Wednesday, February 1, 2023

భీష్మ తర్పణ విధి

భీష్మ ఏకాదశి సందర్భంగా...

మధ్యాహ్నం 12 గంటలకు తర్పణం ఇచ్చేటప్పుడు పఠించవలసిన సంకల్ప, తర్పణ, అర్ఘ్య శ్లోకాలు.

దక్షిణం వైపుకు తిరిగి

సంకల్పం:

యావత్ భూమండల శాంత్యర్ధం, మమ వంశాభివృధ్యర్ధం, భీష్మ దేవతా ప్రీత్యర్ధం, జల తిల తర్పణం కరిష్యే!


తిల తర్పణం:

(కొన్ని నువ్వులు చేతిలోకి తీసుకుని, బ్రొటన వేలు మీదుగా నీరు వదులుతూ...  మూడు మార్లు వదలాలి) 

వైయ్యాఘ్ర పధ్య గోత్రాయా, సాంకృత్య ప్రవరాయచ 

గంగా పుత్రాయ భీష్మాయా, ఆజన్మ బ్రహ్మచారిణే


జల తర్పణం:

కొన్ని నీళ్ళు దోసిట్లోకి తీసుకుని,  మూడు మార్లు అర్ఘ్యం వదులుతూ...

వసు నామావతారాయా, శంతనోరాత్మ జాయచ 

అర్ఘ్యం దదామి భీష్మాయా, ఆబాల్య బ్రహ్మచారిణే 

అపుత్రాయ దదామ్యేతత్, ఉదకం భీష్మ వర్మణే


సర్వే జనాః సుఖినోభవంతు

No comments: