Saturday, March 25, 2023

Thidhulu - Phalaalu

 పాడ్యమి - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి 

విదియ -  ఏ విదమైన  పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది

తదియ - సౌక్యం, కార్య సిద్ధి 

చవితి   - మధ్యాహ్న అనంతరం జయమవుతాయి 

పంచమి - ధన ప్రాప్తం, శుభ  యోగం 

షష్టి      - కలహం, రాత్రి కి శుభం

సప్తమి  - సౌక్యకరం

అష్టమి  -కష్టం

నవమి  - వ్యయ ప్రయాసలు 

దశమి  -  విజయ ప్రాప్తి 

ఏకదశి  - సామాన్య ఫలితములు

ద్వాదశి - భోజన అనంతరం జయం 

త్రయోదశి -జయం

చతుర్దశి   -రాత్రి కి శుభం 

పౌర్ణమి   - సకల శుభకరం

అమావాస్య- సాయంత్రం నుండి శుభకరం

 

షష్టి - శనివారం, సప్తమి - శుక్రవారం, అష్టమి - గురువారం, నవమి - భుదవారం, దశమి - మంగళవారం, ఏకాదశి - సోమవారం, ద్వాదశి - ఆదివారం ,ఇట్లు వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు.

వీటిని దగ్ధయోగాలు అంటారు.

Thursday, March 16, 2023

మీపైన నింద పడి నిరూపించుకోలేని స్థితిలో మీరు ఉంటే

 🌷🙏మీపైన నింద పడి నిరూపించుకోలేని స్థితిలో మీరు ఉంటే🙏🌷


కొందరు తప్పు చేయకున్న వారిని నిందిస్తునప్పుడు ఈ తప్పు నేను చేయలేదు అని వాదించలేరు అంత సమర్థంగా మాట్లాడి వారి తప్పులేదు అని నిరూపించుకోలేరు ఎందుకంటే కల్పించి నిందించే వారు అన్ని విధాలా వాళ్ళని బాధపెట్టాలి అని నిర్ణయించుకుని నిందలు వేస్తుంటారు కనీసం అవతలి వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అలా మోసపోయే వారిలో అమాయకులే ఎక్కువగా ఉంటారు..వాళ్ళు గట్టిగా గర్దించి సమాధానం చెప్పుకోలేరు నిందలు భరించలేరు మౌనంగా రోదిస్తూ ఉంటారు అటువంటి వాళ్లకు చాలా సులభమైన పరిహారం ఒకటి ఉంది ..


గణపతిని గరికతో అర్చించి ఆ గరికను పడవేయకుండా మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వేసుకుని స్నానం చేయాలి..


అలాగే ఇక్కడ ఇచ్చిన అగ్నిదేవుని నామాలు నిత్యం ఒక జపం లాగా స్మరిస్తూ ఉండాలి ఒక దీపం ఎదురుగా పెట్టుకుని అందులో అగ్ని దేవున్ని దర్శించి నమస్కారం చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క అటుకులు నైవేద్యం పెట్టి ఈ అగ్ని నామాలు వీలైనంత ఎక్కువ సార్లు అంటే కనీసం మీ వయసు ఎంత ఉంటే అన్ని నిముషాలు జపం చేయాలి తర్వాత నిరంతరం మనసులో అగ్ని దేవున్ని స్మరిస్తూ ఉండాలి.. మీరు జపం మొదలు పెట్టే సమయంలో మీ సమస్య ఆ అగ్ని దేవుడికి చెప్పుకోవాలి..ఎలా అంటే సర్వశ్య శరణాగతి తో నువ్వు నన్ను రక్షించాలి నిన్నే నమ్ముకున్నాను నన్ను రక్షించు అని కోరుకోవాలి..మీరు నమ్మిన నమ్మకపోయిన మీపట్ల ద్రోహం చేసిన వారికి ముందు కడుపులో మంట మొదలు అవుతుంది చెప్పుకోలేని చోట సెగెడ్డలు మొదలు అవుతాయి అనుక్షణం మీపట్ల చేసిన తప్పుని వారంతట వారే గుర్తు చేసుకొని పశ్చాత్తాప పడతారు..నిజం ఎదో విధంగా బయట పడుతుంది..


అలాగే మేము ఏమి పాపం చేసామో ఇలాంటి బాధలు పడుతున్నాము అనే మాట వింటూనే ఉంటాము కదా అలంటి బాధలో ఉన్న వారు ఎవరైనా సరే అగ్ని దేవున్ని ఇలా పూజించి శుభ ఫలితాలు పొందవచ్చు..


