Wednesday, July 26, 2023

కుజదోష నివారణకు పరిహారం

 

🌿🌼🙏#కుజదోష నివారణకు పరిహారం 🙏🌼🌿
🌿🌼🙏కుజ దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్తుతి చేయాలి. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.🙏🌼🌿
🌿🌼🙏కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి.🙏🌼🌿
🌿🌼🙏కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి.🙏🌼🌿
🌿🌼🙏మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి. దుర్గాదేవిని స్తుతించాలి. 🙏🌼🌿
🌿🌼🙏మంగళవారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి. ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏బలరామ ప్రతిష్ఠిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి.🙏🌼🌿
🌿🌼🙏మంగళవారాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి.🙏🌼🌿
🌿🌼🙏మంగళవారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.🙏🌼🌿
🌿🌼🙏ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి.🙏🌼🌿
🌿🌼🙏నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి.🙏🌼🌿
🌿🌼🙏కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి.🙏🌼🌿
🌿🌼🙏మంగళవారం రాగిపళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకుడికి దానం ఇవ్వాలి.🙏🌼🌿
ఓం శం శరవణభవ

No comments: