Friday, April 11, 2025

మంత్రపుష్పం భావం

🌻 మంత్ర పుష్పం  🌻

1  ఓం ధాతా పురస్తాద్య ముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః  చతస్రః

తమేవం విద్వానమృతమిహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే

భావ గానం:  అన్ని దిక్కుల నుండి రక్షించువానినోయి,  ముందు బ్రహ్మ పూజించి సుఖించెనోయి.  ఆ ఆది దైవమును తెలిసిన చాలునోయి, అదే అందరికి అమృత మార్గమ నోయి, వేరేది లేదని ఇంద్రుడు ప్రకటించె నోయి. 

2.  సహస్ర శీర్షం దేవం  విశ్వాక్షం విశ్వశంభువం

విశ్వం నారాయణం దేవం  అక్షరం పరమం పదం

భావగానం:   అంతటా తలలున్న దేవమోయి,  అంతటా కనులున్న దైవమోయి,  అన్ని లోకాల శుభ  దైవమోయి, విశ్వమంతానిండిన దైవమోయి, నశించని నారాయణుడోయి,  ముక్తి నీయు పరంధాముడోయి

3.  విశ్వతః పరమాన్నిత్యమ్  విశ్వం నారాయణగ్o హరిమ్

విశ్వమే వేదం పురుషస్త  ద్విశ్వ ముపజీవతి

భావగానం :  విశ్వము కన్నా ఉన్నతుడోయి,  అందరిలోనుండు ఆత్మోయి, శాశ్వత పోషకుడు 

సర్వాత్మడు పరమాత్ముడోయి, ఈ విశ్వ లోకాల కారకుడోయి ఆ దైవమే విశ్వానికి తోడోయి. 


5. నారాయణ పరో జ్యోతి రాత్మా  నారాయణః పరః 

నారాయణ పరమ్ బ్రహ్మ తత్వం నారాయణః పరః 

నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః

భావగానం: నారాయణుడే  పరమలోకము. నారాయణుడే జ్యోతిరూపము.  నారాయణుడే ఆత్మ రూపము. నారాయణుడే  పరబ్రహ్మము. నారాయణునే  ధ్యానిoచుము.  


6.   యచ్చకించి జ్జగత్సర్వం  దృశ్యతే శ్రూయతే౭ పివా

అంతర్బహిశ్చ తత్సర్వం  వ్యాప్య నారాయణ స్స్థితః

భావగానం:   చూసే దంతా  వినే దంతా  లోకమంతా  మారే దంతా  లోనా బైటా వుండే దంతా

పైనా కింద  వుండే దంతా  నారాయణుడే అ దంతా.     



No comments: