👉భూమి మంచి ధరకు అమ్మాలి అంటే అందులో మట్టిని తెచ్చి గణపతి ని చిన్న ఆకారం గా చేసి పూజ చేసే విధానం ఇది వరకు ఇచ్చాను అలా చేసుకోండి.. ఆ పోస్ట్ సేవ్ చేసుకున్న వారు పంపండి మళ్ళీ గ్రూప్ లో సేవ్ చేస్తాను,
డబ్బుకు కష్టంగా ఉండి ధనం నిలవడం లేదు కనీసం అవసరాలు తిరడానికి ఇబ్బంది అయినప్పుడు మీ దగ్గర ఉన్న ఒక 100 కానీ 500 లేక ఎంతో కొంత మీకు కలిగిన అమౌంట్ కాగితం పైన చిన్న గణపతి ని ఉంచి త్రిసతి పారాయణం చేస్తూ గరికతో అర్చనలు చేయండి గరిక దొరకని వారు ఎర్రటి అక్షంతలతో అర్చన చేయండి ఇలా 41 రోజు చేసాక ప్రతి చవితి ప్రతి బుధవారం రోజు చేస్తూ ఉండండి ధనం సంపాదించే అవకాశం వస్తుంది,నిలుస్తుంది.
వ్యాపారస్థులు లాభాలు కొత్త అవకాసాలు వ్యాపార వృద్ధి కోసం 108 లవంగాలు తో అష్టోతరం పూజ రోజు చేయండి.. ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయి అవే రోజూ ఉపయోగించవచ్చు..
వ్యాపారానికి ఇంటికి దిష్టి బాగా తగిలి యజమానికి ఇబ్బందులు ఆరోగ్యం సమస్యలు అవుతుంటే.. రాళ్ల ఉప్పు నీటిలో వేసి ఇళ్ళు తుడవండి కొంచెం ఉప్పు నీటిలో వేసి స్నానం చేయండి తరచూ బిర్యానీ ఆకులు వేసి తెల్లఆవాలు వేసి దూపం వేస్తూ ఉండండి... లక్ష్మి దేవి ఫోటోకి పచ్చిమిర్చి దండగ కట్టి శుక్రవారం వేసి అవి శనివారం రోజు తీసేయాలి ఇలా చేస్తూ ఉంటే ఆదాయం కి ఉండే దిష్టి పోతుంది
ఒక ఎర్రటి cloth అర మీటర్ తీసుకుని కొంచెం బియ్యం మూటకట్టి వంటగది లో తూర్పు వైపు కట్టి పెట్టండి ఆహారంకి ఇబ్బంది ఉండదు.
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుంటే హాల్ లో తూర్పు ఆగ్నేయం మూల ఒక దీపం పెట్టండి అలా కొద్ది రోజులు చేస్తూ ఉండండి పెట్టే దీపం ఒక పల్లెం లో ఉంచి అందులో కొన్ని నీళ్లు పోసి పసుపు వేసి పెట్టండి ఇంట్లో ఆశాంతి దూరం అవుతుంది
మంగళవారం రోజు గుమ్మానికి అటు ఇటు నిమ్మకాయ లు సగానికి కట్ చేసి గుమ్మం ముందు పెట్టి మరుసటి రోజు తీసి పడేయండి ఇంట్లో వాళ్ళు చేసే ప్రయత్నలకు ఆటంకాలు తొలగి పోతాయి..
వివాహం ఆలస్యం అవుతుంటే, జాతకం లో దోషాలు ఉంటే నియమంగా 41 రోజులు అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం పెట్టండి ఆ 41 రోజులు శాఖహారం తీసుకోవాలి, 5 రోజులు అడ్డు స్నానం ఐయ్యాక మళ్ళీ కంటిన్యూ చేయాలి 41 రోజులు తర్వాత అమ్మవారికి అర్చన చేసుకుని 5 మందికి అయినా తాంబూలం ఇవ్వాలి ఒక కన్య వాయనం ఇవ్వాలి అంటే ఎంత మందికి ముత్తదువులకు ఇచ్చిన ఒక తాంభూలం పెళ్లి కానీ వాళ్ళకి ఇవ్వాలి దుర్గా దేవి ఆ రూపంలోనే అందుకుంటుంది..
డబ్బులు నేరుగా బీరువాలో పెట్టకూడదు ఉప్పు డబ్బాలో ఉంచి తర్వాత బీరువాలో పెట్టుకోవాలి డబ్బు అనవసరమైన ఖర్చులు అవ్వకుండా నిలుస్తుంది..
రాత్రి పూట తల స్నానం చేయకూడదు, చిక్కు తియ్యకూడదు, ముత్తాయిదువులు చెవి కమ్మలు రాత్రిసమయంలో తియ్యకూడదు..
ఇవన్నీ మీరు క్షేమం గా ఉండాలి అని ఆశించి చెప్తున్నవే నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం ఇంకా ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి ఒకే రోజు వద్దులే...
🌹శ్రీ మాత్రే నమః 🌹