Friday, December 30, 2022

శ్రీ నీల సరస్వతీ స్తోత్రము

 🌷🙏ఆర్ధిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, 

విద్యలో ఆటంకాలు,

ఎంత చదివినా పరీక్షలలో రాణించలేక పోవడం,

జీవితం మీద విరక్తి కలుగుతోంది అంటే


అష్టమి ,నవమి ,చతుర్దశి తిధులయందు 6 నెలలపాటు శ్రీ నీల సరస్వతీ స్తోత్రం పఠించినచో సిద్ధి పొంది ఎటువంటి కార్యము అయిననూ నిర్విగ్నముగా జరుగును.

జాతకంలో బుధుడు బలహీనుడుగా వున్నపుడూ,

బుధ దశ జరుగుచున్నవారు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, ఆర్ధికాభవృద్ధి కోరుకునే వారికి అద్భుత ఫలములను కల్గించును


——-శ్రీ నీల సరస్వతీ స్తోత్రం——


ఘోరరూపే మహారావే సర్వశత్రుక్షయంకరీ |

భక్తేభ్యో వరదే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 1 ||


సురాఽసురార్చితే దేవి సిద్ధగంధర్వసేవితే |

జాడ్యపాపహరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 2 ||


జటాజూటసమాయుక్తే లోలజిహ్వానుకారిణీ |

ద్రుతబుద్ధికరే దేవి త్రాహి మాం శరణాగతమ్ || ౩ ||


సౌమ్యరూపే క్రోధరూపే చండరూపే నమోఽస్తు తే |

సృష్టిరూపే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 4 ||


జడానాం జడతాం హంసి భక్తానాం భక్తవత్సలా |

మూఢతాం హర మే దేవి త్రాహి మాం శరణాగతమ్ || 5 ||


హ్రూం హ్రూంకారమయే దేవి బలిహోమప్రియే నమః |

ఉగ్రతారే నమస్తుభ్యం త్రాహి మాం శరణాగతమ్ || 6 ||


బుద్ధిం దేహి యశో దేహి కవిత్వం దేహి దేవి మే |

మూఢత్వం చ హరేర్దేవి త్రాహి మాం శరణాగతమ్ || 7 ||


ఇంద్రాదిదేవ సద్వృందవందితే కరుణామయీ |

తారే తారధినాథాస్థే త్రాహి మాం శరణాగతమ్ || 8 ||


అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం చ పఠేన్నరః |

షణ్మాసైః సిద్ధిమాప్నోతి నాఽత్ర కార్యా విచారణా || 1 ||


మోక్షార్థీ లభతే మోక్షం ధనార్థీ లభతే ధనమ్ |

విద్యార్థీ లభతే విద్యాం తర్కవ్యాకరణాదికమ్ || 2 ||


ఇదం స్తోత్రం పఠేద్యస్తు సతతం శ్రద్ధయాన్వితః |

తస్య శత్రుః క్షయం యాతి మహాప్రజ్ఞా ప్రజాయతే || ౩ ||


పీడాయాం వాపి సంగ్రామే జప్యే దానే తథా భయే |

య ఇదం పఠతి స్తోత్రం శుభం తస్య న సంశయః |


ఇతి శ్రీ నీల సరస్వతీ స్తోత్రం ||

బాలామంత్రము

 🌷🙏బాల🙏🌷


ప్రతి రోజు ఈ శ్లోకముతో బాల తల్లిని స్మరించుకోవాలి.


బాల పర్వతవర్ధనీ భగవతీ

         బాలార్క కోటి ప్రర్భా

కల్యాణీ నిఖిలేశ్వరీ శుభకరీ

          గౌరీ శివా పార్వతీ


సర్వజ్ఞా సకలాగమాంత వినుతా

           సౌభాగ్య సంపత్ప్రదా

దుర్గాంబా నవకోటిమూర్తి సహితా

            మాంపాతు మహేశ్వరీ ||


భావము :

 పర్వతరాజైన హిమవంతుని ప్రభావమును వృద్ధి పొందించు నదియును, వరమైశ్వర్యనంవున్నయును, ఉదయించుచున్న, కోటిసూర్యులకాంతి కలదియును, జగత్కల్యాణ స్వరూపిణియును, సకల లోకాధీశ్వరియును, భక్తులకు సమస్త శుభములు సమకూర్చునదియును, మంగళగౌరీదేవియును, శుభప్రదయును, హైమవతియును సకల కలావేదినియును, నానావిధములైన ఉపనిషత్తులచే ఉపాసింపబడునదియును. సౌభాగ్య సంపత్కారిణియును, నవకోటిరూపధారిణియున -మహేశ్వరి మహాదుర్గ జగన్మాత "బాల" నన్ను రక్షించుగాక

🌹🙏బాలామంత్ర బీజములు🙏🌹


ఐంద్రస్యేవ శరాసనస్య దధతీ

మధ్యే లలాటం ప్రభాం


శౌక్లీం కాంతి మనుష్ట గోరివ 

శిర స్వాతన్వతీ సర్వతః |


ఏషాzసౌః త్రిపురాహృది ద్యుతి రివో 

ష్టాంశో స్సదాహస్థితా


చ్ఛింద్యాన్న స్సహసా పదై స్త్రిభి రఘం 

జ్యోతిర్మయీ వాఙ్మయీ ॥


ఐం, క్లీం, సౌః అనునవి పై శ్లోకములోని) ప్రథమ, ద్వితీయ, తృతీయ పాదములలో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయాక్షరములు. ఇవియే సర్వమంత్ర శాస్త్ర సౌధమునకు పునాదిరాళ్ళయిన బాలామంత్ర బీజములు. వాని నిందు గుప్తముగా ఉంచబడినవి. అంతేకాక ధ్యాన సమయమందు

 లలాట మధ్యమున ఇంద్రధనుః ప్రభతోను, శిరమునందు శుక్లపక్ష చంద్రకాంతితోను, హృదయమందు సూర్య ప్రభతోను, 

దేవి దర్శనమిచ్చును. ఆ తేజస్సే పరా పశ్యంతీ మధ్యమా వైఖరీ వాక్కులనెడి త్రిపురసుందరి రూపము. లలాటము, శిరము, హృదయము అను మూడు పదములతో మా పాపములను ఖండించు గాక !


🙏కాళిదాస 'పంచస్తవి' నుండి🙏


🌹శ్రీ మాత్రే నమః🌹





🌷శ్రీ మాత్రే నమః🌷

అసితాంగ బైరావుని మంత్రం

 🌷🙏సరస్వతీ ఉపాసన సిద్ధించాలంటే అసితాంగ బైరావుని ముందుగా అనుగ్రహం పొందాలి🙏🌷


వరాలనిచ్చే అసితాంగ భైరవస్వామిని అర్చించి, సిద్ధిపొందాలి. ఆ తర్వాతే సరస్వతీ ఉపాసన సిద్ధిస్తుంది.


దిగ్భందన మంత్రం:- తూర్పు నమస్కరిస్తూ ఈ మంత్రం చదవండి.


ప్రాచ్యాం దిశి అసితాంగ భైరవోదేవతా 

హంసవాహనః కృష్ణవర్ణః కమండలుహస్తః 

అసితాంగ భైరవో బధ్నాతు భైరవమండలమ్|

అసితాంగ భైరవః చతుర్లక్షకోటి

యోగినీ సహిత అసితాంగ భైరవమండలం

ప్రత్యక్ష బంధ బంధ సపరివారకం

సర్వతో మాం రక్ష రక్ష॥

🌷🙏మహా బైరావాయ నమః🙏🌷

రురు భైరవుడి ధ్యానం

 🌷🙏రురు భైరవుడి ధ్యానం🙏🌷


పార్వతి, శ్యామల, ప్రత్యంగిరి, దశమహావిద్యలు ఉపాసనలు చేసేవారు . ముందుగా రురుభైరవుడిని ఉపాసన చేయాలి. ఈయన అనుగ్రహంతోనే రుద్రాణి సిద్ధిస్తుంది. రురుభైరవుడి రూపంలో వరాలిచ్చే రుద్ర స్వరూపుడీతడే ఆగ్నేయ దిశకు నిలబడి ఈమంత్రాన్ని జపించాలి.


గాయత్రి: -


దిగంబరాయ విద్మహే 

వృషారూఢాయ ధీమహి

తన్నో రురుభైరవః ప్రచోదయాత్||


దిగ్బంధన మంత్రం:-


ఆగ్నేయ్యాం దిశి రురు భైరవ దేవతా

వృషభవాహనః, శుద్ధ స్పటిక వర్ణః టంకహస్తః

రురుభైరవో బద్నతు భైరవమండలం|| 


రురుభైరవా! సప్తలక్ష కోటి యోగినీ సహిత రురుభైరవ మండలం ప్రత్యక్షం

బంధ బంధ సపరివారం తోమాం రక్షరక్ష!


ఈ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ దేవతలను జపించాలి 


🌷బైరవాయ నమః🌷

పుత్ర సంతానం కలుగుటకు గణపతి ఆరాధన

 🌷🙏పుత్ర సంతానం కలుగుటకు గణపతి ఆరాధన🙏🌷


శ్లో॥ నమోస్తు గణనాథాయ సిద్ధి బుద్ధి యుతాయచ సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధి ప్రదాయచ౹ గురూదరాయ గురవే గోప్తే గుహ్యా సీతాయతే ౹

గోప్యాయ గోపితా శేష భువనాయ చిదాత్మనే విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టి కరాయతే నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుoడినే ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమః | ప్రసన్న జన పాలాయ ప్రణతార్తి వినాశినే ॥ 

శరణం భవదేవేశ సంతతిం సుదృఢాం కురు। భవిష్యంతిచ యేపుత్రా మత్కులే గణనాయక 

తే సర్వేతవ పూజార్ధం నిరతాః స్యుర్వరామతిః పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధి ప్రదాయకం ॥

విధానము: ఈ సంతాన గణపతి స్తోత్రమును భక్తితో ప్రతి రోజు చదువువారికి గణపతి కృపవల్ల పుత్ర సంతతి కలుగును. అంతేగాక మంచి లక్షణాలు గల గుణవంతుడు యోగ్యుడు అవుతాడు.

🌷శ్రీ గణేశాయ నమః🌷

Thursday, December 29, 2022

శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్

 🙏శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా స్తోత్రమ్ 🙏


🌹వినియోగః🌹


ఓం అస్యశ్రీ విశ్వరూప ప్రత్యంగిరా ఖడ్గమాలా మంత్రస్య అఘోర ఋషిః, శ్రీ విశ్వరూప ప్రత్యంగిరాదేవతా, ఉష్ణిక్ ఛందః, ఆం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా సాక్షాత్కారర్ధే జపే వినియోగః 


🙏*స్తోత్రమ్*🙏


1.ఓం ఆం హ్రీం క్రోం ప్రత్యంగిరే విశ్వరూపిణి, అండమయి, పిండ మయి, బ్రహ్మాండమయి *ప్రథమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా!*


2.శంభుమయి, ఈశమయి, పశుపతిమయి, శివమయి, శూలీమయి, మాహేశ్వరమయి, ఈశ్వరమయి, శర్వమయి, ఈశానమయి, శంకరమయి, చంద్రశేఖరమయి, భూతేశమయి, ఖండపరశుమయి, గిరీశమయి, మృడ మయి, మృత్యుంజయమయి, కృత్తివాసమయి, పినాకీమయి, ప్రవథాధిప మయి, ఉగ్రమయి, కపర్దీమయి, శ్రీకంఠమయి, శితికంఠమయి, కపాలభృత్మయి , వామదేవమయి, మహాదేవమయి, విరూపాక్షమయి, త్రిలోచనమయి, కృశానురేతామయి, సర్వజ్ఞమయి, ధూర్జటిమయి, నీలలోహితమయి, హరమయి, స్మరహరమయి, భర్గమయి, త్య్రంబకమయి, త్రిపురాంతకమయి, గంగాధరమయి, అంధకరిపుమయి, క్రతుధ్వంసమయి, వృషధ్వజమయి. . వ్యోమకేశమయి, భవమయి, భీమమయి, స్థాణుమయి, రుద్రమయి, ఉమా పతిమయి, అఘోరమయి *ద్వితీయావరణరూపిణి శ్రీవిశ్వరూపప్రత్యంగిరా*


3.విశ్వమయి, నారాయణమయి, కృష్ణమయి, వైకుంఠమయి, విష్టరశ్రవ మయి, దామోదరమయి, హృషీకేశమయి. కేశవమయి, మాధవమయి, స్వభూర్మయి, దైత్యారిమయి, పుండరీకాక్షమయి, గోవిందమయి, గరుడధ్వజ మయి, పీతాంబరమయి, అచ్యుతమయి, శాజ్ఞమయి, విష్వక్సేనమయి, జనార్ధనమయి, ఉపేంద్రమయి, ఇంద్రావరజమయి. చక్రపాణిమయి. చతుర్భుజమయి, పద్మనాభమయి, మధురిపుమయి, వాసుదేవమయి, త్రివిక్రమమయి, దేవకీనందనమయి, శౌరిమయి. శ్రీపతిమయి. పురుషోత్తమ మయి, వనమాలీమయి, బలిధ్వంసీమయి, కంసారాతిమయి, అధోక్షజమయి, విశ్వంభరమయి, కైటభజిత్ మయి, విధుమయి. శ్రీవత్సలాంఛన మయి, ఆనకదుందుభిసుతమయి *తృతీయావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా*


4.బ్రహ్మమయి, ఆత్మభువమయి, సురజ్యేష్ఠమయి, పరమేష్ఠీమయి, పితా మహమయి, హిరణ్యగర్భమయి, లోకేశమయి, స్వయంభువమయి. చతురాననమయి, ధాతామయి, అబ్జయోనిమయి, ద్రుహిణమయి, విరించి మయి, కమలాసనమయి, స్రష్టామయి, ప్రజాపతిమయి, విధాతమయి, విశ్వసృజమయి, విధిమయి, సత్యలోకమయి *చతుర్ధావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా!*


5.సూరమయి, సూర్యమయి, అర్యమమయి, ద్వాదశాత్మమయి, దివాకర మయి, భాస్కరమయి, అహస్కరమయి, బధ్నమయి, ప్రభాకరమయి, విభాకర మయి, భాసమయి, వివస్వాన్మయి, సప్తాశ్వమయి, హరిదశ్వమయి, ఉష్ణ రశ్మిమయి, వికర్తనమయి, అర్కమయి, మార్తాండమయి, మిహిరమయి, పూషామయి, ద్యుమణిమయి, తరణిమయి, మిత్రమయి, చిత్రభానుమయి, విరోచనమయి, విభావసుమయి, గ్రహపతిమయి, త్విషాంపతి మయి, అహర్పతిమయి, భానుమయి, హంసమయి, సహస్రాంశుమయి, తపనమయి, సవితామయి, రవిమయి, కర్మసాక్షమయి, జగచ్చక్షుమయి , అంశుమాలీమయి, త్రయీతనుమయి, ప్రద్యోతనమయి, దినమణి ఖద్యోతమయి, లోక బాంధవమయి, సురోత్తమమయి, ధామనిది పద్మినీ వల్లభమయి, హరిమయి, మాఠరమయి, పింగళమయి, దండుమయి, సూర్యసూనమయి, అరుణమయి, అనూరుమయి, కాశ్యపి మయి, గరుడా గ్రజమయి, పరివేషమయి, పరిధిమయి, ఉపసూర్యకమయి, మండలమయి , కిరణమయి, ఉస్రమయి, మయూఖమయి, అంశుమయి, గభస్తిమయి ఘృణిమయి, తిగ్మంమయి, కరమయి, మరిచిమయి, దేవనయోమయి మృగతృష్ణామయి *పంచమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా!* 


6.భూ:మయి, అచలామయి, అనన్తమయి. రసామయి, విశ్వంభర మయి, స్థిరామయి, ధరామయి, ధరిత్రీమయి, ధరణీమయి, క్షోణీమయి, జినాతిమయి, కాశ్యపీమయి, క్షితిమయి, సర్వసంహారమయి, వసుమతీ మయి, వసుధామయి, ఉర్వీమయి, వసుంధరామయి, గోత్రామయి. కుహూమయి, పృథ్వీమయి, ప్రఖ్యాతమయి, క్ష్మామయి, అవనిమయి,మేదినీమయి, మహీమయి, మృత్తికామయి, మృత్స్నామయి, ఉర్వరామయి, బీజఊషమృత్తికామయి, క్షారమృత్తికామయి, ఊషవాన్మయి, స్థలమయి, మరుస్థలమయి, ఖిలమయి, జగతీమయి, లోకమయి, విష్టపమయి, భువనమయి, భరతవర్షమయి, ప్రాచ్యదేశమయి, ఉదీచ్యదేశమయి, మ్లేచ్చదేశమయి, మధ్యదేశమయి, పుణ్యభూమిమయి, నీవృత్ జనమయి, దేశమయి, విషయమయి, నడప్రాయమయి, కుముదప్రాయమయి, వేతస్వామయి, శాదహరితమయి, పంకిలమయి, అనూపదేశమయి, శర్కరామయి, శర్కరిలామయి, శార్కరమయి, శర్కరావాంశ్చమయి, సికతాదేశమయి, నదీమాతృకాదేశమయి, దేవమాతృకాదేశమయి, రాజస్వాన్ దేశమయి, రాజవాన్ దేశమయి, గోస్థానదేశమయి, గోష్టినందేశ మయి, పర్యంత భూదేశమయి, సేతుదేశమయి, వామలూరు దేశమయి, నాకు జంతు దేశమయి, వల్మీకదేశమయి, అయినవర్తప్రదేశమయి, మృగ అన్వేషణ దేశమయి, మార్గాధ్వదేశమయి, పంథాదేశమయి *షష్టావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా!*


