Tuesday, March 26, 2024

గర్భిణీ దేవత

గర్భిణీ దేవత ఈ రూపం లో జగన్మాత ను గ్రీకు దేశంలో పూజిస్తారు, నిండు గర్భిణీ కి ఆ దేవత గా అలంకరణ చేసి పూజ చేయడం వారి సంప్రదాయం అదే వారికి శ్రీమంతం...

గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి
మాతృమూర్తులగు స్త్రీల కొరకు..
లలితా సహస్ర నామం నందు వరుసగా 98 వ శ్లోకం నుండి 110 వ శ్లోకం వరకు ఎటువంటి ఆహరం తీసుకోవాలో చక్కగా తెలపబడింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం.
విశుద్ధి చక్రనిలయా,‌ రక్తవర్ణా, త్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా 98
పాయసాన్నప్రియా, త్వక్స్థా, పశులోక భయంకరీ
అమృతాది మహాశక్తి సంవృతా, డాకినీశ్వరీ 99
అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా
దంష్ట్రోజ్జ్వలా,‌உక్షమాలాధిధరా, రుధిర సంస్థితా 100
కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా
మహావీరేంద్ర వరదా, రాకిన్యంబా స్వరూపిణీ 101
మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా 102
రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ 103
స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,‌உతిగర్వితా 104
మేదోనిష్ఠా, మధుప్రీతా, బందిన్యాది సమన్వితా
దధ్యన్నాసక్త హృదయా, కాకినీ రూపధారిణీ 105
మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,‌உస్థిసంస్థితా
అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా 106
ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ
ఆఙ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా 107
మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ 108
సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ 109
సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ
స్వాహా, స్వధా,‌உమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా 110
పై శ్లోకాలను అదే వరుసక్రమంలో పరిశీలిస్తే మాతృమూర్తులగు గర్భిణీ స్త్రీల ఆహార నియమావళి అవగతమౌతుంది
🔸 మొదటినెల
విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరాదేవతయే డాకినీ దేవతగా కొలువై వుంది. ఈ దేవత ఎర్రని ఛాయతో త్రినేత్రాలు కలిగి వుంటుంది. ఈమె ఖట్వాంగాన్ని, ఖడ్గాన్ని, త్రిశూలాన్ని ఆయుధాలుగా ధరించి, మొదటినెలలో గర్బస్థ శిశువునకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా పిండవృద్ధి జరిగేలా సంరక్షిస్తుంది. ఈమె త్వక్ స్థ. ఈమె చర్మమనే ధాతువునకు అధిదేవత. ఏ విధమైన చర్మరోగాలు సోకకుండా తేజోవంతమైన చర్మాన్ని శిశువునకు అనుగ్రహిస్తుంది. ఈమెకు పాయసాన్నం ప్రీతి. బియ్యంను పాలల్లో ఉడికించి, బెల్లం జోడించి, తదుపరి ఆవునెయ్యిని కలిపిన పాయసాన్నప్రసాదమును లలితా సహస్ర నామ పారాయణం చేసిన పిమ్మట నివేదనను చేసి, దానిని పవిత్రభావనతో గర్భిణీ స్త్రీ మొదటినెలలో స్వీకరిస్తే, చక్కగా పిండాభివృద్ధి జరుగుతుంది.
🔸 రెండవ నెల
అనాహత చక్రంలో శ్రీ లలితా పరాదేవత రాకిని దేవతగా కొలువై వుంది. ఈమె శ్యామ వర్ణంలో రెండు ముఖాలతో, అక్షమాల, శూలం, డమరుకం, చక్రాలను ధరించి యుంటుంది. ఈమె రుధిర సంస్థిత. రక్తం అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు స్నిగ్ధానం అంటే నేతి అన్నం ప్రీతి. ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదంను భక్తిశ్రద్ధలతో లలితా పారాయణం చేసిన పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ రెండవనెలలో స్వీకరిస్తే, శిశువు చక్కగా రక్తపుష్టితో వృద్ధి చెందుతుంది.
