


హడావిడిగా వెళ్ళి, గబగబా గిరి ప్రదక్షిణ చేసేసి, అరుణాచలేశ్వరుని, అమ్మ అపీతకుచాంబాను దర్శించుకుని హుటాహుటిన తిరుగు ప్రయాణమవ్వడం కాదు, నిదానంగా ఒక నాలుగు రోజులు బస చేసి, ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకుని, అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుని, భగవాన్ రమణుల సన్నిధిలో దివ్యానుభూతిని పొంది, తిరుగు ప్రయాణం చేయాలి, ఇలా చేయాలంటే ముందే ఒక మంచి ప్రణాళిక, అందుకు సరిపడా డబ్బులు కూడబెట్టుకుని, వసతి సౌకర్యం ఏర్పాటు చేసుకుని వస్తే ఎంతో ఆనందంగా అరుణాచలం దర్శించుకోవచ్చు. వసతి కోసం ఆశ్రమాలూ, వసతి గృహాలు ఉన్నాయి వాటి వివరాలు ఇది వరకే పోస్ట్ చేశాను. భోజనాలకు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు, చాలా చోట్ల ఆశ్రమాలలోనూ, స్వచ్ఛంద సంస్థలలోనూ అన్న ప్రసాద వితరణ రోజంతా జరుగుతూనే ఉంటుంది, అన్న ప్రసాదం లభించే చోట్ల వివరాలు కూడా ఇది వరకే పోస్ట్ చేశాను. కనుక మీరు ముందుగానే మీ ప్రయాణం నిర్ధారించుకుని అరుణాచలం రండి ...






ఇక అన్నిటికంటే ముఖ్యమైన అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే పద్దతి గురించి తెలుసుకోవాలి. అసలు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన మొట్టమొదటివారు యెవరో తెలుసా ... సాక్షాత్తూ ఆ పరమేశ్వరుని అర్ధాంగి మన తల్లి ఆ అపీతకుచాంబా దేవియే, గౌతమ మహర్షితో కలిసి గిరి ప్రదక్షిణ చేసింది అంటే, ఆ గిరి ఎంత మహిమాన్వితమైనది అయ్యుండాలో ఆలోచించండి, అమ్మవారు చేసిన తరువాత శ్రీమహావిష్ణువు, బ్రహ్మదేవుడు గిరి ప్రదక్షిణ చేశారు, ఇక దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు నిత్యమూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని పురాణోక్తి. అటువంటి గిరి, శివ స్వరూపమైన ఆ పర్వతానికి మనమూ ప్రదక్షిణ చేసే భాగ్యం పొందడం మన పూర్వజన్మ సుకృతమ్, మన తల్లిదండ్రుల పుణ్యఫలం ...






ఇంతటి ప్రాశస్త్యం కలిగిన అరుణగిరి ప్రదక్షిణం మనం ఎలా చేయాలో ఆలోచించండి, ప్రదక్షిణ చేసిన ఫలితం ఏమిటో తెలుసా మన పాప కర్మలు భస్మమైపోయి, శివానుగ్రహం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతున్నది అని మనకు అనుభవపూర్వకంగా కూడా తెలుస్తుంది, ఇది నా స్వానుభవం కూడా, నాది మాత్రమే కాదు నాకు తెలిసిన ఎందరో జీవితాలలో అభ్యున్నతి చూస్తూనే ఉన్నాను, మీలో కూడా చాలామందికి కలిగే ఉంటుంది, మీ అనుభవాలు కూడా ఎప్పటికప్పుడు అందరికీ తెలియజేయమని నా మనవి. ఒకవేళ మీరు ఇప్పటివరకు అరుణాచలం ఇంకా వెళ్లనట్లైతే వెళ్ళిరండి, మీకు కుడా తప్పకుండా అనిర్వచనీయమైన శివానుభూతి కలుగుతుంది, గిరి ప్రదక్షిణ చేసేందుకు ప్రయత్నం చేయండి, చేయించండి ...



పుణ్యం లభిస్తుంది. నాలుగవ అడుగు వేయగానే
దీపదర్శన సమయాన ఒకసారి రాత్రి 11గం.లకు
ఒకసారి అని ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే
No comments:
Post a Comment