7.సముద్రమయి, అబ్దిమయి, ఆకూపారమయి, కర్ణధారమయి, సరిత్పతి మయి, ఉదన్వానమయి, ఉదధిమయి, సింధుమయి, సరస్వాన్మయి,సాగరమయి, అర్ణవమయి, రత్నాకరమయి, జలనిధిమయి, యాదఃపతి మయి, అపాంపతిమయి, క్షీరార్ణవమయి, లవణోదమయి, దధ్యార్ణవమయి, ఘృతార్ణవమయి, ఇక్షూదమయి, సురార్ణవమయి, స్వాదూదమయి, ఆపమయి, వారిమయి, సలిలమయి, కమలమయి, జలమయి, పయ మయి, కీలాలమయి, అమృతమయి, జీవనమయి, భువనమయి, వనమయి, కబంధమయి, ఉదకమయి, పాథమయి, పుష్కరమయి, సర్వతోముఖమయి, అమ్భోమయి, అర్న మయి, తోయమయి, పానీయమయి, నీరమయి, క్షీరమయి, అమ్బమయి, శంబరమయి, మేఘపుష్పమయి, ఘనరసమయి, ఆప్యమయి, అమ్మయమయి, భంజ్ఞమయి, తరంగమయి, ఊర్మిమయి, వీచిమయి, ఉర్లోలమయి, కల్లోలమయి, ఆవర్తమయి, పృషన్తి మయి, బిందుమయి, పృషతామయి, చక్రాణిమయి, పుటభేదామయి, బ్రామామయి, జలనిర్గమామయి, కూలమయి, రోధమయి, తీరమయి, ప్రతీరమయి, తటమయి, పారావారమయి, అపారమయి, ప్రాతమయి, ద్వీపమయి, అంతరీపమయి, పులినమయి, సైకతమయి, సికతామయి, నిషద్వరమయి, జంబాలమయి, పంకమయి, శాదమయి, కర్ధమమయి, జలోచ్ఛ్వాసమయి, పరీవాహమయి *సప్తమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా !*


8.పంచభూతమయి, వరమయి, అభయమయి, వటుకభైరవమయి, యోగినీ మయి, క్షేత్రపాలమయి, గణపతిమయి *అష్టమావరణ రూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా !*


9.వజ్రసహిత ఇంద్రమయి, శక్తిసహిత అగ్నిమయి, దండ సహిత యమమయి, ఖడ్గసహిత నిరృతిమయి, పాశసహిత వరుణమయి, అంకుశ సహిత వాయుమయి, గదాసహిత సోమమయి, శూల సహిత ఈశానమయి, పద్మసహిత బ్రహ్మమయి, చక్ర సహిత అనంతమయి *నవమావరణరూపిణి శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా నమస్తే నమస్తే నమస్తే నమః*


🌹ఫలస్తుతి🌹


అద్భుతమైన ఖడ్గమాల స్తుతి , ఖడ్గమాల లో మొత్తం 25 దేవతా ఖడ్గమాల స్త్రోత్రలు ఉన్నాయి అందులో ప్రత్యంగిరా ఖడ్గమాల ఒకటి ఇది ఎంతో విశేష మైన ఉపాసన, దుష్టగ్రహ పీడల, చేతబడి ,నరదిష్టి , కోర్ట్ తగాదాలు, ఇటువంటి సమస్యలే కాకుండా ఇచ్చిన ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతున్న వారు ఆ ధనం తిరిగిరావాలి అని కోరుకొని ఈ ఖడ్గమాల పారాయనఁ సాయంత్రం సమయంలో పఠించాలి, ఈ ఖడ్గమాల తో అర్చన చేయాలి. మీకు శత్రువులు దూరంగా ఉంటారు , ప్రత్యంగిరా ప్రయోగాలు కూడా చేసే వారు ఉంటారు అటువంటి ప్రయోగం ఎవరైనా చేసి ఉన్నా ఈ ఖడ్గమాల రోజు చదివి అమ్మవారికి అర్చన చేస్తే మీ పైన ఎటువంటి ప్రయోగం ఫలించదు. ఎన్నో చికాకులు కుటుంబ కలహాలు ఉన్నా ఆ గోడవలు తగ్గుతుంది. ముఖ్యంగా పారాయణ చేసే వారికి మంచి ఆరోగ్యం చక్కబడుతుంది.

(ఏవిధమైన ధన నష్టం జరిగిఉన్న అటువంటి వారు ముందుగా కామలాత్మిక ఖడ్గమాల తో అమ్మవారికి అర్చన చేసి తర్వాత ప్రత్యంగిరా కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.) ప్రత్యంగిరా ఫోటో ఉన్నవారు ఫోటోకి ఎండు మిరపకాయలు మాల కట్టి దండగా వేయండి, అదే లక్ష్మీ ఫోటో కి అయితే పచ్చిమిరపకాయ మాల కట్టి శుక్రవారం రోజు వేయాలి ధన నష్టం తొలగిపోతుంది, బెల్లం పానకం నివేదన చేయాలి. ప్రత్యంగిరా ఫోటో లేకున్నా ఆ తల్లిని మనసులో నమస్కారం చేసి పారాయణ చేయవచ్చు. లేదా ఇక్కడ ఇచ్చిన ఫోటో ప్రింట్ తీసుకుని పెట్టుకోవచ్చు.


🌹శ్రీ మాత్రే నమః🌹

హ్రీంకార మహాయజ్ఞ లఘు పూజ

 🌷హ్రీంకార మహాయజ్ఞ లఘు పూజ🌷


శవశక్త్యాత్మకమైన 'హ్రీం' మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. హ్రీం అమ్మవారి యొక్క శక్తి బీజం, పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం. 

లలితా త్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది. 


మొదటిదైన వాగ్భవ ఖండములోని 5 బీజాలలో చివరి బీజం హ్రీం. రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం. అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి । 


త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశ దీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం. 


హ్రీంకార మహాయజ్ఞాన్ని ఎవరికి వారు, వారి వారి గృహాలలో లఘు పద్దతిలో పూజ చేసుకునేందుకు దిగువన ఉన్న వివరాలు ఇవ్వటమైనది. 


🌷పూజా పద్ధతి 🌷


ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల రోజులలో మధ్యాహ్నసమయం లోపలే పూర్తి చేసుకోవాలి. ఒకరి గురించి మరొకరు కూడా ఆచరించవచ్చును. సంకల్పం ముఖ్యము. పుణ్య స్త్రీలు, వైదవ్య స్త్రీలు, బాలలు, అవివాహితులు, వృద్దులు, పురుషులు (భార్యా వియోగులు కూడా) ఎవరైనను ఆచరించవచ్చును. పురుడు లేక మరణ అశౌచము వున్నవారు ఆచరించవద్దు. ఆరవ మాసం ప్రారంభమైన గర్భిణులు వద్దు. విదేశాలలో వున్న వారి కొరకు ఇక్కడ వారు ఆచరించవచ్చు. అన్ని మాసాలలో మాసాలలో ఎన్నిసార్లైననూ ఆచరించవచ్చు. 

గృహంలోని ఈశాన్య భాగంలో కానీ లేక ఏ ఇతర భాగంలో కానీ మీరు తూర్పు దిశగా చూసేలా పూజను చేసుకోండి. 


ఓ పీట వుంచి దానిపై బియ్యాన్ని పోసి, గుండ్రంగా లేక చదరంగా లేక దీర్ఘ చతురశ్రంగా నెరపండి. బియ్యంపైన త్రిభుజం, 16 బిందువులతో ఉన్న నలుచదర తెలుపు వస్త్రాన్ని పరవండి. 

దీపారాధన చేసుకోండి. పూజ పుష్పాలు మీకు నచ్చినవి. 

తిథి, వార, నక్షత్రాలతో పాటుగా గోత్ర నామాలతో సంకల్పం చెప్పుకొని పసుపుతో చేసిన గణపతిని తమలపాకులలో ఉంచి ప్రార్ధించండి. ఇక్కడే ప్రధానంగా గమనించాల్సింది. 

ఈ రోజైతే ఆచరిస్తారో ఆనాటి తిధిని గుర్తించండి. ఆ తిథి దేవత ఎవరో... సంఖ్య ఏమిటో గమనించి... ఆ సంఖ్య బిందువుపైనే గణపతిని ఉంచండి. 

తిధులు, దేవతల పేర్లు, సంఖ్య వివరాలు కూడా దిగువన ఇవ్వబడినవి. పూజ ప్రారంభించే సమయానికి ఏ తిది ఉంటే ఆ తిది ద్ ఆ దేవత పైనే పసుపు గణపతిని ఉంచాలి.


గణపతికి ధూప, దీపాలను ఇవ్వండి. నైవేద్యంగా బెల్లాన్ని నివేదించండి. అవకాశం ఉన్నవారు గణపతి పూజను పూర్తిగా ఆచరించవచ్చు.

గణపతి పూజ అనంతరం, గణపతికి ఉద్వాసన చెప్పి పూజ పీటకు ఈశాన్య భాగంలో ఉంచండి. 


.................................................. .


శుక్ల పాడ్యమి, అమావాస్య తిధులకు దేవత - కామేశ్వరి, సంఖ్య 1


శుక్ల విదియ, బ.చతుర్దశి తిధులకు దేవత - భాగమాలిని , సంఖ్య 2


శుక్ల తదియ, బ.త్రయోదశి తిధులకు దేవత - నిత్యక్లిన్నా, సంఖ్య 3


శుక్ల చవితి, బ.ద్వాదశి తిధులకు దేవత - భేరుండ, సంఖ్య 4


శుక్ల పంచమి, బ.ఏకాదశి తిధులకు దేవత - వహ్నివాసిని , సంఖ్య 5


శుక్ల షష్టి, బ.దశమి తిధులకు దేవత - మహావజ్రేశ్వరి , సంఖ్య 6


శుక్ల సప్తమి, బ.నవమి తిధులకు దేవత - శివదూతి, సంఖ్య 7


శుక్ల అష్టమి, బ.అష్టమి తిధులకు దేవత - త్వరిత, సంఖ్య 8


శుక్ల నవమి, బ.సప్తమి తిధులకు దేవత - కులసుందరి, సంఖ్య 9


శుక్ల దశమి, బ.షష్టి తిధులకు దేవత - నిత్య , సంఖ్య 10


శుక్ల ఏకాదశి, బ.పంచమి తిధులకు దేవత - నీలపతాక, సంఖ్య 11


శుక్ల ద్వాదశి , బ.చవితి తిధులకు దేవత - విజయ, సంఖ్య 12


శుక్ల త్రయోదశి , బ.తదియ తిధులకు దేవత - సర్వమంగళ , సంఖ్య 13


శుక్ల చతుర్దశి , బ.విదియ తిధులకు దేవత - జ్వాలామాలిని , సంఖ్య 14


పూర్ణిమ, బ.పాడ్యమి తిధులకు దేవత - విచిత్ర, సంఖ్య 15


గణపతి పూజ తదుపరి


◆ధ్యానం 


శ్లో. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీమ్ 


సౌవర్ణామ్భర ధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలాం 


వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం 


త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్రసంచారిణీమ్ 


🌷లమిత్యాది పంచపూజ🌷


లం పృధ్వీతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి సౌందర్య గంధం పరికల్పయామి 


(హ్రీం బీజాక్షరంపై గంధం ఉంచండి) 


హం ఆకాశతత్త్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి పుష్పం పరికల్పయామి 


(హ్రీం బీజాక్షరంపై పుష్పం ఉంచండి) 


యం వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి ఆశాజనక ధూపం పరికల్పయామి 


(హ్రీం బీజానికి ధూపాన్ని చూపండి)


రం వహ్నితత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి ప్రకాశం దీపం పరికల్పయామి 


(హ్రీం బీజానికి దీపాన్ని చూపండి)


వం అమృతతత్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి అమృతనైవేద్యం పరికల్పయామి 


(హ్రీం బీజానికి కొద్ది తేనెను నివేదించండి) 


సం సర్వతత్త్వాత్మికాయై శ్రీ లలితా త్రిపుర సుందరి తామ్బూలాది సర్వోపచారాన్ పరికల్పయామి 


(హ్రీం బీజానికి తాంబూల సమర్పణ)


ఆపై దిగువ చెప్పినట్లు వస్త్రానికి నలువైపులా ఉన్న సంఖ్యల వద్ద దిగువ నామాలను పఠిస్తూ కుంకుమ, నెయితో కలిపిన అక్షతలను ఉంచండి. 


1వ సంఖ్య వద్ద ఓం అనంగకుసుమాయై అంటూ అక్షతలను ఉంచండి 


2వ సంఖ్య వద్ద ఓం అనంగమేఖలాయై అంటూ అక్షతలను ఉంచండి 


3వ సంఖ్య వద్ద ఓం అనంగమదనాయై అంటూ అక్షతలను ఉంచండి


4వ సంఖ్య వద్ద ఓం అనంగమదనాతురాయై అక్షతలను ఉంచండి


5వ సంఖ్య వద్ద అనంగరేఖాయై ఓ అంటూ అక్షతలను ఉంచండి 


6వ సంఖ్య వద్ద ఓం అనంగవేగిన్యై అంటూ అక్షతలను ఉంచండి


7వ సంఖ్య వద్ద ఓం అనంగాంకుశాయై ఉంది అంటూ అక్షతలను ఉంచండి


8వ సంఖ్య వద్ద ఓం అనంగమాలిన్యై అంటూ అక్షతలను ఉంచండి


తదుపరి కలశాన్నిగంధ, కుంకుమలతో అలంకరించుకోండి. (రాగి, వెండి, స్టీలు ఏదైనా పరవాలేదు ) హ్రీం బీజంపై కలశాన్ని ఉంచండి. మంచి నీటిని కలశంలో పోయింది. 2 యాలకులను కలశములో వేయాలి. కలశంలో 5 మామిడాకులు లేక 5 తమలపాకులు ఉంచి, దానిపై కొబ్బరికాయ ఉంచాలి.


🌷ఇక షోడశోపచారాలతో పూజను ప్రారంభించాలి.


ఉపచార పూజలలోని అన్ని శ్లోకాలను చదవలేని వారు ఓం శ్రీమాత్రే అని భక్తితో ధ్యానించండి.


◆ధ్యానం


శ్లో. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్

అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్

(ఈ శ్లోకము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ధ్యాన శ్లోకాలలో రెండవది. ఓ పుష్పాన్ని తీసుకొని పై శ్లోకం చదువుతూ భక్తితో... పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )


◆ఆవాహనం

(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 169 వ శ్లోకం

సవ్యాపసవ్య మార్గస్థా, సర్వాపద్వి నివారిణీ ।

స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా

 భక్తితో చదువుతూ .... 

ఆవాహనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )


◆సింహాసనం

(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా ।

సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా


సింహాసనం సమర్పయామి... అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )


◆పాద్యం

(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

171 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

దక్షిణా, దక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా ।

కౌళినీ కేవలా,ఽనర్ఘ్యా కైవల్య పదదాయినీ


పాద్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )


◆అర్ఘ్యం

(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

172 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా ।

మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః ౹౹


అర్ఘ్యం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )


◆ఆచమనం

(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

173 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

విశ్వమాతా, జగద్ధాత్రీ, విశాలాక్షీ, విరాగిణీ।

ప్రగల్భా, పరమోదారా, పరామోదా, మనోమయీ


ఆచమనం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి. )


◆శుద్ధోదక స్నానం 

(ఉద్దరిణతో లేక తమలపాకుతో నీరు తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 

174 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

వ్యోమకేశీ, విమానస్థా, వజ్రిణీ, వామకేశ్వరీ ।

పంచయజ్ఞప్రియా, పంచప్రేత మంచాధిశాయినీ ॥ 


శుద్ధోదక స్నానం సమర్పయామి... అని చెప్పి నీటిని కలశం మీద ఉన్న కొబ్బరికాయపై వేయండి.)


◆వస్త్రం

(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 175 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

పంచమీ, పంచభూతేశీ, పంచ సంఖ్యోపచారిణీ ।

శాశ్వతీ, శాశ్వతైశ్వర్యా, శర్మదా, శంభుమోహినీ


వస్త్రం సమర్పయామి, వస్త్రార్ధం పుష్పం సమర్పయామి ... 

అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )


◆ఆభరణం

(ఓ పుష్పాన్ని తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 176 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

ధరా, ధరసుతా, ధన్యా, ధర్మిణీ, ధర్మవర్ధినీ ।

లోకాతీతా, గుణాతీతా, సర్వాతీతా, శమాత్మికా


ఆభరణం సమర్పయామి, ఆభరణార్ధం పుష్పం సమర్పయామి ... 

అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. )


◆శ్రీ గంధం లేక కుంకుమ 

(శ్రీ గంధం లేక కుంకుమ తీసుకొని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 

177 వ శ్లోకం భక్తితో చదువుతూ .... 

బంధూక కుసుమ ప్రఖ్యా, బాలా, లీలావినోదినీ ।

సుమంగళీ, సుఖకరీ, సువేషాడ్యా, సువాసినీ


శ్రీ గంధం / కుంకుమ విలేపనం సమర్పయామి... అని చెప్పి గంధాన్ని లేక కుంకుమను కలశం మీదున్న కొబ్బరి కాయపై ఉంచండి. )


🌷అక్షంతల తో ఇప్పుడు ఇలా శ్రీదేవి ఖడ్గమాలలోని 181 నామాలను పఠిస్తూ అక్షతలను కొబ్బరికాయపై ఉంచండి.

దేవి ఖడ్గమాల లోప్రతి నామానికి ముందు ఓం హ్రీం అని జోడించండి. 


★ఉదాహరణ 1వ నామం - ఓం హ్రీం త్రిపురసుందర్యై...

.

.

ఖడ్గమాల నామాలు పూర్తి ఐయ్యాక నమస్తే నమస్తే నమస్తే అంటూ అక్షతలు వేయండి. 