🔸 మూడవ నెల
మణిపూర చక్రంలో శ్రీ లలితా పరాదేవత లాకిని దేవతగా కొలువై వుంది. ఈమె రక్తవర్ణంలో మూడు శిరస్సులతో వజ్రం, శక్తి, దండం, అభయముద్రలను ధరించి యుంటుంది. ఈమె మాంస నిష్ఠ. మాంసం అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు గుడాన్నం అంటే బెల్లపు పొంగలి ప్రీతి. అన్నం, బెల్లం, ఆవునెయ్యిలతో తయారుచేసిన పొంగలి ప్రసాదంను లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ మూడవనెలలో స్వీకరిస్తే, శిశువు దేహంలో మాంసవృద్ధి గావిస్తుంది.
🔸 నాల్గవ నెల
స్వాదిష్టాన చక్రంలో శ్రీ లలితా పరాదేవత కాకిని దేవతగా కొలువై వుంది. ఈమె బంగారు ఛాయలో నాలుగు ముఖాలతో, శూలం, పాశం, కపాలం, అభయముద్రలు ధరించి యుంటుంది. ఈమె మేధో నిష్ఠ. మేధ అనే ధాతువుకు అధిదేవత. ఈమెకు దద్ధ్యన్నం అంటే పెరుగన్నం ప్రీతి. అన్నంలో ఆవుపాల పెరుగుతో కలిపిన ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి ప్రీతిగా నివేదన చేసి, సద్భావనతో గర్భిణీ స్త్రీ నాల్గవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు మేధావృద్ధి కలుగుతుంది.
🔸 ఐదవ నెల
మూలాధార చక్రంలో శ్రీ లలితా పరాదేవత సాకిని దేవతగా కొలువై వుంది. ఈమె ఐదు ముఖాలతో, అంకుశం, కమలం, పుస్తకం, జ్ఞానముద్రలను కలిగి యుంటుంది. ఈమె ఆస్థి సంస్థిత. ఎముకలు అనే ధాతువునకు అధిదేవత. ఈమెకు ముద్గౌదన అంటే కట్టుపొంగలి ప్రీతి. పెసరపప్పు, మిరియాలు, జీలకర్ర, ఆవునెయ్యితో కలిపిన అన్నప్రసాదాన్ని లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తితో గర్భిణీ స్త్రీ ఐదవ నెలలో స్వీకరిస్తే, శిశువునకు దృఢమైన ఎముకలు వృద్ధి చెందుతాయి.
🔸 ఆరవ నెల
ఆజ్ఞా చక్రంలో శ్రీ లలితా పరాదేవత హాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె శుక్రవర్ణంలో ఆరు ముఖాలుతో శోభిల్లుతుంది. ఈమె మజ్జా సంస్థ. మజ్జ అంటే ఎముకల లోపలున్న గుజ్జు. ఈమె మజ్జా దాతువునకు అధిదేవత. ఈమెకు హరిద్రాన్నం అంటే పులిహారం ప్రీతి. ఈ పులిహార ప్రసాదంను లలితా పారాయణం పిమ్మట అమ్మవారికి నివేదన చేసి, భక్తి విశ్వాసంలతో గర్భిణీ స్త్రీ ఆరవనెలలో స్వీకరిస్తే, శిశువు ఎముకలలో మజ్జాధాతువు వృద్ధి చెంది పరిపుష్టి పొందుతుంది.
🔸 ఏడవ నెల
సహస్రార చక్రంలో శ్రీ లలితా పరాదేవత యాకిని దేవతగా కొలువై యుంటుంది. ఈమె సర్వ వర్ణాలతో, సర్వాయుధాలను ధరించి యుంటుంది. ఈమె శుక్ల సంస్థిత. జీవశక్తికి అధిష్టాన దేవత. ఈమెకు సర్వోదన అంటే పాయసాన్నం, నేతి అన్నం, గుడాన్నం, దద్ధ్యన్నం, కట్టుపొంగలిహరిద్రాన్న ప్రసాదంలు ప్రీతి. ఈ ప్రసాదాలను వరుసక్రమంలో ఆరురోజులు లలితా పారాయణమనంతరం అమ్మవారికి నివేదన చేసి, సద్భావనతో అమ్మను స్మరిస్తూ గర్భిణీ స్త్రీ ఏడవ నెలలో స్వీకరిస్తే, శిశువు సంపూర్ణమైన దేహాకృతిని దాల్చి, పరిపూర్ణంగా వృద్ధి చెందుతుంది.
రఘుశర్మ
అమ్మ కామాక్షమ్మ తల్లి ఒకటే..
కామాక్షి అమ్మవారి దర్శనం శుభ ఫలితాలు ఇస్తాయి.శుక్రవారం అమ్మకు,గోత్ర నామాలతో అర్చన,మంచి ఫలితాలు ఇస్తాయి.
🔸 ఇక ఎనిమిదో నెల నుండి శిశు జననం వరకు
సంపూర్ణ భక్తి విశ్వాసాలతో శ్రీ లలితా అమ్మవారిని ఆరాధిస్తూ, క్షీరాన్నాన్ని నివేదన చేస్తూ, స్వీకరిస్తే,చక్కటి ఆయురారోగ్యాలతో ప్రజ్ఞావంతులైన తేజోమయ సంతానం కలగడం తధ్యం.
🌹శ్రీ మాత్రే నమః 🌹

Saturday, January 20, 2024

ఏదీ శాశ్వతం

 *✨ఏదీ శాశ్వతం* 

  🌹🌻🪷🦚🪻


*ఈరోజు మాట్లాడిన వ్యక్తి* 

*మళ్ళీ కలుస్తాడో లేదో ?* 

*మాట్లాడతాడో లేదో?*    

  

*ఏది శాశ్వతం ? ఎవరు నిశ్చలం?*


*రవీంద్రనాథ్ ఠాగూర్ గారి*

*అద్భుతమైన కవిత*


 *‼️"నేనిక లేనని తెలిశాక* *విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు.. కానీ మిత్రమా!* 

 *అదంతా నా కంట పడదు! ఆ* *విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!* 


 *‼️నీవు పంపించే పుష్పగుచ్ఛాలను* 

 *నా పార్ధివదేహం*  

 *ఎలా చూడగలదు?* 

 *అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!* 


 *‼️నా గురించి నాలుగు మంచి*  

 *మాటలు పలుకుతావ్ అప్పుడు* 

 *కానీ అవి నా చెవిన పడవు..* 

 *అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !* 


 *‼️నేనంటూ మిగలని నాడు* *నా తప్పులు క్షమిస్తావు నువ్వు !* 

 *కానీ నాకా సంగతి తెలీదు..* 

 *అదేదో ఇపుడే క్షమించేయలేవా?!* 


‼️ *నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది. కానీ,,,* *అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !* 


 *‼️నాతో మరింత సమయం* *గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది* 

 *అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!* 


 *‼️సానుభూతి తెలపడానికి* 

 *నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్..* 

 *సంవత్సరాలుగా మనం* 

 *ఏం మాట్లాడుకున్నామని?* 


 *ఇప్పుడే నావైపు చూడు,* 

 *నాతో మాట్లాడు, బదులు పలుకుతాను,* 

 *కాసేపైనా గడుపుతాను,* 

 *హాయిగా నీతో మెలుగుతాను!"* 

🌷


*ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*

                  

*జై శ్రీ రామ్ 🙏*


🦚🌻🌹🪻🪷🌈

Friday, January 19, 2024

భగవద్గీత సూక్తులు

 *భగవద్గీత సూక్తులు*


1. మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము. ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత భోధిస్తుంది.

2. శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము. మన శరీరము ఒక వస్త్రము వంటిది. వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు, ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెపుతాడు.

3. ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవలసినవారే. ఎవరు శాశ్వతము కాదు, కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది శాశ్వతమైనది. 

4. కోపమే అన్ని అనర్ధాలకు మూలము. నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి. మిగిలిన రెండు మోహము, ఆశ. కోపము లో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు, అప్పుడు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు.

5. కర్మను అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి.

6. ఈ జగత్తులో మార్పు అనేది సహజము. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఏదీ శాశ్వతము కాదు.

7.  ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు. ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు.

8. నిత్య శంకితుడికి భూమి మీదగాని ఇక ఎక్కడైనా గాని సుఖ శాంతులు లభించవు. ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకొనే ప్రయత్నము చేయాలి. అప్పుడే సుఖ శాంతులకు దగ్గర అవుతాడు. సంతోషాన్ని పొందగలడు.

9. కోరికలను జయించాలి లేదా అదుపుచేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది.

10. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులము అంతా భగవంతుని చేతుల్లో వున్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది.

11. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది... కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు... సింహం నోరు తెరుచుకుని కుర్చున్నంత మాత్రాన వన్య మృగం దాని నోటి దగ్గరకి వస్తుందా...?

12. మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది.

13. భగవద్గీత లో స్పష్టంగా వ్రాసి ఉంది!! దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని!! బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే!!! నీవు కాదని!!!

14. దాచిపెట్టిన ధనం పరులపాలు 
అందమైన దేహం అగ్నిపాలు 
అస్థికలన్నీ గంగ పాలు 
కొడుకు పెట్టిన తద్దినం కుడు కాకుల పాలు 
నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో?
కానీ నువ్వు చేసిన ధాన, ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు 
ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతి పాలు 

15. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నాధనమెంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్షు లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్షు ఇంత తరిగింది అని. 

16. భగవద్గీత కు మించిన స్నేహితుడు 
కాలాన్ని మించిన గురువు...
ఎక్కడ దొరకడు.

17. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు,
ఓడినవాడు విచారంగా ఉంటాడు,
అవి రెండూ శాస్వితం కాదని తెలిసిన వాడు 
నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు.

18. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే, ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనని తాను ద్వేషించుకుంటున్నట్లే, కష్టపడినచో పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది.

19. ఈ లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు.

నీదంటూ ఏదీ లేదు. నువ్వు మరణించిన తరువాత దేన్నీ తీసుకెళ్లలేవు భౌతిక, అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్లాలి.

20. జననం మరణం సహజం
ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు
వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు

జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు.

21. అతిగా స్పందించడం..అది కోపం.. అతి ప్రేమ.. అతి లోభం ఇలా అతి మంచిది కాదు. ప్రతి విషయంలో స్థిరంగా ఉండు. స్థిత ప్రజ్ఞతతో జీవించు. అతిగా సంతోషపడటం.. అతిగా బాధ పడటం రెండూ మంచివి కావు.

22. నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు, నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.

23. నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను..
ప్రాణుల సృష్టి, స్థితి, లయలు నేనే...

24. ఆత్మ చేధింపబడజాలదు..
దహింపబడజాలదు..
తడుపబడజాలదు.. 

25. మరణం అనివార్యం
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు
ఎవరూ అమరులు కాదు.

26. అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది!!! 

27.ఎవరైతే అనన్య భక్తితో నన్నే సేవిస్తుంటారో,

నిరంతరం చింతన చేస్తూ ఉంటారో, అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను... 

28. ఓడిపోయావని భాదించకు
మరల ప్రయత్నించి చూడు
ఈసారి విజయం నీ తోడు వస్తుంది

29. కుండలు వేరైనా మట్టి ఒక్కటే
నగలు వేరైనా బంగారం ఒక్కటే
అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే
అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ

30. గుర్తుంచుకో…ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు ఎం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది
భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.

31. మానసిక శాంతి లేని జీవితం వృధా
కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది

32. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నదీ ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ  తెలుసుకొని జీవించడమే.!

33. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టిన నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్న కాలం తప్పక శిక్షిస్తుంది.

34. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తూ భగవంతుడే  మానవునిగా పుట్టినా కూడా ఈ బాధలనుండి తప్పించుకోలేదు.
ఇహ మానవమాత్రులం మనమెంత.!

35. నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు.
యుక్తుడు కానీ వానికి ధ్యానం కూడా కుదరదు.
ధ్యానం లేనివాడికి  శాంతి లేదు.
శాంతి లేనివాడికి సుఖమెక్కడ ?

36. గురువులు ఎందరో 
సద్గురువులు ఎందరో
మార్గాలు ఎన్నో 
బోధలు ఎన్నో 
శోధనలు ఎన్నో 
కానీ
గురువులకు గురువు అయిన జగత్గురువు ఒక్కరే 
గీత తెలుపని 
మార్గాలు లేవు
బోధలు లేవు
సాధన లేదు.

37. అభ్యాసం కంటే జ్ఞానం 
అంతకంటే ధ్యానం 
దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి.
త్యాగం వలనే శాంతి కలుగుతుంది.

38. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్కపు
పట్టుగలది.  దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా 
అనిపిస్తుంది, ఓ కృష్ణా.

39. దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్ధ్యాలను నశింపచేస్తుంది. ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని నశింప చేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు...!!

40. అగ్నిని పొగ ఆవరించినట్లు,
అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,
గర్భస్త శిశువుని మావి కప్పినట్లు,
జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.

41. నీ మనస్సు యొక్క శక్తి చే నిన్ను నీవు 
ఉద్ధరించుకొనుము, అంతేకానీ పతనమైపోవద్దు.
ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.

42. జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు 
పతనమైపోతారు. విశ్వాసము లేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పర లోకంలో కూడా సుఖం ఉండదు. 

43. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి 
భగవద్గీతను మించిన ఆయుధం లేదు.

44. తెలివి, జ్ఞానం, మోహరాహిత్యం, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడము, లేకపోవడం,  భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి.

45. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి..  వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది.  కానీ..
ఏ ఒక్కరికి తమలో ఉండే "గర్వం" తెలుసుకునే తెలివి ఉండదు.

46. జీవితంలో వయసు ఉన్నపుడే భగవద్గీతను చదవండి! ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా.. ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి!

47. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును, రాగము, భయము, క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. 

48. నువ్వు కోరితే కోరినదే ఇస్తాను,
కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను.

49. నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో...
ఫలితాన్ని మాత్రం నాకు వదిలి పెట్టు!!

50.
నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపుణిత సీత 
నా దేశం కరుణాతరంగా 
నా దేశం సంస్కార గంగ 

భగవద్గీత ఆచరిద్దాము. ఆరాదిద్దాం.


సర్వం శ్రీకృష్ణార్పణం...

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

అష్టాదశ పురాణాలు

 అష్టాదశ పురాణాలు.......!!

1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.

2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.

3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.

4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.

5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.

6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.

7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.

8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.

9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.

10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.

11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.

12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.

13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.

14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.

15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.

16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.

17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.

18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.

_*⚜️ పసిడి పలుకులు 💫*_



_-{మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి !}-_

_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_

_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_

_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._

_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._

_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_

_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._

_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._

_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_

_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._

_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_

_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_

_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._

_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_

_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_

_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._
_మౌనంగావుండేవాడు ముని._
_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._
_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._
_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._

_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_

_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._

_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._

_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_

_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_

_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._

_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._

_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_

_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_
_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_

_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !

🔹🔸🔹🔸🔹🔸