🌹భాభార్య భర్తల మధ్య సమస్యలు పరిస్కారంర్య భర్తల మధ్య సమస్యలు పరిస్కారం🌹
🌹1 .జాతకంలో రాహు , కేతువుల ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో చిక్కులు , సమస్యలు, విభేదాలు వస్తాయి. భార్య భర్తలు ఇరువురి మధ్య పరస్పర నిందారోపణలు అధికమై తీవ్రమైన విభేదాలు ఏర్పడుతుంది.
ఇటువంటి పరిస్థితులలో భార్య భర్తలు తమకు సమీపంలో ఉన్న నదీ, కొలను, లేదా సరస్సులో బుధవారం రోజు పుణ్య స్నానాలు ఆచరించి దగ్గరలో ఉన్న లక్ష్మీ నారాయణ ఆలయాన్ని లేదా విష్ణు ఆలయాన్ని దర్శించుకోవాలి. శక్తి కోద్దీ ఆలయంలో పూజలు లేదా అర్చనలు చేయించాలి. ఆలయంలోని ముఖ్య అర్చక స్వామికి కనీసం రూ.51/- లేదా అంతకన్నా ఎక్కువ దక్షిణ ఇచ్చి, పాదాబివందనం చేసి, అర్చక స్వామి వారి ఆశీస్సులు పొందాలి.
ఆ రోజంతా మౌనంగా ఉండి రాత్రి వేళలో చంద్ర దర్శనం/నక్షత్ర దర్సనం అనంతరం ఇరువురు కలిసి భోజనం చేయాలి. భర్త ముత్యపు ఉంగరం, భార్య పగడపు ఉంగరం ధరించాలి. ఈ విధంగా ఐదు బుధవారాలు చేయాలి. భార్య భర్తలు ఇద్దరి మధ్య పూర్తి అనుకూలంగా మార్పులు జరిగి, సుఖసంతోషాలతో దాంపత్య జీవితాన్ని సాగిస్తారు.
🌹2.భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వారికి వివాహం జరిగిన తేదీ (పంచాంగ తిథి) రోజున పుణ్య స్నానాలు ఆచరించి భార్య మెడలో వెండి గొలుసు, భర్త చేతికి వెండి బ్రాసిలేట్ ధరించి, దగ్గర లో ఉన్న అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి.
సాయంత్రం వేళ చంద్రుని/నక్షత్రాలను చూసి, భర్త యొక్క తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం మంచిది. ఇలా పన్నెండు నెలలు తప్పకుండా చేస్తే, దాంపత్య జీవితంలో అనుకూలంగా మార్పులు జరిగి, సుఖసంతోషాలతో దాంపత్య జీవితాన్ని సాగిస్తారు.
🌹3.చిలికి చిలికి గాలి వానై భార్యాభర్తల మధ్య తీవ్ర ఎడబాటు ఉన్న స్థితి ఏర్పడినప్పుడు, కుటుంబ సభ్యులు శతృవులుగా మారి హింసించే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ పరిహారం చేయాలి.
అతి సులువుగా లభ్యం అయ్యే పవిత్రమైన సప్తముఖి రుద్రాక్షను సేకరించి, శివుడిని పార్వతి అమ్మవారిని నిత్యం ఆరాధిస్తూ, దంతపుసారి పై లేదా సానరాయి పై శ్రీ గంధం మరియు సప్తముఖి రుద్రాక్ష యొక్క గంధమును సమపాళ్లలో తీసుకుని, శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తరువాత, సూర్యోదయానికి లోపల క్రమం తప్పకుండా 108 రోజుల పాటు నుదుటన ధరించాలి. ఇలా చేస్తే, భార్య భర్తలు ఇద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం జీవితాంతం కొనసాగుతుంది. ఇంటిలో సిరి సంపదలు పెరుగుతుంది. ఇంటిలోని వారికీ సమాజంలో మంచి గౌరవమర్యాదలు లబిస్తుంది.
🌹4.వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య తీవ్ర ఎడబాటు ఏర్పడి, పరిస్థితి విడిపోయే వరకు వస్తే ఈ పరిహారం చేయాలి. 11 శుక్రవారాలు "శ్రీ చక్రార్చన కుంకుమ పూజ, శ్రీ లలితా సహస్రనామంతో" సాయంత్రం దీపాలు పెట్టాక చేయించాలి. శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ అనంతరం, పట్టు రవిక, బొట్టు, గాజులు, కాటుక, అద్దం, అత్తరు, పాలకొవా, ఆకు వక్క, దక్షిణతో కలిపి ఐదుగురు ముత్తైదువులకు పాదములకు పసుపు రాసి, నుదుటన కుంకుమ బొట్టు పెట్టి వాయినం ఇవ్వాలి.
ఈ కార్యక్రమాన్ని మీరు ఉపవాసంలో ఉంటూ చేయాలి. తెల్లవారి నుండి మీరు ధాన్యాలతో చేసిన ఆహారం మాత్రం తీసుకోకూడదు. పాలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉపవాసం ఆచరించాలి. శ్రీ చక్రార్చన, పూజా కార్యక్రమము పూర్తయిన తర్వాత మీరు భోజనం చేయాలి. భార్యాభర్తల ఇరువురి మధ్య ఒకరిపై ఒకరికి మోహం పుట్టి జీవితం అంతా చక్కనైన సంసారంతో ఆనందమయంగా సాగుతుంది.
🌹5.భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు నిత్యం అవుతుంటే తాంబూలాన్ని మీ పూజ గదిలోని అమ్మవారికి సమర్పించి రోజూ ఇద్దరూ తినండి. ఇలా చేయడం వలన భార్యాభర్తల మధ్య మంచి అనోన్యత ఏర్పడుతుంది. అలాగే సంసారం లో చిక్కులు ఏర్పడి సుఖశాంతులు దూరం అయినపుడు, శుక్రునికి శాంతి చేయించడం వలన కూడా మంచి ఫలితం లబిస్తుంది.
🌹6.భార్యాభర్తల మధ్య పరస్పర ఆకర్షణ పెరిగి, ఎడబాటు తొలగాలి అంటే ఈ మంత్రం ఉచ్చారణ దోషం లేకుండా, మనస్సులో దృడంగా అన్యోన్య దాంపత్యం కోరుకొని రోజుకు 108 సార్లు తగ్గకుండా 11 రోజుల పాటు జపం చేయండి.
మంత్రం:-
ద్రాం ద్రవిణే బాణాయ నమః | ద్రీం సంక్షోభణ బాణాయ నమః | క్లీం ఆకర్షణ బాణాయ నమః | బ్లూం వశీకరణ బాణాయ నమః | సం సమ్మోహన బాణాయ నమః || ఇలా మంత్ర జపాన్ని పూర్తి చేసారంటే త్వరగా మంచి ఫలితం ఉంటుంది.
🌹7.భార్యాభర్తల మధ్య అనోన్యత కోరకు తేలికపాటి వశీకరణ తంత్రం : ఈ ప్రయోగానికి అత్తిపత్తి మొక్క (touch me not plant) కావలి. ఈ మొక్క మూడు రకాలుగా వుంటుంది. పసుపు రంగు పూలు పూచేది భూమిపై చిన్న మొక్కలుగా ఉంటాయి. గులాబీ రంగు పువ్వులు పూచేది పాదులా ఉంటుంది దీనికి ముళ్లు కూడ ఉంటాయి. తెల్లని రంగు పువ్వులు పూచేది కూడా పాదులా ఉంటాయి.
మనకు కావాల్సినది పసుపు రంగు పూలు పూసే బిజ్జాళ్ళు. ఈ అత్తపత్తి ని అమావాస్య రోజున సేకరించి, ఆ చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, దీప ధూప నైవేద్యం సమర్పించి, నేను నా అవసరార్థం నిన్ను తీసుకెత్తున్నాను అని నమస్కారం చేసి, ఆ మొక్కను వేళ్ళతో సహా తీసుకుని పూజామందిరంలో ఉంచి, మీ ఇష్ట దేవతకు దూప దీప నైవేద్యం సమర్పించి పూజలు చేసి, తర్వాత దానిని లామినేషన్ చేయించుకుని పెట్టుకోవాలి.
