహ్యై నమః ప్రార్థన సమర్పయామి॥


🌷పునఃపూజ🌷


మంత్రం॥ ఛత్రమాచ్ఛాదయామి. చామరేణ విజయామి. దర్పణం దర్శయామి.


నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యాన్ ఘోషయామి. అశ్వారోహణం కల్పయామి. గజారోహణం కల్పయామి. మూషికారోహణం     


కల్పయామి. సమస్త రాజోపచార షోడశోపచార శక్త్యుపచార భక్త్యుపచారన్ కల్పయామి॥


🌷పూజాసమర్పణం🌷


శ్లోకం॥ యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజక్రియాదిషు.

న్యూనః సంపూర్ణతాం యాతి సద్యోవన్దే తమచ్యుతః॥


శ్లోకం॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప.

యత్పూజితాం మాయా దేవా పరిపూర్ణం తదాస్తు తే॥


మంత్రం॥ అనయా ఆవాహనాది శోషశోపచారి పూజయా చ భగవాన్ సర్వాత్మకః

 శ్రీ వారాహిః సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు.


ఉత్తరే శుభకర్మాణ్య విఘ్నమస్త్వితి భవన్తో భ్రువంతు - ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు


మంత్రం॥ శ్రీ వారాహి ప్రసాదం (యజమానస్వ్వ శిరసా గృహాతు॥) శిరగృహ్ణామి॥


   (శతమానం భవతి శతాయుః పురుష స్తతేష్ద్రియ ఆయుష్యేవేష్ద్రియే ప్రతిష్ఠతి॥)


🌷ఉద్వాసనం ఇంట్లో చేసుకునే ఈ పూజకు అవసరం లేదు చేయాలి అనుకునే వారు ఈ కింది విధంగా చెప్పుకోవాలి.


🌷యజ్ఞేన యజ్ఞమితి ఉద్వాసనం :-


మంత్రం॥ ఓం యజ్ఞే న యజ్ఞ మయాజాంతా దేవః తాని ధర్మాణి ప్రథమ న్యాసన్॥


శ్లోకం॥ గచ్ఛ గచ్ఛ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వరా.

ఇష్ఠకామ్యార్థ సిద్ధ్యర్థం పునరాగమనాయ చ॥


మంత్రం॥ శ్రీ వారాహి యథాస్థానం ప్రవేశయామి ముద్వాసయామి - శోభనార్థం పునరాగమనాయచ॥


ఇతి శ్రీ సూక్త విధానేన దేవతార్చనం సంపూర్ణమ్ ॥


🌷శ్రీ మాత్రే నమః🌷