*కమలాంబా సంరక్షితు*
(ప్రథమావరణ కీర్తనమ్)
రాగం: ఆనందభైరవి
గానం: రంజని - గాయత్రి
*కమలాంబా సంరక్షతు - రాగం – ఆనందభైరవి - మిశ్రచాపు*
(ప్రథమావరణ కీర్తనమ్)
పల్లవి:
కమలాంబా సంరక్షతు మామ్ హృత్కమల నగర నివాసినీ
అనుపల్లవి:
సుమనసారాధితాబ్జముఖీ సుందర మనః ప్రియకరసఖీ
కమలజానంద బోధసుఖీ కాంతాతార పంజరశుకీ
చరణం:
త్రిపురాది చక్రేశ్వరీ అణిమాది సిద్ధేశ్వరీ నిత్యకామేశ్వరీ
క్షితిపుర త్రైలోక్యమోహన చక్రవర్తినీ ప్రకటయోగినీ
సురరిపు మహిషాసురాదిమర్దనీ నిగమ పురాణాది సంవేదినీ
త్రిపురేశీ గురుగుహజననీ త్రిపురభంజనరంజనీ మధురిపు
సహోదరీ తలోదరీ త్రిపురసుందరీ మహేశ్వరీ
*భావం మరియు వివరణ*
*భావము:*
కమలాంబికా! ఆశ్రయించిన భక్తులకు కల్పవృక్షం వంటి దానా ; చండికా! కమనీయమైన ఎర్రని అంకుశము ధరించిన దానా ; చేతియందు లీలాశుకము కలదానా ; బ్రహ్మాది దేవతలచే పూజించ బడిన పాదములు కలదానా ; బహు వరములను ఇచ్చే దానా ; కమలాలయ తీర్థ వైభవము కలదానా ; మంగళ స్వరూపిణి అయిన శివా ; కరుణా సముద్రురాలా ; సకల లోకాలకు నాయికా ; సంగీత రసికురాలా ; మంచి కవిత్వం వ్రాయు శక్తిని ఇచ్చుదానా ; మాయకు అతీతురాలైన సుందరీ ; విదేహ ముక్తిని ప్రసాదించే నిపుణురాలా ; పాపములను హరించే దానా ; ఆకాశం మొదలైన పంచ భూతాలను చరణ కిరణాలుగా కలదానా ; మనోహరమైన చరణాలు కలదానా ; అరుణాంబికా, సకలా, గురుగుహ కరణా (కుమార స్వామికి తల్లి), సదాశివ అంతఃకరణా, అకచటతప మొదలైన వర్గ మాతృకా స్వరూపిణీ, అఖండైక రస పరిపూర్ణా, జగదంబికా, నన్ను రక్షింపుము.
*వివరణ*
ఈ కీర్తనలో, కమలాంబికా దేవి యొక్క నిర్గుణత్వము, సగుణ నిరాకారత్వము, సగుణ సాకారత్వము లను సూచించారు.
నిర్గుణత్వము సూచించే పదాలు: గతమాయే (మాయాతీత), అఖండైక రస పరిపూర్ణా.
సగుణ నిరాకారత్వము సూచించే పదాలు: శివే (శివ శక్తి స్వరూపం), చండికా, సుందరీ, సకలా, జగదంబికా జగదంబికా, సకల లోక నాయికా, అరుణా, కరుణార్ణవ.
సగుణ సాకారత్వము సూచించే పదాలు: కమలాసనాది పూజిత, కమల పద వినోద చరణ, వియదాది భూత కిరణ, కర విధృత శుక, సంగీత రసిక, సదాశివ అంతఃకరణా, కమలాలయ తీర్థ వైభవ.
అకచటతప అనేవి, అక్షర మాలలో, మొదటి అక్షరాలు. అనగా , సకల వర్ణమాల అని భావము. సూక్ష్మ మంత్రాక్షర రూపిణీ అని సూచన.
శ్రీ చక్రములో, మొదటి ఆవరణము భూపురము. భూపురంలో "మూడు" విభాగాలు ఉంటాయి.
`మొదటి భూపురము`:
రంగు - తెలుపు ;
శక్తులు - వామా, జ్యేష్టా, రౌద్రీ, అంబికా, పశ్యంతీ, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, శాంతా
నవ ముద్ర ఆకారములు - సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వ వశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వ ఖేచరి, సర్వ బీజ, సర్వ యోని
`రెండవ భూపురము`:
రంగు - రక్త వర్ణం
మాతృకలు - బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా, మహా లక్ష్మి. శ్రీదేవి సమిష్టి రూపములో ఉన్న సప్త ధాతువులే, ఈ మాతృకలు.
`మూడవ భూపురము`:
రంగు - పసుపు
శ్రీవిద్యకు సంబంధించిన మంత్రములు, కమనీయ రూపములో ఉండును.
`భూపురము సమిష్టిగా` ...
ఆకారము - చతురస్రం
పేరు - త్రైలోక్య మోహన చక్రం
ప్రకృతి - 'ల'కారము
తత్వము - పృధ్వీ తత్వము
దేవతా మూర్తులు / సిద్ధులు - తెలుపు రంగులో - 10 (దశ సిద్ధులు) - అంకుశము, పాశము, 2 పద్మములు ధరించి ఉంటారు - అణిమ, లఘిమ, మహిమ, ఈశిత్వము, వశిత్వ, ప్రాకామ్య, భుక్తి, గరిమ, ప్రాప్తి, సర్వకామ.
ఆవరణ యోగినులు - ప్రకట యోగినులు.
చక్రేశ్వరి - త్రిపురా దేవి
రసము - శృంగారము.
***
No comments:
Post a Comment