Sunday, October 13, 2024

శరన్నవరాత్రులు.. అమ్మవారి అలంకారాలు.. నైవేద్యం

 **

ఆశ్వీయుజ పాడ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ నవరాత్రుల్లో వివిధ అలంకారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే ఆయా రోజుల్లో పలు రకాల నైవేధ్యాలను అమ్మవారికి భక్తులు సమర్పించనున్నారు. ఈ దసరా వేడుకలకు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో కొలువు దీరిన దుర్గమ్మను...


*అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్... అంటూ భక్తులు పూజించనున్నారు.*



*తొలి రోజు: శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవియే నమ:*


*నైవేద్యం: తీపి బుందీ, శనగలు*


*చీర: ఆరెంజ్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


శ్రీబాలా త్రిపుర సుందరీదేవిని పూజిస్తే.. పూర్ణఫలం అందిస్తుందని భక్తుల విశ్వాసం



*రెండోవ రోజు: శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ గాయత్రి దేవియే నమ:*


*నైవేద్యం: రవ్వ కేసరి, పులిహోర*


*చీర: బ్లూ కలర్ చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


గాయత్రి అలంకారంలో అమ్మవారిని కొలిస్తే.. సకల మంత్ర సిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయని ప్రజల నమ్మకం



*మూడో రోజు: శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమ:*


*నైవేద్యం: పోంగలి*


*చీర: పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


అన్నపూర్ణ దేవిని ఆరాదిస్తే.. మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు.



*నాలుగో రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమ:*


*నైవేద్యం: పులిహోర, పెసర బూరెలు*


*చీర: గ్రీన్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగాను.. అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తులతో పూజలందుకుంటారు.



*ఐదో రోజు: శ్రీ మహా చండీ దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ మహా చండీ దేవియే నమ:*


*నైవేద్యం: లడ్డూ ప్రసాదం*


*చీర: రెడ్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


అమ్మవారి శక్తివంతమైన రూపాల్లో ఈ రూపం ఒకటి. చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారని ప్రజలు విశ్వసిస్తారు.



*ఆరో రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమ:*


*నైవేద్యం: క్షీరాన్నం, చక్కెర ప్రసాదం*


*చీర: పింక్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


ఈ మహాలక్ష్మి అవతారంలో మంగళప్రదమైన దేవతగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు.



*ఏడో రోజు: శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ:*


*నైవేద్యం: అటుకులు, బెల్లం, శనగపప్పు, కోబ్బరి ప్రసాదం*


*చీర: వైట్ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతి దేవి అవతారంలో అలంకరిస్తారు. సరస్వతిదేవిని సేవించడం వల్ల విద్యార్థులు అన్ని విద్యల్లో విజయం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు.



*ఎనిమిదో రోజు: శ్రీదుర్గా దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ దుర్గాదేవియే నమ:*


*నైవేద్యం: అల్లం గారెలు, నిమ్మకాయ ప్రసాదం*


*చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


ఈ అలంకారంలోని అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుస్తారు. కుంకుమార్చనలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.



*తొమ్మిదో రోజు: శ్రీ* *మహిషాసురమర్ధిని దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవియే నమ:*


*నైవేద్యం: చింతపండు పులిహోర, చక్ర పొంగలి ప్రసాదం*


*చీర: ఎరుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


ఈ రూపంలో అమ్మవారు సమస్త జీవరాశుల కష్టాలను తొలగిస్తుందని భక్తులు భావిస్తారు.



*పదో రోజు: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు.*


*మంత్రం: ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవియే నమ:*


*నైవేద్యం: పులిహోర, గారెలు ప్రసాదం*


*చీర: పచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.*


దసరా ఉత్సవాల చివరి రోజు అందరికీ అనందింప చేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మను ఈ అలంకారంలో సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తుల భావిస్తారు.

🙏💐🙏💐🙏💐🙏💐





🌹🙏నవరాత్రి  అలంకారాలు, ప్రసాదాలు 🙏🌹


1.శ్రీ బాలత్రిపురసుందరిదేవి.

పొంగల్ 


2 .గాయత్రి దేవి

పులిహోర, బూరెలు  


3 .అన్నపూర్ణా దేవి.

కొబ్బెరన్నం 


4 .లలితా దేవి

బెల్లం అన్నం.


5 .మహాచండి 

కదంబం ప్రసాదం


6  శ్రీ మహాలక్ష్మిదేవి 

రవ్వ కేసరి, పంచామృతాలు.


7 .సరస్వతి ( మూల నక్షత్రం )

దద్ధోజనం, పాయసం 


8. దుర్గాష్టామి 

అల్లం గారెలు, పులిహోర 


9. మహిషాసుర మర్ధిని

నిమ్మకాయ పులిహోర, పాయసం 


10. రాజ రాజేశ్వరి దేవి ప్రసాదం 

వివిధ ప్రసాదాలు 


🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹

No comments: