🌷మాఘ మాసం🌷
మాఘ మాసం వచ్చే శుక్ల పక్ష చవితి రోజుని "తిల చతుర్థి , కుంద చతుర్థి అని కూడా అంటారు, ఈ రోజు నువ్వులను నువ్వులు తో చేసిన పదార్థాలు తినడం , నువ్వులతో వండిన ప్రసాదం పంచడం చేస్తారు. ఈ రోజున "డుంఢిరాజును" ఉద్దేశించి, నక్త వ్రతము పూజ చేస్తారు ,"కుంద చతుర్థి" నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్పించి రాత్రి జాగారణ చేసినవారు, సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మాఘమాసంలో ప్రాత:కాలంలో చేసే స్నాన,జప,తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు
దు:ఖ దారిద్ర్య నాశాయ, శ్రీ విష్ణోతోషణాయచ ప్రాత:స్నానం కరోమ్య, మాఘ పాప వినాశనం
అని చేసిన తరువాత
సవిత్రేప్రసవిత్రేచ! పరంధామజలేమమ! త్వత్తేజసా పరిబ్రష్టం,పాపం యాతు సస్రదా
అని చదవాలి.
ఈ మాసం శివారాధన కు సూర్యోపాసకులకుసాధనకు ఉత్తమమైన మాసం
సూర్య భగవానునికి ఆర్గ్యమివ్వాలి..
ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు.
★మాఘశుద్ద పంచమిని "శ్రీ పంచమి "అంటారు.
ఈ పంచమి నాడే సరస్వతీదేవి అవిర్భవించారు.
ఈనాడు "రతీ మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు.
ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని పూజిస్తారు.
★మాఘశుద్ద సప్తమి ఇదే "సూర్య సప్తమి, రథసప్తమి.
ఉదయం ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేయాలి స్నానికి ముందు చెరకుగడతో నీటిని కదిలించి , తర్వాత స్నానం చేయాలి.
ఈ రోజున *_చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే "శమంతకమణి" ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రథసప్తమి నాటి స్నానం "సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్క్షణాత్
అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.
◆భీష్మాష్టమి "మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్థివ!ప్రాజాపత్యేచ నక్షత్రే మధ్య:ప్రాప్తే దివాకరే!" శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్చంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందిన శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. *_భీష్మ ఏకాదశి_* నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం చాలా విశేషం, మాఘమాసం లో ఆదివారం రోజు రాత్రి సమయంలో అన్నం భుజించకూడదు ఏదైనా ఆల్ఫాహారం తీసుకోవాలి,
"శివరాత్రి" పర్వదినం భక్తులకు చాలా విశేషమైన పర్వదినం ఆ రోజు ఉపవాసం జాగరంతో భజనలతో శివ నామస్మరణ తో శివానుగ్రహం పొందుతాము హర హర మహా దేవ..
🌷🙏ఓం నమః శివాయ🙏🌷
No comments:
Post a Comment