లలితా త్రిశతిలోని అరవై హ్రీంకార నామాలలో దిగువన ఉన్న 54 నామాలను అనులోమ విలోమ పద్దతిలో (పైనుంచి దిగువకు, దిగువ నుంచి పైకి) జపిస్తూ అక్షతలను భక్తితో కొబ్బరికాయపై ఉంచండి. 


1. ఓం హ్రీంకారరూపాయై 


2. ఓం హ్రీంకారనిలయాయై 


3. ఓం హ్రీంప్రదప్రియాయై 


4. ఓం హ్రీంకారబీజాయై 


5. ఓం హ్రీంకారమన్త్రాయై 


6. ఓం హ్రీంకారలక్షణాయై 


7. ఓం హ్రీంజపసుప్రీతాయై 


8. ఓం హ్రీంమ్మత్యై 


9. ఓం హ్రీంవిభూషణాయై 


10. ఓం హ్రీంశీలాయై 


11. ఓం హ్రీంపదారాధ్యాయై 


12 . ఓం హ్రీంగర్భాయై 


13 . ఓం హ్రీంపదాభిదాయై 


14 . ఓం హ్రీంకారవాచ్యాయై 


15 . ఓం హ్రీంకారపూజ్యాయై 


16 . ఓం హ్రీంకారపీఠికాయై 


17 . ఓం హ్రీంకారవేద్యాయై 


18 . ఓం హ్రీంశిఖామణయే 


19 . ఓం హ్రీంకారకుణ్డగ్నిశిఖాయై 


20 . ఓం హ్రీంకారశశిచన్ద్రికాయై 


21 ఓం హ్రీంకారభాస్కరరుచ్యై 


22 . ఓం హ్రీంకారాంభోదచంచలాయై 


23 ఓం హ్రీంకారకన్దాంకురికాయై 


24 ఓం హ్రీంకారైకపరాయణాయై 


25 . ఓం హ్రీంకారదీర్ఘికాహంస్త్యే 


26 . ఓం హ్రీంకారోద్యానకేకిన్యై


27 . ఓం హ్రీంకారారణ్యహరిణ్యై 


28 . ఓం హ్రీంకారావాలవల్లర్యై 


29 . ఓం హ్రీంకారపంజరశుక్త్యై 


30 . ఓం హ్రీంకారాగణదీపికాయై 


31 ఓం హ్రీంకారకన్దరాసింహ్యై 


32 . ఓం హ్రీంకారాంబుజభృంగికాయై 


33 ఓం హ్రీంకారసుమనోమాధ్వ్యై 


34 . ఓం హ్రీంకారతరుమంజర్యై 


35 . ఓం హ్రీంకారమూర్తయే 


36 . ఓం హ్రీంకారశౌధశృంగకపోతికాయై 


37 . ఓం హ్రీంకారదుగ్ధాభద్ధిసుధాయై  


38 . ఓం హ్రీంకారకమలేన్దిరాయై 


39 . ఓం హ్రీంకారమణిదీపార్చిషే 


40 ఓం హ్రీంకారతరుశారికాయై 


41 . ఓం హ్రీంకారపేటకమణయే 


42 ఓం హ్రీంకారాదర్శబిమ్బికాయై 


43 . ఓం హ్రీంకారకోశాశిలతాయై 


44 ఓం హ్రీంకారాస్థాననర్తక్త్యే 


45 . ఓం హ్రీంకారశుక్తికాముక్తామణయే 


46 . ఓం హ్రీంకారబోధితాయై 


47 . ఓం హ్రీంకార మయసౌవర్ణస్తంభ విద్రుమ పుత్రికాయై


48 . ఓం హ్రీంకారవేదోపనిషదే


49 . ఓం హ్రీంకారాధ్వరదక్షిణాయై 


50 ఓం హ్రీంకారనన్దనారామనవ కల్పకవల్లర్యై 


51 ఓం హ్రీంకార హిమవద్గంగాయై 


52 ఓం హ్రీంకారార్ణవకౌస్తుభాయై 


53 ఓం హ్రీంకారమన్త్రసర్వస్వాయై 


54 ఓం హ్రీంకారపరసౌఖ్యదాయై 


తదుపరి పై 54 నామాలను కింది నుంచి పైకి మరో మారు జపించండి.


తదుపరి మీకిష్టమైన 21 పుష్పాలతో దేవి సప్తశతి దిగువన తెల్పిన శ్లోకాలలో ఒక్కొక్క శ్లోకాన్నిభక్తితో పఠిస్తూ ఒక్కో పుష్పాన్ని విశ్వాసంతో కొబ్బరికాయపై ఉంచండి. )


1. ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా 


నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


2. ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే


నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


3. ఓం యా దేవీ సర్ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా


నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


4. ఓం యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


5. ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


6. ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


7. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


8. ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


9. ఓం యా దేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


10. ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


11. ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


12. ఓం యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


13. ఓం యా దేవీ సర్వభూతే శ్రద్దారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


14. ఓం యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


15. ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


16. ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


17. ఓం యా దేవీ సర్వభూతే స్మృతిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


18. ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


19. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


20. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితానమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో దృష్టి


21. ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


◆ధూపం 

( శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 178 వ శ్లోకం భక్తితో చదువుతూ ....

సువాసిన్యర్చనప్రీతా, శోభనా, శుద్ధ మానసా ।

బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా


ధూపమాఘ్రాపయామి... అని చెప్పి అగరుబత్తీలను చూపండి. ) 


◆దీపం

(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 179 వ శ్లోకం భక్తితో చదువుతూ ....

దశముద్రా సమారాధ్యా, త్రిపురా శ్రీవశంకరీ ।

జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ॥

దశముద్రలు తెలిస్తే చేయండి లేదంటే నమస్కారం చేసుకోండి


దీపం దర్శయామి, దూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి ... అని చెప్పి తమలపాకుతో నీటిని చల్లండి ) 


◆నైవేద్యం

(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 180 వ శ్లోకం భక్తితో చదువుతూ ....

యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా ।

అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ

(యోని ముద్ర, త్రికండ ,దేను ముద్రలు తెలిస్తే ముద్ర వేసి అమ్మవారికి నమస్కారం చేయండి రాకుంటే మంత్రంతో నమస్కారం చేసుకోండి)


నైవేద్యం సమర్పయామి... అని చెప్పి మీరు చేసిన ఏదేని తీపి నైవేద్యాన్ని ఇతర ఫలాలు గాని, కొబ్బరికాయ మొదలైన వాటిని నివేదించండి. )


 ◆తాంబూలం

(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 181 వ శ్లోకం భక్తితో చదువుతూ ....

అభ్యాసాతి శయజ్ఞాతా, షడధ్వాతీత రూపిణీ ।

అవ్యాజ కరుణామూర్తి, రజ్ఞానధ్వాంత దీపికా


తాంబూలం సమర్పయామి... అని చెప్పి తాంబూలాన్ని కలశం ముందు ఉంచండి. ) 


◆నీరాజనం

(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 182 వ శ్లోకం భక్తితో చదువుతూ ....

ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా ।

శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ


దివ్య మంగళ నీరాజనం సమర్పయామి... అని చెప్పి కర్పూర హారతిని ఇవ్వండి. ) 


◆మంత్రపుష్పం

(శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 183 వ శ్లోకంలోని మొదటి లైన్ చూడండి.

" ఓం శ్రీ శివా శివశక్త్యైకరూపిణీ లలితాంబికా " అనే పంక్తిని భక్తితో చదువుతూ .... 

పుష్పాన్ని తీసుకొని దివ్య మంత్ర పుష్పం సమర్పయామి... 

అని చెప్పి పుష్పాన్ని కలశం ముందు ఉంచండి. ) 


👉చివరగా సకల సమస్యల నుంచి గట్టెక్కుతూ ఈ జీవన గమనం సాఫీగా సాగిపోవాలని మనసార భక్తి, విశ్వాసం, నిర్మలత్వంతో ఆత్మప్రదక్షిణ చేయండి. చిన్నపాటి తప్పులేమైనా ఉంటే క్షమించమని తల్లిని వేడుకోండి. పూజ కార్యక్రమం పూర్తైన తదుపరి తీర్థం, ప్రసాదాలు స్వీకరించండి. పూజ పూర్తి అయిన తర్వాత కలశాన్ని ఉద్వాసన చెప్పే విధంగా కుడి చేతితో స్వల్పంగా కదపండి. రెండవ రోజున కలశంపైనున్న కొబ్బరికాయను కొట్టి ప్రసాదంగా స్వీకరించండి. హ్రీం వస్త్రాన్ని తదుపరి పూజ కోసం భద్రపరచండి. వస్త్రం కింద ఉన్న బియ్యాన్ని మీ ఆహార అవసరాలకై వినియోగించండి.


🌷🙏శ్రీ మాత్రే నమః🙏🌷


👇ఇక్కడ చిత్రంలో చూపించిన విధంగా యంత్రం గీసుకోవాలి

పీటపై బియ్యం పరిచి పూజ చేసే వ్యక్తి వైపు చదరపు వస్త్ర దిగువ కోణం ఉండేలా వస్త్రాన్ని పరవాలి. ఆ వస్త్రంలో హ్రీం బీజంతో ముందుగా తిది నిత్య దేవతలు సంఖ్యల తో ఇలా తెల్లటి వస్త్రం పైన ఏర్పాటు చేసుకోవాలి...

Wednesday, December 28, 2022

 సులభంగా *వేదము* నేర్చుకోవడానికి *క్లాసులు* 

 *SVBP* YOUTUBE CLANNEL ను *SUBSCRIBE* చేసుకోండి


 *లఘున్యాసం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_yY1csalo1dOADBqsMyBHRu5


 *శ్రీ రుద్ర నమకం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l


 *పురుష సూక్తం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_ya_xxoT_l26zKV_dotwDGk5


 *శ్రీ సూక్తం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_yZ7RdoqSZ6cXFMdfpG7LeFN


 *దుర్గా సూక్తం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_yZq51fc9nx_jdbZe5cB9SqB


 *మంత్ర పుష్పం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_ybpNZS3JpDMafWnUbxdHFpK


 *తైత్తరీయోపనిషత్తు క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_ybMV-81hbeoQyT3qRXeO2DR


 *మన్యు సూక్తం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_ybjPhbz82CHNPMrLdPX9OpJ


 *మేధా సూక్తం క్లాసులు* 

https://youtube.com/playlist?list=PLruvV_xMo_yblyjYVSX4KDDd9yIvUpGuA


 *శ్రీ వేద భారతీ పీఠ వేదవియలయము* బాసర

అందరికి ప్రత్యక్షంగాను

 ( Online- Zoom&Youtube )

https://vedabharathipeetham.org/videos-classes

పరోక్షంగాను వేదమును అందింస్తున్న

 శ్రీ వేదభారతీ పీఠమునకు భక్తులు సహకరించగలరని ప్రార్థిస్తున్నాము.

Website: https://vedabharathipeetham.org

YouTube: https://www.youtube.com/channel/UC0DGuGaKJ1qk3fzpOaO6fUw?sub_confirmation=1

Tuesday, December 27, 2022

శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆనులోమ, వినులోమ, ప్రతిలోమ

 🌷🙏శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆనులోమ, వినులోమ, ప్రతిలోమ🙏🌷

ఓం హ్రీం ఐం శ్రీంనమోభగవతి ఉచ్చిష్టచండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః

🙏🌹అనులోమ పద్ధతి 🌹🙏

👉ప్రతి నామానికి ముందు ఓం 

ఓం రతిమాతంగ్యై నమః

ఓం ప్రీతిమాతంగ్యై నమః

ఓం మనోభవామాతంగ్యై నమః 

ఓం ప్రథమావరణ రూపిణి సర్వానందమయిచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం హృదయదేవ్యై నమః

ఓం శిరోదేవ్యై నమః

ఓం శిఖాదేవ్యై నమః

ఓం కవచదేవ్యై నమః

ఓం నేత్రదేవ్యై నమః

ఓం అస్త్రదేవ్యై నమః

 ఓం ద్వితీయావరణ రూపిణి సర్వసిద్ధిప్రద

చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః


 ఓం బ్రాహ్మిమాతంగ్యై నమః

ఓం మాహేశ్వరీమాతంగ్యై నమః

ఓం కౌమారీమాతంగ్యై నమః 

ఓం వైష్ణవీమాతంగ్యై నమః

ఓం వారాహీ మాతంగ్యై నమః

ఓం ఇంద్రాణీ మాతంగ్యై నమః

ఓం చాముండామాతంగ్యై నమః

 ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః

ఓం తృతీయావరణరూపిణి సర్వరోగ -హరచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః


ఓం అసితాంగభైరవమయై నమః

ఓం రురుభైరవమయై నమః 

ఓం చండభైరవమయై నమః

ఓం క్రోధభైవరమయై నమః

ఓం ఉన్మత్తభైరవమయై నమః

ఓం కపాలభైరవమయై నమః

ఓం భీషణభైరవమయై నమః

ఓం సంహారభైరవమయై నమః

ఓం చతుర్ధావరణరూపిణి సర్వరక్షాకర -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం వామాయై నమః

ఓం జ్యేష్టాయై నమః

ఓం రౌద్యై నమః

ఓం శాంత్యై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం మాహేశ్వర్యై నమః

ఓం క్రియాయై నమః 

ఓం లక్ష్మ్యై నమః

ఓం సృస్ట్యై నమః 

ఓం మోహిన్యై నమః

ఓం ప్రమథాయై నమః

ఓం శ్వాసిన్యై నమః 

ఓం విద్యుల్లతాయై నమః

ఓం సుందర్యై నమః 

ఓం నందాయై నమః

ఓం నందబుద్ద్యై నమః

ఓం పంచమావరణరూపిణి సర్వార్థసాధక -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం మాతంగ్యై నమః 

ఓం మహామాతంగ్యై నమః

ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః

ఓం సిద్దమాతంగ్యై నమః

ఓం విఘ్నేశమాతంగ్యై నమః

ఓం దుర్గామాతంగ్యై నమః

ఓం వటుకమాతంగ్యై నమః

ఓం క్షేత్రపాలమాతంగ్యై నమః

ఓం షష్టావరణరూపిణి సర్వసౌభాగ్య

-దాయకచక్రస్వామిని మాతంగేశ్వర్యైనమః


ఓం ఇంద్రమయ మాతంగ్యై నమః

 ఓం అగ్నిమయ మాతంగ్యై నమః

ఓం యమమయ మాతంగ్యై నమః

ఓం నిరృతిమయ మాతంగ్యై నమః

ఓం వరుమాయ మాతంగ్యై నమః |

ఓం వాయుమయ మాతంగ్యై నమః

ఓం కుబేరమయ మాతంగ్యై నమః 

ఓం ఈశామయ మాతంగ్యై నమః

 ఓం బ్రహ్మమయ మాతంగ్యై నమః 

ఓం అనంతమయ మాతంగ్యై నమః

ఓం సప్తమావరణ రూపిణీ సర్వసంక్షోభణ

-చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః


ఓం వజ్రమయి మాతంగ్యై నమః 

ఓం శక్తిమయి మాతంగ్యై నమః

ఓం దండమయి మాతంగ్యై నమః

ఓం ఖడ్గమయి మాతాంగ్యై నమః

ఓం పాశమయి మాతంగ్యై నమః

ఓం అంకుశమయి మాతంగ్యై నమః

ఓం గదామయి మాతంగ్యై నమః

ఓం త్రిశూలమయి మాతంగ్యై నమః

ఓం పద్మమయి మాతంగ్యై నమః

ఓం చక్రమయి మాతంగ్యై నమః

ఓం అష్టమావరణరూపిణి సర్వాశా -పరిపూరకచక్రస్వామిని మాతంగేశ్వర్యైనమః

ఓం మత్తమాతంగ్యై నమః

ఓం సుముఖ్యై నమః

ఓం ఉచ్చిష్టచాండాలిన్యై నమః

ఓం కాళీరూపిణ్యై నమః

ఓం తారారూపిణ్యై నమః

ఓం షోడశీరూపిణ్యై నమః

ఓం భువనేశ్వరీరూపిణ్యై నమః 

ఓం భైరవీరూపిణ్యై నమః

ఓం ఛిన్నమస్తారూపిణ్యై నమః

ఓం ధూమావతీరూపిణ్యై నమః

ఓం బగళారూపిణ్యై నమః 

ఓం కమలాత్మికారూపిణ్యై నమః

ఓం వటుకమయై నమః

ఓం యోగినీమయై నమః

ఓం క్షేత్రపాలమయై నమః

ఓం గణపతిమయై నమః

ఓం అష్టవసుమయై నమః

ఓం ద్వాదశాదిత్యమయై నమః

ఓం ఏకాదశరుద్రమయై నమః 

ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిని నమస్తే

- శ్రీమాతంగేశ్వరి సర్వజనవశంకర్యైనమోనమః


🙏🌹వినులోమ పద్ధతి 🌹🙏

ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిని నమస్తే శ్రీమాతంగేశ్వరి సర్వజనవశంకర్యై నమో నమః

ఓం ఏకాదశరుద్రమయై నమః 

ఓం ద్వాదశాదిత్యమయై నమః

ఓం అష్టవసుమయై నమః

ఓం గణపతిమయై నమః 

ఓం క్షేత్రపాలమయై నమః

ఓం యోగినీమయై నమః 

ఓం వటుమయై నమః

ఓం కమలాత్మికారూపిణ్యై నమః 

ఓం బగళారూపిణ్యై నమః

ఓం ధూమావతీరూపిణ్యైనమః 

ఓం ఛిన్నమస్తారూపిణ్యై నమః

ఓం భైరవీరూపిణ్యై నమః 

ఓం భువనేశ్వరీరూపిణ్యై నమః

ఓం షోడశీరూపిణ్యై నమః

ఓం తారారూపిణ్యై నమః

 ఓం కాళీరూపిణ్యై నమః

ఓం ఉచ్చిష్ఠచాండాలిన్యై నమః

ఓం సుముఖ్యై నమః

ఓం మత్తమాతంగ్యై నమః

 ఓం అష్టమావరణరూపిణి సర్వాశాపరి

|-పూరకచక్రస్వామినిమాతంగేశ్వర్యై నమః

ఓం చక్రమయిమాతంగ్యై నమః 

ఓం పద్మమయిమాతంగ్యై నమః

ఓం త్రిశూలమయి మాతంగ్యై నమః

ఓం గదామయి మాతంగ్యై నమః

ఓం అంకుశయిమాతంగ్యై నమః

ఓం పాశమయిమాతంగ్యై నమః

ఓం ఖడ్గమయి మాతంగ్యై నమః 

ఓం దండమయి మాతంగ్యై నమః

ఓం శక్తిమయి మాతంగ్యై నమః 

ఓం వజ్రమయి మాతంగ్యై నమః

ఓం సప్తమావరణ రూపిణి సర్వసంక్షోభణ

-చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం అనంతమయిమాతంగ్యై నమః

ఓం బ్రహ్మమయి మాతంగ్యై నమః

ఓం ఈశానమయి మాతంగ్యై నమః 

ఓం కుబేరమయి మాతంగ్యై నమః

ఓం వాయుమయి మాతంగ్యై నమః 

ఓం వరుణమయి మాతంగ్యై నమః

ఓం నిరృతమయి మాతంగ్యై నమః

ఓం యమమయి మాతంగ్యై నమః

 ఓం అగ్నిమయి మాతంగ్యై నమః 

ఓం ఇంద్రమయి మాతంగ్యై నమః 

ఓం షష్టావరణరూపిణి సర్వసౌభాగ్య

-దాయకచక్రస్వామిని మాతంగేశ్వర్యైనమః 

ఓం క్షేత్రపాలమాతంగ్యై నమః

ఓం వటుకమాతంగ్యై నమః

ఓం దుర్గామాతంగ్యై నమః

ఓం విఘ్నేశమాతంగ్యై నమః 

ఓం సిద్ధమాతంగ్యై నమః

ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః 

ఓం మహామాతంగ్యై నమః

ఓం మాతంగ్యై నమః

ఓం పంచమావరణరూపిణి సర్వార్థ సాథకచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం నందబుద్ద్యై నమః ఓం నందాయై నమః

ఓం సుందర్యై నమః

ఓం విద్యుల్లతాయై నమః

ఓం శ్వాసిన్యై నమః

ఓం ప్రమథాయై నమః

ఓం మోహిన్యై నమః 

ఓం సృస్ట్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం క్రియాయై నమః

ఓం మాహేశ్వర్యై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం శాంత్యై నమః 

ఓం రౌద్యై నమః

ఓం జ్యేష్టాయై నమః

ఓం వామాయై నమః

ఓం చతుర్థావరణరూపిణి సర్వరక్షాకర |-చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

|ఓం సంహారభైరవమయై నమః

ఓం భీషణభైరవమయై నమః 

ఓం కపాలభైరవమయై నమః

ఓం ఉన్మత్తభైరవమయై నమః

ఓం క్రోధభైరవమయై నమః

 ఓం చండభైరవమయై నమః

ఓం రురుభైరవమయై నమః

ఓం అసితాంగభైరవమయై నమః ఓం తృతీయావరణరూపిణి సర్వరోగహర

-చక్రస్వామని మాతంగేశ్వర్యై నమః


ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః

ఓం చాముండా మాతంగ్యై నమః

ఓం ఇంద్రాణీమాతంగ్యై నమః 

ఓం వారాహీమాతంగ్యై నమః

ఓం వైష్ణవీమాతంగ్యై నమః

ఓం కౌమారీమాతంగ్యై నమః -మః 

ఓం మహేశ్వరీమాతంగ్యై నమః

ఓం బ్రాహ్మీమాతంగ్యై నమః 

ఓం ద్వితీయావరణ రూపిణి సర్వసిద్ధి

-ప్రదచక్రస్వామిని మాతంగీశ్వర్యై నమః

ఓం అస్త్రదేవ్యై నమః 

ఓం నేత్రదేవ్యై నమః

ఓం కవచదేవ్యై నమః 

ఓం శిఖాదేవ్యై నమః

ఓం హృదయదేవ్యై నమః

ఓం ప్రథమావరణరూపిణి

-సర్వానందమయ చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం మనోభవా మాతంగ్యై నమః

ఓం ప్రీతిమాతంగ్యైనమః

ఓం రతిమాతంగ్యై నమః 

ఓం హ్రీంఐంశ్రీం నమోభగవతిఉచ్ఛిష్ట

-చాండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః

🙏🌹ప్రతిలోమ పద్ధతి 🌹🙏

ఓం త్రైలోక్యమోహన చక్రస్వామిని

-నమస్తే శ్రీమాతంగేశ్వరి

-సర్వజనవశంకర్యైనమో నమః 

ఓం హ్రీం ఐం శ్రీం నమోభగవతిఉచ్ఛిష్ట -చాండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః

ఓం ఏకాదశరుద్రమయై నమః

ఓం రతిమాతంగ్యై నమః

ఓం శ్యామయై నమః 

ఓం ప్రీతిమాతంగ్యై నమః

ఓం అష్టవసుమయై నమః 

ఓం మనోభవామాతంగ్యై నమః

ఓం గణపతిమయై నమః

ఓం ప్రథమావరణరూపిణి సర్వానంద -మయచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం క్షేత్రపాలమయై నమః

ఓం హృదయదేవ్యై నమః 

ఓం యోగినీమయై నమః

ఓం శిరోదేవ్యై నమః

ఓం వటుకమయై నమః 

ఓం శిఖాదేవ్యై నమః

ఓం కమలాత్మికారూపిణ్యై నమః

ఓం కవచదేవ్యై నమః

ఓం బగళారూపిణ్యై నమః

ఓం నేత్రదేవ్యై నమః

ఓం ధూమావతీరూపిణ్యై నమః

 ఓం దేవ్యై నమః

ఓం ఛిన్నమస్తారూపిణ్యై నమః 

ఓం ద్వితీయావరణరూపిణీసర్వసిద్ధి

చక్రస్వామినిమాతంగేశ్వరైనమః

ఓం భైరవీరూపిణ్యై నమః 

ఓం బ్రాహ్మీమాతంగ్యై నమః

ఓం భువనేశ్వరీరూపిణ్యై నమః

ఓం మాహేశ్వరీమాతంగ్యై నమః

ఓం షోడశీరూపిణ్యై నమః

ఓం కౌమారీమాతంగ్యై నమః 

ఓం తారారూపిణ్యై నమః

ఓం వైష్ణవీమాతంగ్యై నమః

ఓం కాళీరూపిణ్యై నమః 

ఓం వారాహీమాతంగ్యై నమః

ఓం ఉచ్చిష్ఠచాండాలిన్యై నమః

ఓం ఇంద్రాణీమాతంగ్యై నమః 

ఓం చాముండామాతంగ్యై నమః

ఓం మత్తమాతంగ్యై నమః

ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః 

ఓం అష్టమావరణరూపిణి సర్వాశాపరి

పూరకచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం తృతీయావరణరూపిణి సర్వరోగహర -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం చక్రమయి మాతంగ్యై నమః

ఓం అసితాంగభైరవమయై నమః

ఓం పద్మమయి మాతంగ్యై నమః

ఓం రురుభైరవమయై నమః

ఓం త్రిశూలమయి మాతంగ్యై నమః

ఓం చండభైరవమయై నమః 

ఓం గదామయి మాతంగ్యై నమః

ఓం క్రోధభైరవమయై నమః

ఓం అంకుశమయి మాతంగ్యై నమః

 ఓం ఉన్మతభైరవమయై నమః

ఓం పాశమయిమాతంగ్యై నమః

ఓం కపాలభైరవమయై నమః

ఓం ఖడ్గమయిమాతంగ్యై నమః 

ఓం భీషణభైరవమయై నమః

ఓం దండమయిమాతంగ్యై నమః 

ఓం సంహారభైరవమయై నమః

ఓం శక్తిమయి మాతంగ్యై నమః

ఓం చతుర్ధావరణరూపిణి సర్వరక్షాకర -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం వజ్రమయి మాతంగ్యై నమః 

ఓం వామాయై నమః

ఓం సప్తమావరణరూపిణి సర్వసంక్షోభణ -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః


ఓం జ్యేష్ఠాయై నమః

ఓం అనంతమయి మాతంగ్యై నమః

ఓం రౌద్యై నమః

ఓం బ్రహ్మమయిమాతంగ్యై నమః

ఓం ఈశానమయిమాతంగ్యై నమః 

ఓం శాంత్యై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం కుబేరమయిమాతంగ్యై నమః

ఓం మాహేశ్వర్యై నమః

ఓం వాయుమయిమాతంగ్యై నమః

ఓం క్రియాయై నమః 

ఓం వరుణమయిమాతంగ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః 

ఓం నిరృతిమయిమాతంగ్యై నమః

ఓం సృస్ట్యై నమః

ఓం యమేమయి మాతంగ్యై నమః 

ఓం మోహిన్యై నమః

ఓం అగ్నిమయిమాతంగ్యై నమః

ఓం ప్రమథాయై నమః

ఓం ఇంద్రమయి మాతంగ్యై నమః

ఓం శ్వాసిన్యై నమః

ఓం షష్టావరణరూపిణి సర్వసౌభాగ్య దాయక చక్రస్వామినిమాతంగేశ్వర్యైనమః

ఓం విద్యుల్లతాయై నమః

ఓం క్షేత్రపాలమాతంగ్యై నమః

ఓం సుందర్యై నమః

ఓం వటుకమాతంగ్యై నమః

ఓం నందాయై నమః

ఓం దుర్గామాతంగ్యై నమః

ఓం నందబుద్ద్యై నమః 

ఓం విఘ్నేశమాతంగ్యై నమః

ఓం పంచమావరణ రూపిణి

సర్వార్థసాధకచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః

ఓం సిద్ధమాతంగ్యై నమః

ఓం మాతంగ్యై నమః

ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః 

ఓం మహామాతంగ్యై నమః

ఓం హ్రీం ఐం శ్రీం నమోభగవతి

ఉచ్ఛిష్ఠచాండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః

🌹శ్రీ మాత్రే నమః🌹

👉 ఖడ్గమాల ఈ విధానం ఆనులోమ వినులోమ ప్రతిలోమ పద్దతిలో చేయడం ఒక అద్భుతమైన సాధన..ఇది అందరూ పారాయణ చేయవచ్చు..ఉద్యోగం, వ్యాపారం, కీర్తి, ఉన్నత స్థానంలో ఉంచుతుంది మాతంగి.. ఏదైనా ప్రయత్నం చేస్తున్నవారికి మంచి పేరు తెచ్చే అవకాశం వస్తుంది అంటే మీ సామర్ధ్యం నిరూపించుకునే అవకాశం వస్తుంది..ఈ రాజశ్యామల రాజయోగాన్ని ఇచ్చే తల్లి..శ్రద్ధగా సాధన చేసుకోండి.

Monday, December 26, 2022

శ్రీ చక్ర విజ్ఞానం(3)

 🌹శ్రీ చక్ర విజ్ఞానం🌹 (6 వ భాగం)

🌹5-ఐదవ ఆవరణ - బహిర్దశారం🌹

ఈ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారంలో ఉంటుంది: 

ఈ ఆవరణలో పది 'శక్తులు' పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటారు. స్ఫటిక మణి కాంతి కలిగిన శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా పరశువు, పాశము, గద, ఘంటామణి ధరించి ఉంటారు. ఈ పదిమంది శక్తుల పేర్లు ఇవి; 

1. సర్వ సిద్ధిప్రద

2. సర్వ సంపత్ప్రద

3. సర్వ ప్రియంకరీ

4. సర్వ మంగళకారిణీ

5. సర్వ కామప్రద

6. సర్వ దుఃఖవిమోచినీ

7. సర్వ మృత్యుప్రశమనీ

8. సర్వ విఘ్ననివారిణీ

9. సర్వాంగ సుందరీ

10.సర్వ సౌభాగ్యదాయినీ

సాధకుడు ఈ ఆవరణలో ఈ శక్తులను ప్రాప్తించుకుని, సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹


🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 (8 వ భాగం)

🌹7-సప్తమావరణం - వసుకోణం🌹

శ్రీ చక్రం లో ఏడవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 8 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. 

ఈ ఆవరణలో ఎనిమిదిమంది 'వాగ్దేవతలు' ఉంటారు. వీరు రక్తాశోక కాంతి గల శరీర కాంతిలో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో బాణం, విల్లు, వీణ, పుస్తకం ధరించి ఉంటారు. వీరి పేర్లు;

1. వశినీ 

2. కామేశ్వరీ

3. మోదినీ

4. విమలా

5. అరుణా

6. జయినీ

7. సర్వేశ్వరీ

8. కౌళినీ

వాగ్దేవతల అనుగ్రహాన్ని సాధించి సాధకుడు ముందుకు వెళతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 (9 వ భాగం)

🌹8-ఎనిమిదవ ఆవరణ : త్రికోణం🌹

శ్రీ చక్రం లో ఎనిమిదవ ఆవరణ మూడు కోణాలు కలిగిన త్రిభుజాకారం లో ఉంటుంది. 

ఈ ఆవరణలో ముగ్గురు 'అతి రహస్య శక్తులు' పటం లో చూపించిన వరుస క్రమంలో ఉంటారు. వీరికి ఒకొక్కరికీ ఎనిమిది చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా, బాణం, చాపం, పాన పాత్ర, మాతులుంగ , ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి వుంటారు. వీరి పేర్లు;

❇️కామేశ్వరీ 

⚜️భగమాలినీ

🔯వజ్రేశ్వరీ

సాధకుని తరువాత గమ్యం బిందు మండలం . (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹శ్రీచక్ర విజ్ఞానం🌹 10 వ భాగం

🌹9-నవమ ఆవరణం - బిందు మండలం🌹

ఇది శ్రీ చక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో పదహారు నిత్యా దేవతలు ఉంటారు. వీరందరూ లలితాదేవి తో సమానమైన తేజస్సు, పరాక్రమం తో ఉంటారు. వీళ్ళందరూ కాల రూపులు, విశ్వమంతా వ్యాపించి వుంటారు.  

🔱నిత్యాదేవతల పేర్లు..🔱

1. కామేశ్వరీ

2. భగమాలినీ

3. నిత్యక్లిన్నా

4. భేరుండా

5. వహ్నివాసినీ

6. మహావజ్రేశ్వరీ

7. శివదూతీ

8. త్వరితా

9. కులసుందరీ

10. నిత్యా

11. నీలపతాకా 

12. విజయా

13. సర్వమంగాళా

14. జ్వాలామాలినీ

15. చిత్రా

16. మహా నిత్యా

బిందు మండలం చేరిన సాధకుడు అమ్మవారి సన్నిధి చేరినట్లే..

🌹శ్రీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభమస్తు🌹

🌹శ్రీ మాత్రే నమః🌹

శ్రీచక్ర విజ్ఞానం (2)

 🌹శ్రీ చక్ర విజ్ఞానం🌹(4 వ భాగం)

🌹3.తృతీయ ఆవరణం - అష్ట దళ పద్మం🌹

శ్రీ చక్రంలోని మూడవ ఆవరణం 8 దళాల పద్మాకారంలో ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది. 

ఆ మూడవ ఆవరణలో 8 మంది 'గుప్తతర దేవతలు' ఉంటారు. మందార పువ్వు రంగు దేహకాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. చెరుకు విల్లు, పుష్ప శరం, పుష్ప గుచ్చం, ఉత్పలం ధరించి ఉంటారు. వీరి పేర్లు వరుసగా; 

1. అనంగ కుసుమ

2. అనంగ మేఖల

3. అనంగ మదన

4. అనంగ మదనాతుర

5. అనంగ రేఖా

6. అనంగ వేగినీ

7. అనంగాంకుశ

8. అనంగ మాలినీ

సాధకుడు ఈ ఆవరణ ప్రవేశించి మరింత ముందుకు వెళతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹


🌹శ్రీచక్ర విజ్ఞానం🌹(5 వ భాగం)

🌹4 -నాలుగవ ఆవరణ - మన్వస్రం🌹

శ్రీ చక్రం లోని నాలుగవ ఆవరణ ఇక్కడ క్రింది పటం లో చూపిన విధంగా 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ 'సంప్రదాయ యోగినిలు' 14 మంది పటం లో సూచించిన సంఖ్యల క్రమం లో ఉంటారు. 

వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం, వహ్ని రూప ఖడ్గం, వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు;

1. సర్వ సంక్షోభిణీ

2. సర్వ విద్రావణీ

3. సర్వ ఆకర్షిణీ

4. సర్వ ఆహ్లాదినీ

5. సర్వ సమ్మోహినీ

6. సర్వ స్తంభినీ

7. సర్వ జ్రుమ్భిణీ

8. సర్వ వశంకరీ

9. సర్వ రంజనీ

10.సర్వోన్మాదినీ

11.సర్వార్ధ సాధినీ

12. సర్వ సంపత్తి పూరిణీ

13. సర్వ మంత్రమయీ

14. సర్వ ద్వంద్వక్షయంకరీ

ఈ ఆవరణలో సాధకుడు ఈ యోగినీ శక్తులను ప్రాప్తించుకుని తన సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)..

🌹శ్రీ మాత్రే నమః🌹

శ్రీ చక్ర విజ్ఞానం (1)

 🌹శ్రీ చక్ర విజ్ఞానం 🌹 (1 భాగం)

శ్రీ చక్రం - నిర్మాణము, ఆవరణలు, అధిదేవతలు.

సాధారనంగా శ్రీ చక్రం అంటే అమ్మవారి స్వరూపం అని అందరికి తెలుసు నవర్ణావ పూజ చేస్తారు అని తెలుసు, అయితే ఈ ఆవరణ నిర్మాణ పద్దతులు అందులోని దేవతలు అర్చన విధానాలు గురించి చాల మందికి అవగాహన ఉండదు.. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా వివరంగా తెలిపే వారు తక్కువ మంది ఉన్నారు చెప్పే వాళ్ళు ఉన్నా నేర్చుకునే సమయం ఈ రోజుల్లో అందరికి లేదు..మనిషి ఆయువు కాలం కలియగంలో తక్కువ కనుక ఉన్న సమయంలోనే అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పయనం కొనసాగించాలి అలా మనము శ్రీ చక్ర నిర్మాణ ము , అందులో శక్తి రూపాలు , ఆవరణలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..

 శ్రీ చక్ర నిర్మాణం, అందులోని ఆవరణలు, అధిదేవతలు గురించి తెలియటమే కాక అందులోని కేంద్ర బిందుమండల స్థానంలో తేజోమయ రూపంలో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తారు. ఇప్పుడు మనవంటి వారికోసం, శ్రీ చక్రం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం

వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"

గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా; 

1. బిందువు

2. త్రికోణము

3. వసుకోణం

4. అంతర్దశారము

5. బహిర్దశారం

6. చతుర్దశారం

7. అష్టదళపద్మం

8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు

9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)


బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది. 


నవావరణములు: 


శ్రీ చక్రం లో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు. 

బయటనుండి కేంద్రం వైపు పోయే వరసలో వాటి పేర్లు ఈవిధంగా వుంటాయి. 


1. ధరణీ సదనం లేదా భూపురం

2. పదహారు దళ పద్మం

3. నాగ(అష్ట) దళ పద్మం

4. చతుర్దశారం

5. బహిర్దశారం

6. అంతర్దశారము

7. వసుకోణం

8. త్రికోణము

9. బిందువు

(సశేషం).


🌹శ్రీ మాత్రే నమః🌹

🌹శ్రీ చక్రం విజ్ఞానం🌹 (2 వ భాగం)

🌹మొదటి ఆవరణం - ధరణీ సదనం (భూపురం)🌹

శ్రీ చక్రానికి వెలుపల నాలుగు వైపులా గోడలాగా ఉండే దాన్ని భూపురం అంటారు. అది ఈ క్రింది విధం గా ఉంటుంది:

ఈ ప్రధమ ఆవరణలో అణిమాది దేవతలు 28 మంది ఉంటారు. వీరందరూ మందార పువ్వు రంగు గల దేహచ్చాయ తో ఉంటారు. ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో చింతామణి, కపాలం, త్రిశూలం, అంజనం లేదా కాటుక ఆయుధాలుగా ధరించి వుంటారు. ఆ 28 దేవతల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి:

అష్ట సిద్దులు: 

1. అణిమా  

2. మహిమా

3. గరిమ

4. లఘిమా 

5. ప్రాప్తి

6. ప్రాకామ్య 

7. ఈశిత్వ 

8. వశిత్వ 

9. ఇచ్ఛా   

10. సర్వకామ 


సప్త మాతృకలు: 

11. బ్రాహ్మి 

12. మాహేశ్వరి 

13. కౌమారి 

14. వైష్ణవి, 

15. వారాహి 

16. మహేన్ద్రి 

17. చాముండా 

18. మహాలక్ష్మి 

19. సర్వసంక్షోభిని 

20. సర్వ విద్రావిణీ 

21. సర్వాకర్షణీ

22. సర్వవశంకరీ 

23. సర్వోన్మాదినీ 

24. సర్వ మహంకుశా 

25. సర్వ ఖేచరీ 

26. సర్వ బీజా

27. సర్వ యోని 

28. సర్వ త్రిఖండా

శ్రీ విద్య ఉపాసకుడు సాధించే మొదటి మెట్టు ప్రధమ ఆవరణ. ఈ ఆవరణలో అష్ట సిద్ధులు, సప్త మాతృకలు, మరి ఎన్నో ఇతర శక్తులు ఉన్నాయి. ఈ ఆవరణ సాధించినవారికి వీరి అనుగ్రహం కలుగుతుంది. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹


🌹శ్రీ చక్ర విజ్ఞానం🌹(3 వ భాగం)

🌹రెండవ ఆవరణ - షోడశ దళ పద్మం 🌹

ఇది 16 దళాల పద్మాకారం లో ఉంటుంది. ఈ క్రింది పటం లో చూడవచ్చు. 

ఈ ఆవరణలో 16 మంది గుప్త దేవతలు పైన చూపిన సంఖ్యల క్రమంలో ఉంటారు. ఒకొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. మూడు నేత్రాలు ఉంటాయి. చంద్ర వంక ను ధరించి ఉంటారు. ధనుస్సు , బాణం, డాలు, ఖడ్గం ఆయుధాలుగా దరించి ఉంటారు. వారి పేర్లు వరుసగా; 

1. కామాకర్షిణీ (మనసు) (Conscious mind)

2. బుద్హ్యాకర్షిణీ (బుద్ధి) (Intellect)

3. అహంకారాకర్షిణీ (అహంకారం) (I or Ego)

(పంచ తన్మాత్రలు) (The 5 Sensory Perceptions of Ears, Skin, Eyes, Tongue, Nose)

4. శబ్దాకర్షిణీ (Hearing)

5. స్పర్శాకర్షిణీ (Touch)

6. రూపాకర్షిణీ (Seeing)

7. రసాకర్షిణీ (Taste)

8. గంధాకర్షిణీ (Smell)

9. చిత్తాకర్షిణీ (Sub-conscious mind)

10. ధైర్యాకర్షిణీ

11. స్మృత్యా కర్షిణీ

12. నామాకర్షిణీ

13. బీజాకర్షిణీ

14. ఆత్మాకర్షిణీ

15. అమృతాకర్షిణీ

16. శరీరాకర్షిణీ

ఈ రెండవ ఆవరణ లోకి ప్రవేశించిన సాధకునకు అమ్మవారి అనుగ్రహం వలన ఈ ఆకర్షణ శక్తుల పట్ల సంయమనం లభిస్తుంది.

ఈ ఉన్నతి ని సాధించి శ్రీ విద్యోపాసకుడు మరింత ముందుకు సాగుతాడు






Saturday, December 24, 2022

చింతామణి గృహము

 🌹చింతామణి గృహము లోని తొమ్మిది ఆవరణల🌹      

                         

🙏"చింతామణి గృహము"🙏


🌹తొమ్మిదవ ఆవరణ - త్రైలోక్యమోహన చక్రం - ఇందులో మూడు ఆవరణలు ఉంటాయిః

ఈ చక్రము నందు ప్రకటశక్తులైన అణిమాది అష్టసిద్దిదేవతలు, బ్రాహ్మ్యాది అష్టమాతృదేవతలు మరియు సంక్షోభిణ్యాది దశముద్రాదేవతలు ఉంటారు, ఈ ప్రకటశక్తులకు అధిదేవత త్రిపురాదేవి

▪️అష్ట సిద్ధులు - అణిమ, మహిమ, లఘిమ, గరిమా, ఈశిత, వశితా, ప్రాకామ్య, పాప్తి

▪️అణిమాది దేవతల పై భాగంలో అష్టమాతృదేవతలు - బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ. మాహేంద్రీ, చాముండా, మహాలక్ష్మీ

▪️బ్రాహ్మీ దేవతల పై భాగములో దశముద్రాదేవతలు - సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణి, సర్వవశంకరీ, సర్వోన్మాదనముద్రా, సర్వమహాంకుశా, సర్వఖేచర ముద్రా, సర్వబీజా, సర్వయోని ముద్రా,సర్వత్రిఖండికా

         

🌹ఎనిమిదవ ఆవరణ - సర్వాశా పరిపూరక చక్రం            

ఈ చక్రము నందు కామాకర్షిణి మొదలగు షోడశ గుప్తయోగినులు ఉంటారు, వీరికి అధిదేవత త్రిపురేశి అమ్మవారు.

▪️పదహారు మంది గుప్తయోగినులు - కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి,ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణినిత్యా & శరీరాకర్షిణి.       


🌹ఏడవ ఆవరణ - సర్వ సంక్షోభణ చక్రం

ఈ చక్రము నందు అనంగకుసుమ మొదలగు గుప్తతర యోగినులు ఉంటారు. వీరికి అధిదేవత - త్రిపురసుందరీదేవి.

▪️అనంగకుసుమా దేవతలు - అనంగమేఖలా, అనంగమదనా, అనంగమదనాతురయా, అనంగరేఖ, అనంగవేగా, అనంగాంకుశా & అనంగమాలిన్య.


🌹ఆరవ ఆవరణ - సర్వ సౌభాగ్యదాయక చక్రం    

ఈ చక్రము నందు సంక్షోభిణి మొదలగు చతుర్దశ సంప్రదాయనామ శక్తులు ఉంటారు. వీరికి అధిష్టానదేవత త్రిపురవాసినీదేవి

▪️పదునాలుగు సంప్రదాయనామ శక్తులు - సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వసమ్మోహినీశక్తి, సర్వస్తంభనశక్తి, సర్వజృంభణశక్తి, సర్వవశంకరీ, సర్వరంజనశక్తి, సర్వోన్మాదనశక్తి, సర్వార్థసాధనీశక్తి,సర్వసంపత్తిపూరణీ, సర్వమంత్రమయీశక్తి, సర్వద్వంద్వక్షయంకరీ.


🌹ఐదవ ఆవరణ - సర్వార్థసాధక చక్రం

ఈ చక్రము నందు సర్వసిద్ధిప్రద మొదలగు దశ కులోత్తీర్ణ యోగినులు ఉంటారు. వీరికి అధిష్టానదేవత త్రిపురాశీ అమ్మవారు.

▪️పదిమంది కులోత్తీర్ణ యోగినులు - సర్వసిద్ధిప్రదా, సర్వసంపత్ప్రదా, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదాదేవీ, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్ననివారిణీ,సర్వాంగసుందరీదేవి, సర్వసౌభాగ్యదాయిని" 


🌹నాలుగవ ఆవరణ - సర్వరక్షాకర చక్రం

ఈ చక్రము నందు సర్వజ్ఞ మొదలగు దశ నిగర్భ యోగినులు ఉంటారు. వీరికి అధిష్టానదేవత త్రిపురమాలినీదేవి అమ్మవారు

▪️పదిమంది నిగర్భ యోగినులు - సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూప, సర్వపాపహరా, సర్వానందమయీదేవి, సర్వరక్షాస్వరూపిణీ.


🌹మూడవ ఆవరణ - సర్వరోగహర చక్రం

ఈ చక్రము నందు వశిన్యాది అష్ట రహస్య యోగినులు ఉంటారు. వీరికి అధిష్టానదేవత త్రిపురాసిద్ధాదేవి అమ్మవారు.

▪️ఎనిమిది మంది వశిన్యాది దేవతలు - వశినీ, కామేశీ, మోదినీ, విమలా, అరుణా, జయిని, సర్వేశీ, కౌలినీ.

▪️ఇక్కడ వశినీదేవతలు వసించు గృహమునకు ఇరవై మూరల పై భాగమున పార్వతీ పరమేశ్వరుల అస్త్ర సంపద కలదు.

▪️ఈ ఆయుధముల గృహమునకు పై భాగము నందు కామేశ్వరి మొదలగు దేవతలు ఉంటారు.


🌹 రెండవ ఆవరణ - సర్వసిద్ధిప్రద చక్రం

ఈ చక్రము నందు కామేశి మొదలగు ముగ్గురు అతిరహస్య యోగినులు (వీరినే సమయేశీ దేవతలు అని అంటారు) ఉంటారు. వీరికి అధిష్టానదేవత త్రిపురాంబా అమ్మవారు.

▪️సమయేశీ దేవతలని పిలువబడే ముగ్గురు అతిరహస్యయోగినులు - కామేశీ, వజ్రేశీ, భగమాలినీ.

▪️పైన చెప్పిన కామేశ్వరీ గృహమునకు పై భాగములో - మిత్రేశానందనాథ, ఉద్దీశానందనాథ, షష్ఠీశానందనాథ, చర్యేశానందనాథ నలుగురు యుగనాథులు గలరు. వీరు శ్రీవిద్యా గురువులు.

▪️నాథభవనమునకు పై భాగములో - కామేశి మొదలగు నిత్యాదేవతలు

నిత్యా దేవతలు - కామేశి, భగమాలిని, భేరుండ, నిత్యక్లిన్నా, వహ్నివాసిని, మహావజ్రేశ్వరీ, దూతీ, త్వరితాదేవీ, కులసుందరీ, నిత్యా, నీలపతాక, సర్వమంగళా, జ్వాలామాలిని, చిత్రా.

▪️నిత్యాదేవతల గృహమునకు పై భాగములో - షడంగ దేవతలు

o షడంగ దేవతలు - హృద్దేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి (కవచదేవి), నేత్రదేవి మరియు శస్త్రదేవి.

▪️షడంగదేవతల గృహమునకు పై భాగము - బిందు పీఠము / శ్రీపీఠము / మహాపీఠము / విద్యా పీఠము / ఆనంద పీఠము        

                           

 🌹ప్రథమ ఆవరణ - సర్వానందమయ చక్రం

దీనినే బిందు పీఠము / శ్రీపీఠము / మహాపీఠము / విద్యా పీఠము / ఆనంద పీఠము అని పిలుస్తారు. ఈ చక్రము నందు

▪️పంచబ్రహ్మలు కొలువై ఉన్న మంచం - పంచబ్రహ్మాసనం

▪️పంచబ్రహ్మాసనమునకు చుట్టూ మాయాస్వరూపమగు నల్లని తెరలు           

▪️మంచమునకు పైన వ్రేలాడుచున్న మల్లికా, పున్నాగ పుష్పహారములచే నిండిన పచ్చని చాందిని

▪️ఈ మంచమును బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు ఈ నలుగురు నాలుగు కాళ్ళుగా మోయుచున్నారు.

▪️ఈ మంచము పైన, సదాశివుడు పానుపు వలె పడుకొని ఉంటారు. సదాశివఫలకంతో కలిపి మొత్తం ఐదుగురు కాబట్టి పంచబ్రహ్మాసనం అయ్యింది.

▪️అంగదేవతల గృహము నుండి, సదాశివ ఫలకం వరకు మొత్తం తత్త్వ సోపానాలు అనే మెట్లు గలవు. ఇవి మొత్తం ముప్ఫైఆరు.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, పాణి, వాఘ్రాణ, జిహ్వ, చక్షు, చర్మము, అహంకారం, బుద్ధి, మనస్సు..

▪️చింతామణి గృహము నందు, బిందుపీఠమునందు, పంచబ్రహ్మసనముపై హంసతూలికాశయనముపై సదాశివఫలకం అని చెప్పబడిన మహాకామేశ్వరుని యొక్క అంకముపై/ఎడమ తొడపై శ్రీలలితా త్రిపురసుందరీ అమ్మవారు కూర్చొని ఉంటారు. ఇదే శివశక్త్యైక్య స్వరూపమైన బిందుస్థానము.                


🌹శ్రీ మాత్రే నమః🌹

బగలా తన్త్ర్రే బ్రహ్మాస్త్ర మాలామన్త్రః

 ♦️ఎవరైనా మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన ,మీకు హాని చేస్తున్నారు అనిపించినా హాని చేసి ఉన్నా, మీకు నష్టం కలిగించి ఉన్నా, మీకు మానసిక క్షోభ కలిగిస్తున్నా వారి వల్ల మీ బాధను ఆమ్మవారికి చెప్పుకుని కఠినంగా శిక్షించ మని కోరుకొని ఈ స్త్రోత్రం చదవండి♦️ 


🔥శ్రీ బగలా తంత్రే బ్రహ్మాస్త్ర మాలా మన్త్రః 🔥             


శ్రీ గణేశాయ నమః


 అథ బ్రహ్మాస్త్ర మాలా మంత్రః ||


 ఓం నమో భగవతి చాముండే నరకంక గృధ్రోలూక పరివార సహితే శ్మశాన ప్రియే నర రుధిర మాంస చరు భోజన ప్రియే సిద్ధ విద్యాధర వృంద చరణే బ్రహ్మేశ విష్ణు వరుణ కుబేర భైరవీ భైరవప్రియే ఇంద్ర క్రోధ వినిర్గత శరీరే ద్వాదశాదిత్య చండ ప్రభే అస్థి ముండకపాల మాలాభరణేశీఘ్రం దక్షిణ దిశి ఆగచ్చాగచ్చ మానయ మానయ నుద నుద *(అముకం)* మారయ మారయ చూర్ణయ చూర్ణయ ,ఆవేశయ ఆవేశయ,త్రుట త్రుట,త్రోటయ త్రోటయ ,స్ఫుట స్ఫుట , స్ఫోటయ స్ఫోటయ ,మహా భూతాన్ జృంభయ జృంభయబ్రహ్మ రాక్షసాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, భూతప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ, శత్రూన్ చూర్ణయ చూర్ణయ సత్యం కథయ కథయ వృక్షేభ్యః సంన్నాశయ సంన్నాశయ అర్కం స్తంభయ స్తంభయ గరుడ పక్ష పాతేన విషం నిర్విషం కురు కురు లీలాంగాలయవృక్షేభ్యః పరిపాతయ పరిపాతయ శైల కానన మహీం మర్దయ మర్దయ, ముఖం ఉత్పాటయోత్పాటయ పాత్రం పూరయ పూరయ భూత భవిష్యం యత్సర్వం కథయ కథయ కృన్త కృన్త దహ దహ పచ పచ మథ మథ ప్రమథ ప్రమథ ఘర్ఘర ఘర్ఘర గ్రాసయ గ్రాసయ విద్రావయ విద్రావయ ఉచ్చాటయోచ్చాటయ విష్ణుచక్రేణ వరుణ పాశేన ఇంద్ర వజ్రేణ జ్వరం నాశయ నాశయ ప్రవిదం స్ఫోటయ స్ఫోటయ సర్వ శత్రూన్ మమ వశం కురు కురు పాతాళం ప్రత్యంతరిక్షం ఆకాశగ్రహ మానయానయ కరాళి వికరాళి మహాకాళి రుద్ర శక్తే పూర్వ దిశం నిరోధయ నిరోధయ పశ్చిమ దిశం స్తంభయ స్తంభయ దక్షిణ దిశం నిరోధయ నిరోధయ ఉత్తర దిశం బంధయ బంధయ హ్రాం హ్రీం ఓం బంధయ బంధయ జ్వాలామాలిని స్తంభిని మోహిని ముకుట విచిత్ర కుండల నాగాదివాసుకీకృత హార భూషణ మేఖలా చంద్రర్కహాస ప్రభంజనే విద్యుత్ స్ఫురిత సకాశ సాట్టహాసే నిలయ నిలయ హుం ఫట్ ఫట్ విజృంభిత శరీరే సప్త దీపకృతె బ్రహ్మాండ విస్తారిత స్తన యుగలే అసి ముసల పరశు తోమర క్షురి పాశ హలేషు వీరాన్ శమయ శమయ సహస్ర బాహు పరాపరాది శక్తి విష్ణు శరీరే శంకర హృదయేశ్వరి బగళాముఖి సర్వ దుష్టాన్ వినాశయ వినాశయ హుం ఫట్ స్వాహా|


ఓం హ్ల్రీం బగలాముఖి యే కేచనాపకారిణః సంతి తేషాం వాచం ముఖం స్తంభయ స్తంభయ జిహ్వాం కీలయ కీలయ బుద్ధిం వినాశయ వినాశయ హ్రీం ఓం స్వాహా | ఓం హ్రీం హ్రీం హిలీ హిలీ *(అముకస్య)* వాచం ముఖం పదం స్తంభయ శత్రుం జిహ్వాం కీలయ శత్రూణాం దృష్టి ముష్టి గతి మతి దంత తాలు జిహ్వాం బంధయ బంధయ మారయ మారయ శోషయ శోషయ హుం ఫట్ స్వాహా ||


        ||ఇతి బగలా తన్త్ర్రే బ్రహ్మాస్త్ర మాలామన్త్రః సమాప్తః ||


(ఆముకం అని ఉన్న చోట శత్రువులు అని మటుకే పెట్టాలి ఎవరి పెరు పెట్టకూడదు)..

♦️శ్రీ మాత్రే నమః♦️


ఇలాంటి మంత్రాలు సాయంత్రం సమయంలో పారాయణ చేయాలి

అలాగే గుమ్మడి దీపం లాంటివి పెట్టేటప్పుడు అవి దోషం పోవడానికి చేసే పూజ కాబట్టి దీపం కొండెక్కాక మరుసటి రోజు అవుకి పెట్టండి మంచిది

 🌷🙏విద్యాభివృద్ధికి+విదేశీయానానికి మంత్ర శ్లోకం🙏🌷

🌷🙏మంత్రం🙏🌷

"జయ అజిత జయ అశేష జయ వ్యక్తిస్థితే 

జయ పరమార్థార్థ సర్వజ్ఞ జ్ఞానజ్ఞేయార్థనిః సృతః"


ఈ జయకర మంత్ర శ్లోకం నిత్యము 108 సార్లు ధ్యానిస్తుంటే సర్వ విద్యలందు జయము కల్గును. విదేశీయానం సంకల్పించిన వా సంకల్పం తప్పక నెరవేరును.


🌷🙏శ్రీ మాత్రే నమః🌷🙏


🌷🙏భూ, గృపా లాభ వరాహ మంత్రం🙏🌷


మంత్రం:- "ఓం ఐం హ్రీం శ్రీం క్లీం

 ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భువస్సువః భూపతయే భూపతిత్వం మే దేహి దాపయ స్వాహా||”


ఉపాసనాపరులకు ఈ వరాహ మంత్రము కల్పవృక్షం లాంటిది. భూసంపదకా? గృహంకోసమా? నిర్ణయించుకుని సంకల్పం చెప్పి ఒక మండలం పాటు నిత్యమూ 1008సార్లు ధ్యానించి, దశాంశ తర్పణము దశాంశ హోమము చేస్తే తప్పక కార్యము సఫలము కాగలదు. నిత్యము వరాహదేవునికి పంచపూజలతో అర్చించి ధ్యానించాలి. ధ్యానించే ముందు పాలతో పసుపుబొట్టు కలిపి పెట్టుకొని ఉపాసన ప్రారంభించాలి. తర్వాత వరాహ క్షేత్రం(తిరుమల, సింహాచలం) లో ఎక్కడైనా వెళ్లి దర్శనం చేసుకుని నిద్ర చేసి రావాలి ..

సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం

 🌷🙏సర్వ కార్యసిద్ది వారాహి వ్రతం🙏🌷


వారాహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం, లేకపోతే అమ్మ వారిని ఆవాహన చేస్తూ కలశం అయిన పెట్టవచ్చు,అది కాకపోతే మనం నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయిన అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను,అని మనసులో అనుకోని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టవచ్చు.


ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం, విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలనే నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో వెలిగించే దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు.


కానీ ప్రతి నెల 2 సార్లు వచ్చే పంచమి తిధిని మాత్రం మిస్ అవ్వకుండా వారాహి మాత పూజని గుండ్రంగా ఉండే 5 లడ్డులను నైవేద్యంగా సమర్పించీ,దీపారాధన చేయాలి, అలాగే ఈమెకు రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంతవరకు,సాయంకాలం 6 గo పైన మొదలు పెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు, ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు, మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు.


ఈమెకు పగటి పూజకంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది. కనుక మన గ్రూపులో వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్నవాళ్లు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి 16 శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి సమస్యలు ఈ చిన్న పూజ వల్ల దాదాపు పరిష్కరించుకోవచ్చు.


పూజకు కావాల్సిన సామగ్రి

1.పసుపు

2.కుంకుమ

3.ఆగర్భత్తులు

4.దానిమ్మ పండు గింజలు

5.లడ్డులు(5)

6.అమ్మ వారి చిత్రపటం,విగ్రహం,కలశం, ఇవేవీ లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి, అ దీపకాంతిని వారాహిమాత గా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు.


6. (పువ్వులు) ఖచ్చితంగా పలనా పువ్వులు పెట్టాలని రూల్ ఏమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు, అలాగే అమ్మవారినీ,భూదేవి అని అంటారు, కనుక ఈ భూమిమీద ఏ పువ్వు అయిన రోడ్డు పక్కన మన పెరటిలో వికసించిన ఏ పుష్పం అయిన అమ్మకు ఇష్టం, పూలకోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.


దానిమ్మ గింజాలు ఒక గుప్పెడు,లడ్డులు 5 గుండ్రంగా ఉండాలి


శక్తి ఆరాధన గ్రూప్ సభ్యులకు మనవి, వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకొనే వారికి నా విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి, అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనం కోరుకొని చేసే పూజ ఎప్పటికి ఫలితాన్ని ఇవ్వదు, మనం బాగుండాలి మనతో పాటు నలుగురు బాగుండాలి అనుకొనే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రులు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచన తో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలు అయినది అని దాని అర్థం, మీరు యూట్యూబ్ లో మరియు ఇతరత్రా సోషల్ మీడియాలలో చూస్తున్నా వార్తలను నమ్మి మోసపోకండి, ఈ పూజ కేవలం 4 అంశాలను పరిగణనలోకి తీసుకొని చేయిస్తున్నాను

1.ఆర్ధిక ఇబ్బంది

2.వ్యాపార అభివృద్ధి

3.ఇంట్లో తరచు కలహాలు

4.మానసిక ప్రశాంతత

కేవలం ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకుని పూజ చేయమంటూతున్నాను,ఈ విషయం అందరూ గమనించగలరు.


🌹ఓం నమో వారాహి🌹

మన పురాణాల ప్రకారం మహా శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు,వీరే బ్రహ్మీ,మాహేశ్వరి,కౌమారి,వైష్ణవి, వారాహి,ఇంద్రాణి,చాముండీ.

8.వ మాతృక గా నారసింహి

9.వ మాతృక గా వినాయకి నీ ఆరాధించడం జరుగుతుంది,భక్తులకు కొంగుబంగారంగా మనల్ని ఎప్పుడు చల్లగా చూసేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు,ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారాహి మాతగా పరిగణించపడుతోంది, ఈ వారాహిరూపం పంది రూపాన్ని పోలిఉండి,నల్లని శరీరఛాయాతో మేగవర్ణంతో 8 చేతులతో, అభయ వరద హస్తం,శంకు చక్ర, రోకలి నాగలి,పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది,ముక్యంగా లలితదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహిమాత,అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామాలలో వినిపిస్తుంది,వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచినవారికి,భక్తుల పాలిట కొంగు బంగారమై,తన పైన నమ్మకం ఉంచిన వారి సమస్యలపై గొప్ప యోధురాలిగా నిలిచి జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్ని తొలగించి,శత్రుభయం,జ్ఞాన సిద్ధిబుద్ధి,ధనప్రాప్తి,ఇంకా అనేక అనేక సకల జయాలు సిద్ధిస్తాయి,అలాగే ఈమె అజ్ఞాచక్ర కుండలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది, అందుకే ఆమెను ఆజ్ఞచక్రేశ్వరి అన్నారు,శుంభ నీశుoబ,రక్త బీజ వధలోను ఈమె ప్రస్తావన ఉంది.


ప్రతినిత్యం మీరు ఈ నామాలను స్మరిచండి....

ఓం పంచమే నమః

ఓం దండనాథ నమః

ఓం సంకేత నమః

ఓం సమయేశ్వరి నమః

ఓం సమయ సంకేత నమః

ఓం పోత్రిన్యే నమః

ఓం శివయే నమః

ఓం ఆజ్ఞ చక్రేశ్వరి నమః

ఓం మహా సైన్యయే నమః

ఓం వార్తాలీ నమః


ఈ నామాలతో స్మరిస్తే సకల కార్య సిద్ధి లభిస్తుంది.


॥ వారాహీ గాయత్రీ ॥


వరాహముఖ్యై విద్మహే । దణ్డనాథాయై ధీమహీ ।

తన్నో అర్ఘ్రి ప్రచోదయాత్


(వారాహి మాత ధ్యాన స్తోత్రం)

వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషామ్

హారాగ్రైవేయతుంగస్తనభరనమితాం పీతకైశేయవస్త్రామ్ ।

దేవీం దక్షోధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలమ్

వామాభ్యాం ధారయన్తీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నామ్


వారాహి అమ్మ వారి అవతారాలు

1.బృహత్ వారాహి

2.స్వప్న వారాహి

3.కిరాతా వారాహి

4.లఘు వారాహి

5.ధూమ్ర వారాహి

6.మహా వారాహి గా చెప్పబడుతున్నది.


1.బృహత్ వారాహి అనగా శత్రు శేషం ఉండదు అనగా మీరు ఈ అవతరాన్ని ఉపాసించడం వల్ల, మన లోని అంతర్ శత్రువులు కామ, క్రోధ, మద, మచర్యాలు,నశించి, మన అంతర్ ముకంగా ఉన్న శత్రువులను అమ్మ నశి oపచేస్తుంది,ఇది మన దక్షణాచారం లో అమ్మను కొలిచే పద్దతి.


2.స్వప్న వారాహి

ఈ స్వప్న వారాహి ని కొలిచే సాధకులకు అమ్మ స్వప్నంలో భూత,భవిషత్, వర్థమానాలను తెలియచేస్తూ, సాధకులకు కానీ వారి కుటుంబసభ్యులకు కానీ ఏదైనా ప్రమాదం కానీ, మంచి చెడులను ముందుగానే సాధకుల స్వప్నంలో కనిపించి,సమాధానం చెబుతుంది.


6. మహా వారాహి భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటుంది.


కిరత వారాహి, లఘు వారాహి,ధూమ్ర వారాహి అవతారాలు వాటి విశిష్టత మనకు ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన విధంగా 5 శుక్రవారాలు ఆ తల్లికి విశేషంగా పూజించుకోవచ్చి.


శత్రు బాధ నివారణ, గ్రహాబాధ, అనారోగ్యంతో బాధ , పిల్లలే సమస్యగా మారిన తల్లి తండ్రులు చేయగలం ఈ విధంగా అని మీకు అనుకుంటే పైన చెప్పిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని శుక్ల పక్షం లేదా కృష్ణ పక్షం లో వచ్చే పంచమి తిది రోజు పూజ మొదలు పెట్టి వారాహి ఉపాసన ఇప్పుడు ఇక్కడ ఇస్తున్న విధంగా రోజు చేయాలి అనుకునే వారు ఈ మంత్రాన్ని జపం చేయడం మోదలు పెట్టాలి మీ శక్తి వంచన లేకుండా రోజూ 108 లేదా 5 సార్లు ఈ మంత్రాన్ని జపించి గుండ్రంగా ఉండే ఆహారం ముఖ్యంగా దానిమ్మపండు ,లడ్డు లాంటివి నివేదన చేసి 5 వారాలు జపం చేయాలి. మీ సంకల్పం నెరవేరుతుంది. అదే ఈ మంత్రం..


🌷సర్వ బాధ నివారిణి అయిన బృహద్వారాహి మహా మంత్రం 


'అస్యశ్రీ బృహద్వారాహి మహామంత్రస్య బ్రహ్మ ఋషి , గాయత్రీచ్ఛందః శ్రీబృహద్వారాహి దేవతా | గ్లేo బీజం | ఐం శక్తిః ఠ : కీలకం!


ఐం, గ్లౌం, ఐం, నమో భగవతే వార్తాళీ 2 - వారాహి 2 || వరాహముఖి 2 || అంధే అంధినేనమః 11 రుంధే రుందినేనమః 111 ఓం జృంభినీ నమః న్యాసః 


👉( 2 ఉన్న చోట ఇంకో 2 సార్లు, 11 ఉన్న చోట అదే పదం 11 సార్లు, 111 సార్లు అన్న పదాన్ని 111 సార్లు పలకాలి)

ధ్యానం | రక్తాంబుజే ప్రేతవరాసనస్థా మర్ణోరు కామార్ఫటికా సనస్థాం | ద్రం షోల్ల సత్ప్రోత్రిముఖారవిందాం | కోటి రసంఛిన్న హిమాంశురేఖాం | హలం కపాలం ధధతీక రాభ్యాం , వామే కరాభ్యాం ముసలేష్ఠదేచ | రక్తాంబరాం రక్త పటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం | చ్యామాం సమస్తా భరణ స్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం || 


మనుః (ఇక్కడ నుండి మూల మంత్రం ఇది మటుకే 108 సార్లు చేయాలి)

*ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతీ వార్తాళీ, వారాహి, వరాహముఖి, ఐం గ్లౌం ఐం అందె అంధినీ నమః | రుంధే రుంధినీ నమః | జంభే జంభినీనమః | మోహే మోహినే నమః | స్తంభే స్తంభినీ నమః | ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వ స్తంభనం కురు, శీఘ్రం వశ్యం కురు ఐం గ్లౌం ఐం ఠ : ఠ : ఠ : ఠ : హుం ఫట్ స్వాహా||


🌷నమో వారాహి🌷

చండీ పారాయణ నియమములు

 🌷🙏చండీ పారాయణ నియమములు🙏🌷


చండీ:-


పారాయణ...శ్రవణం...మననం చేసే భగవతి యొక్క భక్తులు చిత్ శక్తి చేతన యొక్క చైతన్య స్పర్శను పొందుతారు. వారు ఈ దివ్య కథ యొక్క మంత్ర రహస్యాలను అనుభూతి చెందటంతో పాటు తత్త్వభోద యొక్క సత్యాన్ని, అర్థాన్ని కూడా అనుభూతి చెందుతారు. భగవతి యొక్క ఈ భావమయ కథలో వివిధ అంగములతో పాటు"దేవ్యథర్వ శీర్షం" యొక్క గొప్ప మహిమ చెప్పబడింది. అథర్వ వేదంలో దీని మహత్వమును గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది. దేవ్యథర్వ శీర్ష పారాయణ తో మాత అతి త్వరగా ప్రసన్నురాలు అవుతుంది అని ఋషులు పేర్కొన్నారు. అయితే పారాయణ క్రమంలో రకరకాలుగా భేదాలు ఉండటం వల్ల ఇది పారాయణ అంగాంగ చెప్పబడలేదు. అయినప్పటికీ దీని యొక్క మాంత్రిక మరియు తాత్విక మహత్వము వలన శ్రీ దుర్గా సప్తశతి పారాయణము చేసేవారు దీనిని తప్పకుండా పఠిస్తారు. శక్తి ఉపాసకులలో దీనిని ఒక్క దాన్నే విడిగా పారాయణ చేసే సాధనా విధానం కూడా ఉంది. పారాయణ యొక్క సత్పలితం మంచి పరిణామం ఎంత స్పష్టంగా, వేగంగా ఉన్నతమైనదిగా అలాగే గొప్పదిగా మనకి లభిస్తుంది అంటే మనసు బంవంతంగానైనా శ్రద్దాపూరితం కాకుండా ఉండదు.


ఈ దేవ్యథర్వ శీర్షం 26 చమత్కార వంతాలైన మంత్రాల నిధి! దీని 27 వ మంత్రంలో పారాయణ ఫలశృథి చెప్పడం జరిగింది. దేవతలు భవానీ మాతతో ఆమె తాత్త్విక స్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస వెల్లడి చేశారు. దేవతల జిజ్ఞాస తో కూడిన ప్రశ్నతోనే ఈ దేవ్యథర్వ శీర్షం ప్రారంభం అవుతుంది. ఈ అపూర్వ అద్భుత సంఘటన ప్రతీ సాధకుడి అంతఃకరణలో కూడా జరుగుతుంది. కామేంద్రియాలు, జననేంద్రియాలు, మనసు, ప్రాణం, పంచ మహ భూతములథో తయారైన ఈ శరీరం క్రియాశీలమైనదే , అయితే దీని క్రియా శక్తికి ఆధారం ఏంటి!? ఈ ప్రశ్న సాధకుడి మనసులో ఉదయించినప్పుడు తత్త్వ పరమైన అనుసంధానం వలన సమస్త క్రియాశక్థికి ఆధారం ఆ మహాశక్తి అన్న సమాధానం కూడా తెలుస్తుంది. ఆమె చేతన వలనే సమస్తం చైతన్యవంతం గా ఉంటుంది. అయితే ఆమె స్వయంగా ఎవరు!? ఆమె స్వరూపం ఏంటి!? ప్థాణాలను తొలచివేస్థూ మనసు లోతులలో గాఢంగా ఈ ప్రశ్నలు తలెత్తినప్పుడు జగజ్జనని స్వరం అతని అస్తిత్వం లో ప్రతిధ్వనిస్తుంది.


ఈ స్వరములను వినడానికి సాధకుడు తన మనసులోని దైవ ప్రవృత్తిని ఏకీకృతం చేసి, స్థిరపరచుకొని మరియు ఏకాగ్రత తో పిలవాల్సి ఉంటుంది. ఈ పిలుపు గాఢంగా, లోతుగా ఉన్నప్పుడే చిత్ శక్తి చైతన్య ధారలు సాధకుడి అంతరంగంలో వర్షిస్తాయి. దేవతలు అందరూ కలిసి దుర్గా దేవి వద్దకు వెళ్ళి సమ్రతతో ఆలా ప్రశ్నించారు...హే మహదేవి! నీవు ఎవరు? దానికి అమ్మవారు ఇచ్చిన సమాధానాల సారాంశమే దేవ్యథర్వ శీర్ష తత్త్వ కథ వివరిస్తుంది. నేను బ్రహ్మ రూపాన్ని, నానుండే ప్రకృతి పురుషాత్మకమైన సద్రూప అంటే రూపం కలిగిన మరియు అసద్రూప అంటే రూపం లేని జగత్తు ఉద్భవించింది ‌ . నేను ఆనందం మరియు అనానంద రూపాన్ని. నేను విజ్ఞానం మరియు అవిజ్ఞాన రూపాన్ని. తప్పనిసరిగా తెలుసుకోవలసిన బ్రహ్మం మరియు అబ్రహ్మం కూడా నేనే! పంచీకృత మరియు అపంచీకృత మహ భూతములు కూడా నేనే! ఈ సమస్త దృశ్య ప్రపంచం కూడా నేనే అయి ఉన్నాను!!!!


దేవతల ఈ దివ్వస్తుతి క్రమంలో "శక్తి సాధన" యొక్క రెండు మహ మంత్రాలు కూడా ప్రకటించబడ్డాయి. వీటిలో ప్రదమ మంత్రం శ్రీవిద్యకు సంబంధించిన మంత్రం! రెండవది నవార్ణ మంత్రం! ...


కామ ( క) , యోని ( ఏ) , కమలా ( ఈ) , వజ్రపాణి... ఇంద్రుడు ( ల) గుహ ( హ్రీం) , హ, స, వర్ణములు, మాతర్విశ్వా...వాయువు ( క) , ఆకాశం ( హ) , ఇంద్రుడు ( ల) తిరిగి గుహ ( హ్రీం), స, క, ల... వర్ణములు మరియు మాయ ( హ్రీం) . 


శివశక్త్యభేదరూపా! బ్రహ్మ విష్ణు శివాత్మిక! సరస్వతీ లక్ష్మీ గౌరీ రూపా! శుద్దోపాసనాత్మికా! సమరసీభూత! శివశక్త్యత్మికా! బ్రహ్మ స్వరూపం యొక్క నిర్వకల్ప జ్ఞానం ఇచ్చే తల్లీ! సర్వతత్త్వాత్మికా! మహ త్రిపుర సుందరి! అనేది పై మంత్ర భావార్థం. మంత్ర శాస్త్రం లో దీనిని పంచదశి మరియు ఆది శ్రీవిద్య అనే పేరుతో తెలియ చెప్పారు. అర్థం, బావార్థం, వాచ్యార్థం, సంప్రదాయార్థం, లౌకికార్థం, రహస్యార్థం మరియు తత్త్వార్థం అనే ఆరు రకాలైన అర్థములు దీనికి చెప్పడం జరిగింది. ఇది అత్యంత రహస్యమైన అయిన కారణంగా కావచ్చు దీనిని గురించి సింబాలిక్ గా మాత్రమే చెప్పడం జరిగింది. విశిష్ట జ్ఞానం సాధకుడికి తమ తమ సాధనలోనే తప్ప వేరే విధంగా లబించదు. 


""ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే "" 


ఈ పై నవార్ణ మంత్రం ఉపాసకులకు ఆనందం, బ్రహ్మ యొక్క సాయుజ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రం యొక్క బావార్థం 'హే చిత్స్వరూపిణి మహ సరస్వతీ! హే సద్రూపిణి మహాలక్ష్మి! హే ఆనందరూపిణి మహకాళి! బ్రహ్మవిద్యను పొందటానికి మేం అందరం ఎల్లప్పుడూ నీ ధ్యానం చేస్తున్నాం! హే మహకాళి, మహాలక్ష్మి, మహ సరస్వతీ స్వరూపిణి చండికా! నీకు నమస్కారము! అవిద్య అనే త్రాడు ముడిని విప్పి నన్ను విముక్తుడిని చేయుము " 


ఈ దేవ్యథర్వ శీర్షం యొక్క తాత్వీక మరియు మాంత్రిక రహస్యం చాలా లోతైనది అలాగే విస్తారమైనది. మీ సాధన క్రమంలో దీనిని పారాయణ చేయడం వలన అంతా శుభమే జరుగుతుంది. ప్రాతః కాలంలో దీనిని పఠించే వారికి సమస్త దుఃఖ స్వప్నాలు చెడు ఫలితాలు నాశనం అవుతుంది. ఆవు నేతితో దీపం వెలిగించి తర్వాత అమ్మవారికి పంచోపచార పూజ చేసి ఈ మంత్రాన్ని ఒక మాల లేక యథాశక్తి జపం చేస్తూ ఉంటే అనేక రకాల కష్టాల నుంచి బయటకు వస్తారు. చాలా కాలం పాటు అర్థ రాత్రి కాలంలో అయినా పైన చెప్పిన విధంగా ప్రతీ రోజూ రాత్రి పది సార్లు దేవ్యథర్వ శీర్షం, మంత్రం చేయడం వలన ఆ సాధకుడి వాక్కు ఫలిస్తుంది తప్ప వృదా అవదు. ...ఆ తర్వాత పది నిమిషాల పాటు ప్రాణాయామం... ధ్యానం కూడా చేయవచ్చు.

ముందుగా దేవిని తలచి - నమస్కరించి - పారాయణకు ప్రారంభించవలెను. పుస్తకమును ఒడిలో నుంచుకొనరాదు. వ్యాసపీఠముపై లేదా - ముందుగా - బల్లపై నుంచవలెను. గ్రంధమును పూజించి - పారాయణను ప్రారంభింపవలెను.

శ్లోకములను రాగయుక్తముగ చదువరాదు. చదువునప్పుడు తలను ఊపుట- చేతులను త్రిప్పుట చేయరాదు. వేగముగ చదువరాదు. అర్ధజ్ఞానము లేకుండ - శ్లోకపదములను అటునిటు చేయుచు చదువరాదు. అధ్యాయము పూర్తికాకుండ - మధ్యలో - పారయణను - ఆపరాదు. ఒక వేళ ఆపవలసినచో - ఆ అధ్యాయమును మరల మొదటినుండి చదువవలెను. పుస్తకమును చేతిలో నుంచుకొని చదివిన సగము ఫలితమే వచ్చును. మనసులో చదువరాదు. మరీ బిగ్గరగా - లేదా- మిక్కిలి నెమ్మదిగ గాని చదువరాదు. వ్రాసి కొని చదువరాదు. వ్యాసాపీటం పైన ఉంచి తప్పులు లేకుండా చదవాలి. 


దుర్గాదేవి పూజ చేయాలి, చండీ నావక్షరి యధాశక్తిన 108 సార్లు కానీ అంత కన్నా ఎక్కువ సార్లు జపం చేయవచ్చు, పారాయణ పూర్తి ఐయ్యాక మళ్ళీ ఒక మాల చండి నావక్షరి జపం చేయాలి.


 నిత్యపారాయణమునకు యంత్రమునందుగానీ, పుస్తకమునందుగానీ లఘుపూజ చేసిన చాలును, పారాయనే దీక్షగా చేసే వారు ఇలా పుస్తకం కి పూజ చేసుకుని ప్రారంభం చేయవచ్చు, హోమావిధానం తో చేసే పద్ధతి నిత్యపారాయణ చేసే సమయంలో అవసరం లేదు అని పెద్దలు చెప్తారు


లఘుపూజా : పుస్తకే - యంత్రేవా.

సంకల్పము చేసి (ఇక్కడ రాసిన విధంగా సంకల్పం) (నిత్య) పారాయణాంగ లఘుపూజాం చ కరిష్యే. గణపతి - కలశపూజానంతరము. (ఆనవాయితీగా పెట్టుకునే వారికే)

ఓం నమః పిశాచ నివర్తిని! త్రిశూలఖడ్గహస్తే సింహారూఢ। ఏహ్యేహి,

ఆగచ్ఛాగఛ్ఛ, ఇమాంపూజాం గృష్ణాగృహస్వాహా - సప్తశతీ సరస్వత్యై నమః -


ఆవాహయామి.


ఓం హ్రీం చండికాయై నమః - ఆసనం సమర్పయామి.


ఇదే మంత్రముతో అర్ఘ్యం - పాద్యం - ఆచమనీయం - స్నానము వస్త్రం - యజ్ఞోపవీతం - గంధం - ఆభరణాని - అక్షతాన్ - పుష్పాణి - ధూపం - దీపం - నైవేద్యం - తాంబూలం - నీరాజనం - సమర్పయామి.


అధ శాపోద్ధారః -


ఓం హ్రీం క్లీం శ్రీం క్రాం క్రీం చండికేదేవి శాపానుగ్రహం కురు కురు స్వాహా. (ఏడు మారులు జపించవలయును). 


ఉత్కీలనం : ఓం శ్రీం క్లీం హ్రీం సప్తశతిచండికే ఉత్కీలనం కురుకురుస్వాహా,

ఏం జపేత్. (ఇరువదియొక్క మారులు జపింపవలయును).


🌷 మంత్రం 🌷


🙏ఐం హ్రీం క్లీo చాముండాయై విచ్చే 🙏


పారాయణ సంకల్పము:- మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభనే ముహూర్తే శ్రీ శివ శివశంభోరాజ్ఞయా (శ్రీ మహావిష్ణో రాజ్ఞయా) ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/గంగా/గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ... సంవత్సరే...అయనే. ఋతౌ.. మాసే పక్షే. తిధౌ వాసరే శుభనక్షత్రే శుభయోగేశుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిధౌ సౌభాగ్యవతీ/ శ్రీమతీ/శ్రీమాన్...గోత్రా/గోత్రః..అహం....నామధేయా/నామధేయః-సౌభాగ్యవత్యా:/ శ్రీమత్యాః/ శ్రీమతః... గోత్రాయాః/ గోత్రస్య మమ నామధేయాయాః/ నామధేయస్య పతిపుత్రవత్యాః/ధర్మపత్నీ పుత్రసమేతస్య సకుటుంబాయా:/సకుటుంబస్య- ఉపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వర/ప్రీత్యర్ధం, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురా రోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్ధం, ధనకనక వస్తువాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాపదాం నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతోముఖా భివృద్ధ్యర్ధం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాంబికా ప్రీత్యర్ధం... శ్రీ.. దుర్గాంబికా ముద్దిశ్య, కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోప చార పూజాం కరిష్యే తదంగత్వేన ఆదౌపూజా సమయే నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం హరిద్రా గణపతిరూప మహాగణాధిపతి పూజాం కరిష్యే (అక్షతలు నీరు పళ్ళెములో విడువవలెను.)


గణపతి పూజ చేసి ప్రారంభించాలి, గణపతి స్మరణ ద్యానం చేసి దుర్గమ్మ పూజ , నావక్షరి జపం చేసి సంకల్పంతో ప్రారంభించి , పారాయణ మొదలు పెట్టాలి..పూర్తి ఐయ్యాక ఒక మాల చండీనావక్షరి జపం చేసి హారతి ఇవ్వాలి.. అమ్మవారికి ద్యానం అంటే ప్రీతి కనుక కాసేపు అమ్మవారిని ధ్యానించుకోవాలి.. 

ఒక రోజులో పూర్తి చేయగలిగితే ఉత్తమం అలా వీలు పడని వారు 9 రోజులు సమయం అలా నియమించుకుని పారాయణ చేయవచ్చు.


🌷శ్రీ మాత్రే నమః🌷

శ్రీ శూలినీ మాలా మంత్రమ్

 🌷శ్రీ శూలినీ మాలా మంత్రమ్🌷


వినియోగః ఓం నమో భగవతీ జ్వల జ్వల శూలినీ దుర్గా (పేరు). బాధిత సకల దుష్టగ్రహాన్ నాశయ నాశయ ఆం హ్రీం క్రోం శ్రీం క్లీం బ్లాం ఆం హ్రీం క్రోం హుం ఫట్ స్వాహా | ఓం హ్రాం దుం జ్వల జ్వల ప్రతిక్రియా శూలినీ దుర్గా దేవతాయై నమః

ఓం హ్రాం హ్రాం హ్రుం హ్రుం శ్రీం శ్రీం భం భం జ్వల జ్వల థః థః భం భం దుం దుం ఘేం ఘేం దుర్గే ఫట్ ఫట్ స్వాహా | ఓం నమో ఆది పరంజ్యోతి అంతర్నివాసాయై మహాకాళీ స్వరూపాయై అనంత కోటి మహా మండలే మండిత ప్రకాశ తేజోమయాయై అనంత విద్యా విలాసాయై అనంత బ్రహ్మాండ భాండోదరాయై అనంత కళ్యాణ గుణామృతే వాక్సుధా భూషణాయ మమ హృదయాంతర నివాసాత్మానాం మహాకాళీ దరితశమని క్షం భ్రాం భ్రీ0 భ్రూం, భ్రైం, భ్రౌ0, పరబ్రహ్మాయ మహారాజ సభా విద్యుత్ సర్వ సభాయాం స్థితి ప్రజ్ఞాం మమ వశం కురు కురు సర్వేషాం శతృ వాదీనాం జిహ్వా స్తంభనం కురు కురు అనంత మహాశక్తి సంయుక్త ముక్తి స్వరూపాయై మమ సర్వాభీష్ట ఫలప్రదాయై మమ సకల కార్య సిద్ధిం కురు కురు | సర్వ నాథాయై నమో నమః స్వాహా |


ఓం దుర్గా దేవ్యైచ విద్మహే | ఓం దుష్టా రిష్ఠాయ ధీమహి | 

తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసిసావధోమ్ ॥ 

ఓం విశ్వరూపయా విద్మహే | విరాట్ రూపాయ ధీమహి | 

తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసి సావదోమ్ ॥ 

ఓం ప్రతిక్రియాయ విద్మహే | ఓం ప్రతి శూలిన్యైచ ధీమహి | 

తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసి సావదోమ్ ॥ 

ఓం ఆది శక్యైచ విద్మహే | ఓం అమృతాంబాయై ధీమహి | 

తన్నో దుర్గా ప్రచోదయాత్ । ఓం పరోరజసి సావదోమ్ ॥


- స్తోత్రం :-


నానా మూర్తి మహప్రయోగినిపుణైః దుర్గ ప్రయోగ పునః

సర్వవ్యాధి నివారిణీం భయహరాం ధ్యాయేన్మహాశూళినీం


ఓం ద్రైం,సౌః వలవ ర్వా స్వా జ్వల జ్వల ప్రతి క్రియా శూలినీ దుర్గాపరమేశ్వర్యైనమః యథాశక్తి సర్వోపచార పూజాం సమర్పయామినమః

👉ఈ ప్రయోగం వల్ల మీ పైన చెడు ప్రయోగం ఏదైనా ఉంది అనుకున్న, మీపనులు ముందు కు వెళ్లలేదు, ఏ పని కలిసి రావడం లేదు, గ్రహ దోషాలు, వివాహ దోషాలు, రావాల్సిన డబ్బులు, మీ గురించి ఎవరైనా చెడు ప్రచారం చేసి ఇబ్బం పెట్టేవాళ్ళు, వివాహం ఆలస్యం కి ఉన్న అనేక ఆటంకాలు, శత్రు భయం, తరచూ ఎదో ఒక అనారోగ్యం కి గురి కావడం ఇలాంటి అనేక సమస్యలకు చాలా చక్కటి పరిహారం, రహుకాలం లో గుమ్మడి కాయతో దీపం పెట్టి అందులో కొన్ని గురి గింజలు వేసి నువ్వులు నూనె వేసి ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి తర్వాత మీ పని ఐయ్యే వరకు రోజూ 16 సార్లు జపం చేయాలి..ప్రతి అష్టమి, నవమి, మంగళవారం రోజు అమావాస్య రోజు మటుకు 108 సార్లు పారాయణ చేయండి..

అక్కడ పెరు అని రాసిన చోట మీరు ఇది వేరే వాళ్ళ కోసం కూడా చేయవచ్చు, అంటే తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోసం, భార్య భర్త కోసం, ఆపదలో ఉన్న బంధువులు స్నేహితులు అలా ఎవరి క్షేమం కోసం అయిన చేయవచ్చు..