ఇలా పూజలు చేసి లామినేషన్ చేయించిన అత్తిపత్తి మొక్కను మీ జేబులో పెట్టుకుని వెళితే ఎలాంటి శత్రువులు అయినా మిత్రులు కావలసిందే. ఎంతటి వారైనా కూడా ఇది దగ్గర ఉన్న వారికి వశ్యం కాగలరు. భార్యాభర్తలు దీనికి తావీజు నందు పెట్టి ఇరువురు మెడలో దరించినా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు కలుగుతాయి.
🌹8.భార్యాభర్తల మధ్య అనుకూలతను పెంచే ప్రయోగం: ఈ ప్రయోగం భార్యాభర్తల మధ్య విభేదాలు, మనస్పర్థలు, వాదోప వాదాలు, అభిప్రాయభేదాలు వంటివి తలెత్తకొండ మంచి అనుకూలతను, సామరస్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రయోగాన్ని ఒక్కసారి చేసి, దీని ఫలితాన్ని నిరంతరం పొందవచ్చు. ఈ ప్రయోగం చేయడానికి ఒక తెల్లని కొత్త వస్త్రము, 2 వెండి నాణేలు, ఒక పిడికెడు గోధుమలు, ఒక పిడికెడు ఉప్పు రాళ్ళూ, ఒక పిడికెడు బెల్లం ముక్కలు సమకూర్చుకోవాలి. ఈ వస్తువులన్నింటినీ సమకూర్చుకున్న తరువాత, ఒక శుభ తిధి గల శుక్రవారం నాడు, తెల్లని వస్త్రం లో మిగిలిన అన్ని వస్తువులను వేసి, మూట కట్టి, భార్యాభర్తలు తమ గదిలో పెట్టుకోవాలి. దీనిని ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టుకుంటే చాలు. ఏ విధమైన పూజలు కానీ, మంత్ర జపం కానీ అవసరం లేదు. ఇలా చేయడం వలన భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఏర్పడి, మనస్పర్థలు, అభిప్రాయభేదాలు తొలగిపోతాయి.
🌹9. శక్తివంతమైన భార్య/భర్త వశీకరణ ప్రయోగం: ఈ ప్రయోగాన్ని భార్య లేదా భర్త ఎవరైనా చేయవచ్చు. అవతలివారిలో ప్రతికూలత, ద్వేషము, అయిష్టత వంటివి ఏర్పడినప్పుడు, ఈ శక్తివంతమైన వశీకరణ ప్రయోగాన్ని ఆచరించి తిరిగి దాంపత్య జీవితంలో అనుకూలతను, ప్రేమానురాగాలను, పరస్పర ఆకర్షణను సాధించవచ్చు.
ఈ వశీకరణ ప్రయోగాన్ని మంచి శుభ తిధి వున్న శుక్రవారం నాడు ప్రారంభించాలి. ముందుగా 5 లక్ష్మీ గవ్వలు (Lakshmi Cowries/Shells), 3 గోమతి చక్రాలు, ఎరుపు రంగు రోజా పూల రేకులు సమకూర్చుకోవాలి. లక్ష్మీ గవ్వలు మరియు గోమతి చక్రాలు పూజ సామగ్రి అమ్మే దుకాణాలలో లభిస్తుంది. మీరు పూజ చేసే ప్రదేశంలో చిన్న ట్రే లేదా ప్లేటు లో రోజా రేకులు పరచి, దాని పై ముందుగా ఉప్పు కలిపిన నీటితో తరువాత మంచి నీటితో శుభ్రం చేయబడిన 5 లక్ష్మీ గవ్వలను, 3 గోమతి చక్రాలను ఉంచాలి. వీటికి ధూప దీపాలను, మీకు వీలైన తియ్యటి నైవేద్యాలను సమర్పించాలి.
పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాత, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాల ముందు కూర్చుని "ఓం హ్రీం సః (అముక) వశమానయ స్వాహా" అన్న మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అముక అని బ్రాకెట్లలో వ్రాసిన చోట భార్య పేరును కానీ, భర్త పేరును కానీ పలకాలి. ఈ మంత్రాన్ని ప్రతి రోజూ 108 సార్లు అవతలివారిలో మీరు కోరుకున్న మార్పు వచ్చేంత వరకు జపిస్తూనే ఉండాలి. ప్రతి రోజు మంత్ర జపానికి ముందు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలకు అగరవత్తులు వెలిగించి, కొన్ని బెల్లం ముక్కలను నివేదనగా సమర్పించి, రోజా రేకులను మారుస్తూ ఉంటే చాలు. అప్పుడప్పుడు దీపారాధనతో విశేష పూజ చేస్తే మంచిది. ఈ తంత్ర ప్రయోగాన్ని భక్తి శ్రద్దలతో, పూర్తి విశ్వాసంతో ఆచరిస్తే, తప్పకుండా అవతలివారిలో మీరు కోరుకునే అనుకూలమైన మార్పు వస్తుంది.
🌹10. భార్యాభర్తల మధ్య ఆకర్షణ కొరకు శబరీ వశీకరణ ప్రయోగము : భార్యాభర్తల మధ్య ఎడబాటు, విభేదాలు తొలగి పోయి, ఇరువురి మధ్య మంచి ఆకర్షణ ఏర్పడడానికి, బార్యాభర్తలలో ఎవరైనా ఈ వశీకరణ ప్రయోగాన్ని చేయవచ్చు. ఇది నాథ్ సంప్రదాయం యొక్క శబర్ తంత్రానికి చెందిన చాలా శక్తివంతమైన వశీకరణ ప్రయోగము. శబర్ తంత్ర మరియు మంత్ర పద్ధతులు మీరు పూర్తి విశ్వాసంతో మరియు నమ్మకంతో సాధన చేస్తే, మీకు ప్రభావవంతమైన శీఘ్ర ఫలితాలను మీ సంపూర్ణ విశ్వాసం మరియు నమ్మకం మాత్రమే శబర్ మంత్రాల యొక్క శక్తిని ప్రేరేపించి, మీరు కోరుకునే ఫలితాలను మీకు అందిస్తుంది. కాబట్టి, మీరు సంపూర్ణ విశ్వాసం మరియు నమ్మకంతో శబర్ ప్రయోగాలను ఆచరించాలి. మీరు వరుసగా 41 రోజులు క్రింద ఇచ్చిన వశికరన్ మంత్రాన్నిప్రతి రోజూ కేవలం 21 సార్లు జపించాలి. మీరు ఈ పరిహారాన్ని మంచి శుభ తిధి వున్న రోజున ప్రారంభించాలి.
🙏మంత్రం🙏
ఓం నమో కామాక్షి దేవియో - (అముకి) వశ్ హో జా ముజే - తుజే గురు కి ఆన్ - బన్ జాయే మేరా కామ్ - నమో కామాక్షి కురు కురు ఫట్ స్వాహా ||
బ్రాకెట్లలో వ్రాసిన "అముకి" స్థానంలో, మీరు మీ జీవిత భాగస్వామి పేరును వ్రాసి, ప్రతిసారీ మీ జీవిత భాగస్వామి పేరుతో పాటు మంత్రాన్ని జపించాలి. మంత్రం చాలా చిన్నది మరియు సరళమైనది కావడంతో మీరు చాలా సులభంగా కేవలం కొద్ది నిమిషాలలో మంత్రం పఠనం పూర్తి చేయవచ్చు. ఈ ప్రయోగంలో ఎటువంటి పూజలు చేయాల్సిన అవసరం లేనందున, మహిళలు తమ నెలవారీ సమయంలో కూడా మంత్రాన్ని జపించవచ్చు. ఈ పరిహారాన్ని మీరు పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే, మీ జీవిత భాగస్వామిలో మీరు ఆశించే సానుకూల మార్పు ఖచ్చితంగా వస్తుంది.
🌹🙏శ్రీ మాత్రే నమః🙏🌹
No comments:
Post a Comment