🌷🙏జపించాల్సిన అగ్ని నామాలు🙏🌷


ఓం జాతవేదసే నమః

ఓం పావకాయ నమః

ఓం జ్వలనాయ నమః 

ఓం విభావసే నమః

ఓం చిత్రభానునే నమః

ఓం భూరితెజసే నమః

ఓం శిఖినే నమః 

ఓం పింగేషునే నమః

ఓం హిరణ్యకృతనే నమః

ఓం ప్లవంగనే నమః 

ఓం మాతరిశ్వంతనే నమః

ఓం వైశ్వానర నమః 

ఓం ధూమకేతవే నమః 

ఓం తోమరాయుధనే నమః

ఓం అబ్జహస్తు నమః

ఓం శుక్రయే నమః

ఓం శుచియే నమః

ఓం రోహితస్వునే నమః 

ఓం చాగర్తయే నమః

ఓం సప్తజిహ్వయే నమః

ఓం నమో అగ్ని దేవాయ నమః


ఈ అద్భుతమైన నామాలు ఒక్క ఫలితం ఫభావం , ధూమావతి, వారాహి, భగల, అశ్వరూడా..ఉపాసకులకు బాగా తెలుస్తుంది.. 


👉 కుటుంబం లో బంధువులు వల్ల నిందలు, ఆఫీసులో వ్యాపారం లో నిందలు చేయని తప్పుకి శిక్షలు ఇలాంటి బాధితులు కొందరికి ఈ పరిహారమే ఇచ్చాను వారు ఎంత శ్రద్ధగా చేశారో గాని మంచి ఫలితాన్ని పొందారు.. ఇలా మేస్సంజర్ లో చాలా మందికి పెట్టిన పరిహారాలు గ్రూప్ లో పోస్ట్ చేసే సమయం లేక చాలా పెట్టడం లేదు అటువంటి చాలా పరిహారాలు గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను..


🌷🙏నమో అగ్ని దేవాయ🙏🌷

🌷🌷శ్రీ మాత్రే నమః🌷🌷

యమ తర్పణం

 🌷🙏యమతర్పణము🙏🌷


🙏యమ తర్పణం చేయు తిధులు:-🙏


ఆశ్వయుజ బహుళ చతుర్దశి అనగా - నరకచతుర్దశినాడు యమ తర్పణం చేయాలి


 కృష్ణపక్ష చతుర్దశితో కూడిన మంగళవారము ఏ మాసంలో వచ్చినా  యమతర్పణము చేయవచ్చు

ఈ తర్పణాలు స్ట్రీలు పురుషులు ఎవ్వరైనా చేయవచ్చు..


 దక్షిణాభిముఖముగా కూర్చుండి, దేవతీర్థము ద్వారా యముని గూర్చి తిలతర్పణము విడువాలి దేవతలకు ఇచ్చే విధముగా ఐదు వేళ్ళు మధ్య భాగం నుండే విడువాలి..


ఆచమ్య |॥ ప్రాణానాయమ్య ॥ || ఏవంగుణ .... శుభతిధౌ || శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం దీపోత్సవ చతుర్దశ్యాం / (కృష్ణాంగారక చతుర్దశ్యాం) యమతర్పణం కరిష్యే IIదీపావళి చతుర్దశి సమయంలో ( సంకల్పించవలెను.)


 (దక్షిణ దిక్కు చూస్తూ కూర్చుండి దేవతీర్థముద్వారా తిలలతో కూడిన జలముతో తర్పణము చేయవలయును.) నీటిలో నువ్వులు కలిపి 


1. యమం తర్పయామి ॥


2. ధర్మరాజానం తర్పయామి ॥


3. మృత్యుం తర్పయామి ॥


4. అంతకం తర్పయామి  ॥


5. వైవస్వతం తర్పయామి ॥


6. కాలం తర్పయామి ॥


7. సర్వభూతక్షయం తర్పయామి ॥


8. ఔదుంబరం తర్పయామి ॥


9. దధ్నం తర్పయామి ॥


10. నీలం తర్పయామి ॥


11. పరమేష్ఠినం తర్పయామి ॥


12. వృకోదరం తర్పయామి II


13. చిత్రం తర్పయామి ॥


 14. చిత్రగుప్తం తర్పయామి ॥


II ఇతి తర్పయేత్ II


ఇలా తర్పణాలు చేసి ఈ శ్లోకాలతో యమధర్మరాజు కి నమస్కారం చేయాలి.. 👇ఈ శ్లోకాలు రోజూ నిత్య పూజలో కూడా స్మరించవచ్చు


యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయ చ | 

వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ॥ 1


 ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే ।వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః ॥ 2


🌷హర హర మహదేవా🌷


👉యమ తర్పణాలు చేస్తే అకాల మృత్యు దోషాలు, గండాల తొలగిపోతాయి, ఎదో జరుగుతుంది అని ఊహిస్తూ కారణం లేని  భయంతో  ఉంటారు అటువంటి భయాలు నుండి విముక్తి కలుగుతుంది.. ధర్మంగా మీకు రావాల్సింది దక్కుతుంది.. యమధర్మరాజు ధర్మ ప్రభువు భక్తితో వారికి చేసే ఈ తర్పణం అన్ని శుభాలను ఇస్తుంది.. పిశాచాల పీడ తొలగిస్తుంది...