తర్వాత ఆ గుమ్మడికాయ ని మరుసటి రోజు అవుకి తినిపించాలి, విదేశాల్లో ఉండేవారు గుమ్మడి దీపంపెట్టే అవకాశం లేని వారు ఆ మాల మంత్రం జపం లాగా చేయవచ్చు ఆ మంత్రం ఎక్కువ సార్లు పారాయణ లాగా జపించడం ముఖ్యం

నిన్న చెప్పిన పరిహారం మీరు ఏ గుమ్మడి కాయ అయినా వాడుకోవచ్చు అది కూష్మoడదీపం అంటారు.. చిన్నది అయితే సరిపోతుంది ఒకవేళ చిన్న గుమ్మడికాయ లు దొరకాకపోతే కొంచెం పెద్దగా ఉన్నా అది సగం గా కట్ చేసి దీపానికి వాడుకోవచ్చు మిగతా సంగం వండి ప్రసాదంగా పెట్టవచ్చు, గుమ్మడికాయ అవిరికి ఉడికిపోతుంది పోపు వేసి ఉడికించి , నైవేద్యం గా పెట్టి ప్రసాదం గా తీసుకోవచ్చు , పాయసం లాగా చేయవచ్చు హల్వా లాగా చేయవచ్చు అది మీ ఓపిక. ఏ గుమ్మడికాయ అయినా పర్వాలేదు , నేను చేసే పూజలో కూష్మoడ హారతికి గుమ్మడికాయ వాడుతాము..




🌷శ్రీ మాత్రే నమః🌷

భోజన నియమాలు


            

1. భోజనానికి ముందు,తరువాత తప్పక 

కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి. 

తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.


2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.


3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) 

తినే పళ్ళానికి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. 

చాలా దోషం.  


4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.


5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.


6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  


7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. 

ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  


8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  


9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.


10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.


11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.


12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు 

ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.


13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు. 

(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)


14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. 

అతిథులకు పెట్టరాదు.

    

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. 

(వెంట్రుకలు కత్తిరించడం)


16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే 

మనం తినగా మిగిలినవి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 


17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 

   

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

  

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 

   

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా 

భగవత్ కథలు వింటూ  వంట వండడం, 

భోజనం చేయడం చాలా ఉత్తమం. 


21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని 

ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 


22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు . 

ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.


24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.


25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.


26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు 

(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  

తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.


27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.

(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    


28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి. 

అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. 

నోరు నీటితో పుక్కిలించుకోవాలి.


29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  


30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని 

కఠోర నియమము.  

పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,

పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. 

అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

                          

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. 

ద్విపాక దోషం వస్తుంది. 


32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

Thursday, December 22, 2022

మంగళము

ఓం తచ్చం యోరావృ’ణీమహే | గాతుం యఙ్ఞాయ’ | గాతుం యఙ్ఞప’తయే | దైవీ” స్వస్తిర’స్తు నః | 

స్వస్తిర్మాను’షేభ్యః | ఊర్ధ్వం జి’గాతు భేషజమ్ | శం నో’ అస్తు ద్విపదే” | శం చతు’ష్పదే 


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః !


గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా స్సుఖినో భవంతు !!


కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ ! దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః


ఓం సర్వేత్ర సుఖినస్సంతు సర్వేసంతు నిరామయాః 

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దు:ఖ మాప్నుయాత్ 


శ్రేయోస్తు వాంచితమనొరథ సిద్ధిరస్తు కల్యాణమస్తు ధన ధాన్య సమృధిరస్తు

విద్యా వివేక నియోచన్నిస్తు పురాణాగోష్ట్యాం శ్రీ శ్రీనివాసా దయాయి యువయోస్తు నిత్యం

శతమానం భవతి శతాయు పురుషా అయుషేవింద్రియ ప్రతిదిష్ట్యతి


సర్వేజనా సుజనోభవంతు!! సర్వ సుజనేభవా సుఖినోభవంతు

స్సమస్తా లోకా  స్సుఖినో భవంతు !!లోకా స్సమస్తా స్సుఖినో భవంతు !!

సమస్తాలోక సన్మంగళాని భవంతు


సర్వేజనాస్సుఖినోభవంతు లోకాస్సమస్తా స్సుఖినోభవంతు

ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: 


శివుని ప్రార్థన శ్లోకాలు

నందీశ్వరుడు శ్లోకాలు

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

మహాదేవస్య సేవాార్థం అనుజ్ఞాం దేహిమేప్రభో 


శివలింగ దర్శనాంతర్గత నందీశ్వర శ్లోకం

వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయమ్ |

దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివ సన్నిధమ్ ||


వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,

వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్.


ధవళ వపుషౌ మిందోర్మండలే సన్నివిష్టం 

భుజగా వలయ హరమ్ భస్మ దిగ్దాంగా మీసం 

మృగయ పరసా పాణిం చారు చంద్రమౌళిమ్ 

హృదయ కమల మధ్యే చిన్తయామి


సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం

సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I

భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం

సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ 


కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్ర హారం |

సదా రమంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి ||


కైలాసే కమనీయ రత్న ఖచితే కల్పద్రుమూలే స్థితం |

కర్పూర స్ఫటికేందు సుందర తనుం కాత్యాయనీ సేవితం |

గంగోత్తుంగ తరంగ రంజిత జటా భారం కృపాసాగరం |

కంఠాలంకృత శేషభూషణమహం మృత్యుంజయం భావయే |


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే  |

జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ ||


నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ I

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ 


నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ I

విభూతి పాటీరవిలేపనాభ్యాం

నమో నమశ్శంకరపార్వతీభ్యామ్ 


ఓం అథాత్మానగ్‍మ్ శివాత్మానగ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ||

శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ |

గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ||

నీలగ్రీవం శశాంకాంకం నాగ యఙ్ఞోప వీతినమ్ |

వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ||

కమండల్వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ |

జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ||

వృష స్కంధ సమారూఢమ్ ఉమా దేహార్థ ధారిణమ్ |

అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ||

దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ |

నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ ||

సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణమ్ |

ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్ ||


ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-

జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్పూర్ణేందు-వాంతామృతైః |

అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్

ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం విప్రోஉభిషించే-చ్చివమ్ ||


బ్రహ్మాండ వ్యాప్తదేహా భసితహిమరుచా భాసమానా భుజంగైః

కంఠే కాలాః కపర్దాకలిత-శశికలా-శ్చండ కోదండహస్తాః |

త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః

రుద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్ ||


నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ |

నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ | 

యా త ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | 

శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ | 

యా తే’ రుద్ర శివా తనూరఘోరాஉపా’పకాశినీ | 

తయా’ నస్తనువా శంత’మయా గిరి’శంతాభిచా’కశీహి | 

యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | 

శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్|


శంభ’వే నమః’ | నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యంబకాయ’ 

త్రిపురాంతకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకంఠాయ’ మృత్యుంజయాయ’ 

సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||


నమః సోమా’య చ రుద్రాయ’ చ నమ’స్తామ్రాయ’ చారుణాయ’ చ 

నమః’ శంగాయ’ చ పశుపత’యే చ నమ’ ఉగ్రాయ’ చ భీమాయ’ చ 

నమో’ అగ్రేవధాయ’ చ దూరేవధాయ’ చ నమో’ హంత్రే చ హనీ’యసే చ నమ

ో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో నమ’స్తారాయ నమ’

శ్శంభవే’ చ మయోభవే’ చ నమః’ శంకరాయ’ చ మయస్కరాయ’ చ నమః’ శివాయ’ చ శివత’రాయ చ

త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధ’నమ్ | 

ఉర్వారుకమి’వ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మాஉమృతా”త్ |


ఓ౦ నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః

ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః

హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః

సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః

దివ్యాయ నమః దివ్యలింగాయ నమః

భవాయ నమః భవలింగాయ నమః

శర్వాయ నమః శర్వలింగాయ నమః 

శివాయ నమః శివలింగాయ నమః

జ్వలాయ నమః జ్వలలింగాయ నమః

ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః

పరమాయ నమః పరమలింగాయ నమః

ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్’ 

స్థాపయతి పాణి మంత్రం పవిత్రమ్ 



సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః 

భవే భవే నాతిభవే భవస్వ మామ్|భవోద్భవాయ నమః 


వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ-

శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః

కలవికరణాయ నమో బలవికరణాయ నమో 

బలాయ నమో బలప్రమథనాయ నమ

స్సర్వ-భూతదమనాయ నమో మనోన్మనాయ నమః 


అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః 

సర్వేభ్య-స్సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః 


తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 

తన్నో రుద్రః ప్రచోదయా”త్ 


ఈశానః-సర్వ-విద్యానా-మీశ్వర-స్సర్వ-భూతానాం

బ్రహ్మా ధిపతి-ర్బ్రహ్మణో ధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ |


త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం 

ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాஉమృతాత్ 


అమ్మవారి శ్లోకాలు

 సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య 

మౌళిస్ఫుర-త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ |

పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం

సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్||


విమలపటి కమలకుటి పుస్తక-రుద్రాక్ష-శస్త-హస్త-పుటీ|

కామాక్షి పక్షమలాక్షీం కలిటవిపంచీ త్వమేవ వైరించీ||  


హే  గౌరీ  శంకరార్ధాంగి  యధాత్వం  శంకర ప్రియే !

తధా మాంకురు   కళ్యాణి  కాంత  కాంతాం   సుదుర్లభాం !! 


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణీ

విద్యారంభం కరిష్యమి సిద్దిర్భవతు మే సదా ||


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే 

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే 


ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | 

చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |

యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ||


ఓం || జాతవే’దసే సునవామ సోమ’ మరాతీయతో నిద’హాతి వేదః’ |

స నః’ పర్-షదతి’ దుర్గాణి విశ్వా’ నావేవ సింధుం’ దురితాஉత్యగ్నిః ||

తామగ్నివ’ర్ణాం తప’సా జ్వలంతీం వై’రోచనీం క’ర్మఫలేషు జుష్టా”మ్ |

దుర్గాం దేవీగ్‍మ్ శర’ణమహం ప్రప’ద్యే సుతర’సి తరసే’ నమః’ ||


సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని 

మంత్రమూర్తి సదా దేవీ కనక మహాలక్ష్మీ నమోస్తుతే


పద్మప్రియే పద్మిని పద్మహాస్తే !

పద్మాలయే పద్మదలాయతాక్షి !

విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే !

త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ


కుందెందు దవళాకారం పూర్ణచంద్ర నిభానానము

స్వర్గపా వర్గదో పలప్రధాం వందే మహేశ్వరిo సదా

గౌరిం సువర్ణ వర్ణభాం స్వర్ణ పుష్ప నివాసినం

పాశాoకుశ దరామ్ భుతి దరాంచ శివవల్లాభం

సర్వా దేవాది దేవోభ్యో అవిర్భుతామితప్రభా

త్రిగుణాత్మికా మహాదేవి భుక్తిముక్తి ప్రదాయిని

కామేశ్వరి మహాదేవి పుత్రపౌత్రా ప్రవర్ధని

సౌభాగ్యం సతతిం విద్యాం దేహిమే జగదీశ్వరిం 


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం  శ్రీరంగ ధామేశ్వరీం

దాసీభూత సమస్త దేవ వనితాం  లోకైక దీపాంకురామ్

శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవత్‌  బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

సిద్ద లక్ష్మీ మోక్ష లక్ష్మీ  జయ లక్ష్మీ సరస్వతీ

శ్రీ లక్ష్మీ వరలక్ష్మీచ  ప్రసన్న మమ సర్వదా


ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణౖ

ర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌ |

గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలంగదాం

శంఖం చక్ర మధారవింయుగళం హసైర్వహన్తీం భజే


సూక్తిం సమగ్రేతు నః స్వయమేవ లక్ష్మీ: | 

శ్రీరంగరాజమహిషీ మధురైహి కటాక్షై:||

వైధగ్ధ్యవర్ణ గుణ గుంభన గౌరవార్యా | 

ఖoడోల కర్ణ కుహరాహ కవాయో దయంతి || 


మే॒ధాం మ॒ ఇంద్రో॑ దదాతు మే॒ధాం దే॒వీ సర॑స్వతీ । 

మే॒ధాం మే॑ అ॒శ్వినా॑వు॒భా-వాధ॑త్తాం॒ పుష్క॑రస్రజా


నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 


సర్వ మంగళ మాంగల్యే  శివే సర్వార్థ సాదకే

సరణ్యే త్రయంబకే దేవి  నారాయణి నమోస్తుతే


నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే 

శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||


ప్రధామా శైలాపుత్రీచ  ద్వితీయ బ్రహ్మచారిణి

తృతీయా చంద్ర ఘంటేతి  కుష్మాండేతి చతుర్థికీ

పంచమా స్కంద మాతేతి షష్టా కాత్యాయనేతిచ

సప్తమా కాళరాత్రీచ  అష్టమాచాతి భైరవీ

నవమా సర్వాసిద్ధిశ్చాత్  నవదుర్గా ప్రకీర్తితా


యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః

యదాగ్రే సర్వవేదాశ్చ  తులసి త్వాం నమామ్యహం


అవిద్యానామంత-స్తిమిర-మిహిరద్వీపనగరీ

జడానాం చైతన్య-స్తబక-మకరంద-స్రుతిఝరీ ।

దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ

నిమగ్నానాం దంష్ట్రా మురరిపు-వరాహస్య భవతి


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।

అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి

ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి


శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం

వరత్రాసత్రాణస్ఫటికఘటికాపుస్తకకరామ్ ।

సకృన్న త్వా నత్వా కథమివ సతాం సంన్నిదధతే

మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః భణితయః ॥ 15॥ వర్ ఫణితయః


కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం

పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్ ।

ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా

కదా ధత్తే వాణీముఖకమలతాంబూలరసతామ్


ధునోతు ధ్వాంతం నస్తులితదలితేందీవరవనం

ఘనస్నిగ్ధశ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే ।

యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో

వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీవిటపినామ్


రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్-

నివృత్తైశ్చండాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః ।

విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా

విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబలాః


శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా

మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ ।

యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ

యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖాః

వసంతః సామంతో మలయమరుదాయోధనరథః ।

తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం

అపాంగాత్తే లబ్ధ్వా జగదిద-మనంగో విజయతే ॥ 6 ॥


క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా

పరిక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ।

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః

పురస్తాదాస్తాం నః పురమథితురాహోపురుషికా ॥ 7 ॥


సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే

మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే ।

శివాకారే మంచే పరమశివపర్యంకనిలయాం

భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ॥


జపోజల్పశ్శిల్పం సకలమపి  ముద్రా విరచనా*

*గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతివిధిః l*

*ప్రణామః సంవేశ స్సుఖ మఖిలమాత్మార్పణ దృశా*

*సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్


ప్రాతః స్మరామి లలితావదనారవిందం

బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ।

ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ 


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ

నిర్ధూతాఖిల పాపనాసనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ

ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ (మాతా.. అన్నపూర్ణేశ్వరీ)


ఉభౌ దర్వీకుంభౌ మణికనకసంభావితగుణౌ

దధానా పాణిభ్యామమృతరసమృష్టాన్నకలితౌ I

కలాడ్యా కళ్యాణీ కలితసదనా శ్రీగిరిశిర

స్యసౌ భ్రామర్యంభా రచయతు మదిష్టార్థవిభవమ్ II


అన్నపూర్ణే సదాపూర్ణే  శంకర ప్రాణవల్లభే 

జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం బిక్షాం దేహి చ పార్వతి

మాతా చ పార్వతీ  దేవి పితా దేవో మహేశ్వరః 

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ 


గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి

శాకంభరీతి శశిశేఖర వల్లభేతి

సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై

తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః


సరసిజనయనే సరోజ హస్తే

ధవళతరాంశుక గంధమాల్యశోభే

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

 

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట

స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం

ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష

లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

 

కమలే కమలాక్ష వల్లబే త్వం

కరుణాపూర తరంగితై రపాంగైః

అవలోకయ మా మకించనానాం

ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః


అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, 

సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన 

వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ,

కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్


యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా

యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |

యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా

సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 


బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా

వారాహీ చైవ మాహేంద్రి చాముండి చైవ సప్తమి 

మహాలక్ష్మి అష్టమిచ ద్విభుజ సోనవిగ్రహ 

భద్రం పక్షమాలయంతు బ్రాహ్మి ముఖ్యాశ్చ మాతరోస్మాకం 


సింహాసనేశి లలితా మహారాఙ్ఞీ వరాంకుశా

చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ

సుందరీ చక్రనాథా చ సామ్రాఙ్ఞీ చక్రిణీ తథా

చక్రేశ్వరి మహాదేవీ కామేశీ పరమేశ్వరీ

కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తినీ

మహావిద్యా శివానంగా వల్లభా సర్వపాటలా

కులనాథామ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ

శృంగారనాయికా చేతి పంచ వింశతి నామభిః ( ఈ నామాలు పఠించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని హయగ్రీవుడు చెప్తాడు)


పంచ వింశతి

సింహాసనేశి లలితా మహారాఙ్ఞీ వరాంకుశా

చాపినీ త్రిపురా చైవ మహాత్రిపురసుందరీ

సుందరీ చక్రనాథా చ సామ్రాఙ్ఞీ చక్రిణీ తథా

చక్రేశ్వరి మహాదేవీ కామేశీ పరమేశ్వరీ

కామరాజప్రియా కామకోటిగా చక్రవర్తినీ

మహావిద్యా శివానంగా వల్లభా సర్వపాటలా

కులనాథామ్నాయనాథా సర్వామ్నాయనివాసినీ

శృంగారనాయికా చేతి పంచ వింశతి నామభిః ( ఈ నామాలు పఠించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని హయగ్రీవుడు చెప్తాడు)


పంచమి, దండనాథా, సంకేతా, సమయ సంకేత, వారాహీ, పోత్రిణి, వార్తాళి, శివా, మహాసేన, ఆజ్ఞా చక్రేశ్వరి, అరిఘ్ని